covid omicron xe symptoms: కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు..

Published : Apr 09, 2022, 01:02 PM IST

covid omicron xe symptoms: ఒకటి పోతే ఇంటోకి మెడకు చుట్టుకున్నట్టు.. కరోనా మహమ్మరి మనల్ని విడిచిపెట్టి పోవడం లేదు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ , థర్డ్ వేవ్ అంటూ వచ్చింది సరిపోలేదన్నట్టు తాజాగా కరోనా కొత్త  XE వేరియంట్ వెలుగులోకి వచ్చింది.   

PREV
19
covid omicron xe symptoms: కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు..

covid omicron xe symptoms: చైనా నుంచి పుట్టుకొచ్చి ప్రపంచదేశాలను అతలాకుతలం చేసినా కరోనా మహమ్మారి ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకటిపోతే ఇంకోటి అన్నట్టు.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ ఎంతో మంది ప్రజల ప్రాణాలను తీసింది. ఇదీ సరిపోలేదన్నట్టు థర్డ్ వేవ్ అంటూ ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది. ఆ తర్వాత కాస్తకేసులు తగ్గుముఖం పడుతున్నాయనుకున్న సమయంలోనే కరోనా ఫోర్థ్ వేవ్ అంటూ ప్రపంచ దేశాల ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.  

29

కరోనాకు విరుగుడుగా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్.. బూస్టర్ డోస్ లంటూ ఎన్ని టీకాలను కనిపెట్టినా.. ఈ కరోనా మహమ్మారి మాత్రం మనల్ని విడిచిపెట్టడం లేదు. కొత్త కొత్త రూపాలతో వస్తూ మనల్ని పట్టి పీడిస్తోంది. 

39

ఇకపోతే తాజాగా కొత్త కోవిడ్ ఎక్స్ ఇ వేరియంట్ ను మొదటగా యూకే లో గుర్తించారు. అయితే ఈ వేరియంట్ కేసులు చైనాతో పాటుగా బ్రిటన్ లో కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. 

49

ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఈ కొత్త కోవిడ్ ఎక్స్ ఇ వేరియంట్ యే చాలా ప్రమాదకరమని వైధ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ వేరియంట్ కరోనా కంటే పదిరెట్లు వేంగంగా వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ప్రమాదకరమైన ఒమిక్రాన్ ఎక్స్ ఇ సబ్ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

59

చైనాలో కరోనా మళ్లీ వేగంగా వ్యాపిస్తోంది. దీనికి తోడు కొత్త వేరియంట్ అన్ని వేరియంట్ల కన్నా వేగంగా విస్తరిస్తూ అక్కడి ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇక ఇప్పుడు మన దేశంలోని ముంబై లో కూడా ఈ కొత్త వేరియంట్ తొలికేసు నమోదైంది. 

69

XE వేరియంట్ అనేది కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ అయిన SARS-CoV-2 ఉప-వంశాలు అయిన BA.1, BA.2ల రీకాంబినెంట్. దీంతో పాటు ఇది Omicron లేదా BA.1 లేదా BA.2లో లేని మూడు ఇతర ఉత్పరివర్తనాలను కలిగి ఉంది. అందుకే దీనిని XE అని పిలుస్తార‌ని బెంగళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా PTI కి చెప్పారు. 

79

పదిరెట్లు ఎక్కువ ప్రమాదం.. ఈ కొత్త ఒమిక్రాన్ ఎక్స్ ఇ సబ్ వేరియంట్ .. కరోనా బిఎ2 వేరియంట్ తో పోల్చితే పదిరెట్లు వేగంగా వ్యాపించగలదని WHO హెచ్చిరిస్తోంది.

89

జనవరిలోనే.. ఈ కొత్త ఒమిక్రాన్ ఎక్స్ ఇ వేరియంట్ ను మొదటిసారిగా బ్రిటన్ లో జనవరి 19న గుర్తించారు. ప్రస్తుతం బ్రిటన్ లో ఈ వేరియంట్ కేలు 600 లకు పైగానే నమోదయ్యాయని నివేధికలు తెలుపుతున్నాయి. ఇకప్రస్తుతం ఈ వేరియంట్ చైనా బ్రిటన్, అమెరికాలో దారుణంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి హాస్పటల్లలో చేరే వారి సంఖ్య దారుణంగా పెరుగుతుంది. కానీ మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉందని నివేధికలు తెలుపుతున్నాయి. ఇది మంచి విషయమే అయినప్పటికీ దీని బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉంది. 

99

కొత్త వేరియంట్ లక్షణాలు..  ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాల మాదిరిగానే ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ఉంటాయి. జలుబు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, తుమ్ములు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ కొత్తవేరియంట్ సోకకుండా ఉండాలంటే తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని చెబుతున్నారు.
 

Read more Photos on
click me!

Recommended Stories