ఇలా చేస్తే బరువు అస్సలు తగ్గరు.. ఇంకా పెరుగుతరు

First Published | Sep 19, 2024, 12:22 PM IST

బరువు తగ్గాలంటే ఎక్కువ తినకూడదు, తక్కువే తినాలి. జిమ్ కి వెళ్లాలి. వ్యాయామం చేయాలి. స్లిమ్ గా అవ్వలంటే సోషల్ మీడియాలో వందల్లో చిట్కాలు ఉంటాయి అనే మాటలు వెయిట్ లాస్ కావాలనుకునే వారికి పక్కవాళ్లు ఇచ్చే సలహాలు ఇలా ఉంటాయి. కానీ ఇవేవి వర్క్అవుట్ కావని చాలా మందికి తెలియదు. కానీ ఈ చిట్కాలే చివరికి మీరు లావుగా అయ్యేలా చేస్తాయి తెలుసా?
 

బరువు తగ్గాలని ఎవ్వరికి ఉండదు చెప్పండి. ఊరికనే బరువు పెరగాలని ఎవ్వరూ అనుకోరు. కానీ ఈ బిజీ లైఫ్ లో సరైన డైట్ ను పాటించకపోవడంతో మనకు తెలియకుండానే చాలా వరకు బరువు పెరుగుతున్నాం. ఇక బరువు పెరిగామని అనిపించగానే ముందుగా మనం చేసే పని.. సోషల్ మీడియాలో బరువు తగ్గడానికి ఏం చేయాలని వెతుకుతుంటాం.

 అలాగే తక్కువ తినడం స్టార్ట్ చేస్తాం. కానీ ఇలా తక్కువ తింటే బరువు తగ్గడం సంగతి అటుంచితే బరువు పెరుగుతామనే విషయం చాలా మందికి తెలియదు. బరువు తగ్గుతామని మీరు పాటించే కొన్ని చిట్కాలు మీరు బరువు పెరిగేలా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

అపోహ 1

కార్బోహైడ్రేట్లు తీసుకుంటే లావు అవుతాం..
 
సాధారణంగా మన శరీరానికి రోజుకు 225 నుంచి 325 గ్రాముల కార్బోహైడ్రేట్లు అవసరమవుతాయి. అయితే ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే మీరు పక్కగా బరువు తగ్గుతారు. ఈ విషయం తెలియకే చాలా మంది పిండి పదార్థాల వల్లే  బరువు పెరుగుతున్నామని అనుకుంటుంటారు.

దీంతో తినడం తగ్గిస్తారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడటమే కాకుండా.. బరువు మరింత పెరిగిపోతారు. మీరు బరువు తగ్గాలంటే జంక్ ఫుడ్, మైదా పిండికి దూరంగా ఉండండి. మీ రోజువారి ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా చేర్చండి. 
 


అపోహ 2

ఓన్లీ వ్యాయామం చేస్తేనే బరువు తగ్గుతాం

కొందరు బరువు తగ్గాలని రోజూ వ్యాయామం చేస్తుంటారు. కానీ మీరు ఎంత కష్టపడి వ్యాయామం చేసినా, జిమ్ లో చెమటలు చిందించినా బరువు తగ్గరు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.మీరు జస్ట్  కేవలం వ్యాయామంపై దృష్టి పెట్టి డైట్ ను ఫాలో కాకుంటే ఖచ్చితంగా బరువు తగ్గరు. బరువు తగ్గాలంటే  వ్యాయామం తో పాటుగా ఆహారంపై నియంత్రణ కూడా ఉండాలి. 
 

అపోహ 3

వెయిట్ లాస్ కోసం సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిదేనా.. 

కొంతమంది బరువు తగ్గాలని సప్లిమెంట్స్ ను కూడా తీసుకుంటుంటారు. కానీ ఇవి అంత ఎఫెక్టివ్ గా పని చేయవు. మంచి డైట్ ను ఫాలో అవుతూ రోజూ వ్యాయామం చేస్తే మంచి  ఫలితం ఉంటుంది. అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 

 అపోహ 4

 తక్కువ తింటే తొందరగా బరువు తగ్గుతారు.. 

తక్కువ తింటే  తొందరగా బరువు తగ్గుతామానే ఆలోచన చాలా మందికి ఉంటుంది. తక్కువ తింటే  బరువు తగ్గుతామాని అనుకుంటారు కానీ దీనివల్ల మీరు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక నిర్థిష్టమైన డైట్ ను సెట్ చేసుకుని కేలరీల పై శ్రద్ధ వహిస్తే ఇజీగా బరువు తగ్గుతారు. 

Latest Videos

click me!