కలల్లో రకరకాల వ్యక్తులతో శృంగారం చేస్తున్నారా? వాటి అర్థమేంటో తెలుసా?

First Published | Aug 24, 2021, 10:47 AM IST

ఈ కలలకు అర్థమేంటి? నిజంగా ఈ కలలు మీరు అలా సెక్స్ చేయాలని కోరుకుంటేనే వస్తున్నాయా? మీరు తప్పుగా ఆలోచిస్తున్నారా? విచ్చలవిడితనం వల్ల ఈ కలలు వస్తున్నాయా? మనసు పగ్గాలు లేకుండా పోతోందా? ఇలాంటి అనేక సందేహాలు కలుగుతాయి. కలలో నుంచి మెలకువ వచ్చాక... ఆ కల గురించి ఆలోచించి.. ఎందుకిలా కల వచ్చిందోనని మూడ్ పాడవడమూ మామూలే.

శృంగార కలలు.. సర్వసాధారణంగా అందరికీ వచ్చేవే. అయితే బైటికి చెప్పుకోరు. కొన్నిసార్లు ఈ కలలు విచిత్రంగా ఉంటాయి. ఛీ..ఛీ.. ఇలా వచ్చాయేంటీ అనుకుంటారు. బాస్ తోనో, కొలీగ్ తోనో, మాజీ ప్రియుడు లేదా ప్రియురాలితోనో...ఇంటి సభ్యులతోనో, స్నేహితులతోనో.. రోజూ కనిపించే వ్యక్తులతోనో సెక్స్ చేస్తున్నట్లు కలలు వస్తుంటాయి. ఇదే కోవలో వచ్చే మరో కల భాగస్వామి మీద ఆ రతిక్రీడలో ఆధిపత్యం చూపిస్తున్నట్లుగా వస్తుంది.

మరి ఈ కలలకు అర్థమేంటి? నిజంగా ఈ కలలు మీరు అలా సెక్స్ చేయాలని కోరుకుంటేనే వస్తున్నాయా? మీరు తప్పుగా ఆలోచిస్తున్నారా? విచ్చలవిడితనం వల్ల ఈ కలలు వస్తున్నాయా? మనసు పగ్గాలు లేకుండా పోతోందా? ఇలాంటి అనేక సందేహాలు కలుగుతాయి. కలలో నుంచి మెలకువ వచ్చాక... ఆ కల గురించి ఆలోచించి.. ఎందుకిలా కల వచ్చిందోనని మూడ్ పాడవడమూ మామూలే. అయితే ఈ కలలు అతి సాధారణం అంటున్నారు కలల నిపుణులు. అంతేకాదు వీటి అసలు అర్థం శృంగారం కాదని.. వేరే ఉందని చెబుతున్నారు. 


ఈ కలలు మీరు అనుకున్నదానికంటే చాలా సాధారణం. సెక్స్ కలలు మీ మానసిక స్థితి, మనస్తత్వం, లైంగికత, అపరాధభావనలను చాలా ఎక్కువగా అంచనా వేస్తాయి. సెక్స్ కలలు సాధారణమైనవి.. చాలా చాలా సాధారణమైనవి. మీ రిలేషన్ షిప్ స్టేటస్‌తో సంబంధం లేకుండా మీకు అలాంటి కలలు వస్తుంటాయి. దీని గురించి పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు. అంటే మీరు ఒంటరిగా ఉన్నా, రిలేషన్ లో ఉన్నా, పెళ్లి అయినా.. కాకపోయినా ఇలాంటి కలలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సాధారణ సెక్స్ కలలు, వాటి అర్థాలు తెలుసుకుంటే.. వాటిని సరిగా విశ్లేషణ చేసుకోవచ్చు. 

స్నేహితుడితో శృంగారం : ఇలాంటి కల రాగానే కంగారు, భయం, ఆందోళన కలుగుతాయి. అయితే దీంట్లో భయపడాల్సిందేమీ లేదని నిపుణులు అంటున్నారు. ఇది చాలా మంది వ్యక్తులకు వచ్చే అతి సాధారణ కల. దీని అర్థం మీరు మీ పని ప్రదేశంలో మీ పనితీరును మెరుగుపరుచుకుంటున్నారని అర్థం. భవిష్యత్తులో మీరు లీడర్ లేదా మేనేజర్‌గా చాలా పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. మీ స్నేహితుడితో సెక్స్ చేసినట్టు కలలు కనడం వల్ల స్నేహాన్ని దెబ్బతీస్తుందని అనుకోవద్దు. దీనికి కారణం మీ స్నేహితుడిలో మీరు బాగా ఆరాధించే లక్షణం ఉందని గ్రహించండి.

బాస్ తో సెక్స్ :  మీ బాస్‌తో సెక్స్ కలలు అంటే మీరు మీ బాస్ పట్ల లైంగికంగా ఆకర్షితులవుతున్నారని అర్థం కాదు, మీకు రావాల్సిన ప్రమోషన్ తొందర్లో పొందబోతున్నారని చెబుతున్నట్టు. అంతేకానీ అతనితో మీరేదో సంబంధం పెట్టుకోవాలనో, పెట్టుకుంటారనో కాదు. 

మాజీ లవర్ తో శృంగారం : మీరు మీ మాజీ లవర్ తో సెక్స్‌లో పాల్గొనాలని కలలుకంటున్నట్లయితే, మీరింకా తనను మరిచిపోలేదని.. ఆబంధానికి ఇక చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమయిందని అర్థం. ఆ వైఫల్యాలను మీరింకా మరిచిపోలేదని, అలాంటి తప్పులే పదే పదే చేస్తున్నారని, చేయవచ్చని సూచన. ఇది అది వర్తమానంలో లేదా భవిష్యత్తులో సమస్యలను కలిగిస్తుంది.

కుటుంబ సభ్యుడితో సెక్స్ : స్నేహితుడితో సెక్స్ కలలు ఎంత సాధారణమో.. కుటుంబసభ్యులతో సెక్స్ అనేది కూడా అంతే సాధారణం. కొన్నిసార్లు బాగా దగ్గరి బంధువులు, కుటుంబసభ్యులతో శృంగార కలలు వస్తాయి. అవి మిమ్మల్ని గిల్టీగా ఫీలయ్యేలా చేస్తాయి. అయితే దీనికి మీరు వారితో లైంగిక సంబంధం కోరుకుంటున్నారని కాదు. వారిలో మీకు బాగా నచ్చిన వ్యక్తిత్వ లక్షణం ఉంటే ఇలాంటి కలలు వస్తాయి. 

సెక్స్ లో ఆధిపత్యం : పడకగదిలో మంచం మీద మీరు మీ భాగస్వామితో ఆధిపత్యం వహించాలని కలలు కంటున్నట్లయితే, ఇది ఇప్పటికే మీ మధ్య ఉన్న కొన్ని అవకతవకలు, నియంత్రణ సమస్యలను హైలైట్ చేస్తుందన్నట్టు.  మీ పని, కెరీర్, భాగస్వామి, సంబంధం మొదలైనవాటిని నియంత్రించాలనే తీవ్రమైన కోరిక మీలో ఉందని అనుకోవచ్చు. మీరు మామూలుగా విషయాలను మీ ఆధీనంలోకి తీసుకోని వ్యక్తి అయితే.. పరిసరాల్లో అనేక విషయాలను, మీకు అవసరమైన వాటిపై మీరు మరింత నియంత్రణ తీసుకోవాలని చెప్పే సంకేతం ఈ కలలు. 

Latest Videos

click me!