శృంగారం: భ్రమలూ విశ్వాసాలూ... ఇవి నిజమేనా...

First Published Aug 31, 2020, 5:30 PM IST

లైంగిక క్రీడ విషయంలో కొన్ని అపోహలు, విశ్వాసాలు ఉండనే ఉంటాయి. సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు కూడా. అనుభవం ద్వారా రతిక్రీడ గురించి చాలా మంది చాలా విషయాలే తెలుసుకుంటారు. అయినా కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉండనే ఉంటాయి. అవి ఏమిటో చూడండి.

శృంగారంలో అపారమైన అనుభవం ఉండవచ్చు లేదా శృంగారంలో కొత్తగా పాల్గొంటూ ఉండవచ్చు. ఎవరికైనా లైంగిక క్రీడ విషయంలో కొన్ని అపోహలు, విశ్వాసాలు ఉండనే ఉంటాయి. సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు కూడా. అనుభవం ద్వారా రతిక్రీడ గురించి చాలా మంది చాలా విషయాలే తెలుసుకుంటారు. అయినా కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉండనే ఉంటాయి. అవి ఏమిటో చూడండి.
undefined
పీరియడ్స్ సమయంలో సెక్స్ చేస్తే గర్బం రాదనే విశ్వాసం ఉంది. పురుషుడు విడుదల చేసిన వీర్యం పీరియడ్స్ వల్ల బయటకు వచ్చే నెత్తుటితో పాటు బయపడుతుందని, లోన ఉండదని భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. పీరియడ్స్ సమయాల్లో సెక్స్ చేసినప్పుడు మహిళ పునరుత్పత్తి వ్యవస్థలో ఐదు రోజుల పాటు ఉండిపోయే గుణం వీర్యానికి ఉంది. అందువల్ల పీరియడ్స్ సమయంలో లైంగిక క్రీడ సాగిస్తే గర్భం రాదనేది తప్పుడు అభిప్రాయం మాత్రమే.
undefined
లైంగిక క్రీడలో పురుషులు, స్త్రీలు ఒకేసారి భావప్రాప్తికి గురవుతారనేది కూడా తప్పుడు అభిప్రాయం మాత్రమే. భావప్రాప్తికి సంబంధించిన విషయాల్లో స్త్రీపురుషులు చాలా మంది అపోహలకు గురవుతుంటారు. అందువల్ల పరస్పరం భావోద్వేగాలను పసిగడుతూ రతిక్రీడను సాగించాల్సి ఉంటుంది.
undefined
పురుషుడు యోని వెలుపల వీర్య స్కలనం చేస్తే మహిళలకు గర్భం రాదనే అభిప్రాయంలో కూడా పూర్తి నిజం లేదు. కొన్నిసార్లు తెలియకుండానే కొంత వీర్యం యోనిలో స్కలిస్తుంది. కొద్దిపాటి వీర్యం స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలోకి చేరినా గర్భం దాల్చే అవకాశం ఉంది. వీర్య స్కలనానికి ముందు వెలువడే ద్రవాల వల్ల కూడా స్త్రీ గర్భం దాల్చే అవకాశం ఉంది.
undefined
పురుషాంగం పెద్దగా లేకపోతే లైంగిక క్రీడలో సంతృప్తి కలగదనే అభిప్రాయం కూడా తప్పే. కావాల్సిందల్లా ప్రేమ, పాషన్, ఎమోషన్ అంతే. పెద్ద పురుషాంగం వల్ల రాపిడి ఎక్కువగా ఉంటుంది. కానీ సరైన టెక్నిక్, మోషన్, పొజిషన్ రతిక్రీడలో సంతృప్తిని కలిగిస్తాయి.
undefined
ఓరల్ సెక్స్ వల్ల కూడా గర్భం వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా పూర్తిగా తప్పు. పురుషుడు స్కలించే వీర్యం మహిళ పునరుత్పత్తి వ్యవస్థలోకి చేరకుండా గర్బం దాల్చడం సాధ్యం కాదు. నోరు ఏ మాత్రం పునరుత్పత్తి వ్యవస్థలో భాగం కాదు. అందువల్ల ఓరల్ సెక్స్ వల్ల గర్భం దాల్చడమనేది జరిగే విషయం కాదు.
undefined
పురుషులు ఎల్లవేళలా లైంగిక క్రీడకు సిద్ధంగా ఉంటారని చాలా మంది, ముఖ్యంగా మహిళలు అనుకుంటూ ఉంటారు. అది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. పురుషులకు మహిళల కన్నా సెక్స్ లో పాల్గొనే ఉత్సాహం ఉండవచ్చు. కానీ ఎల్లవేళలా వారు సెక్స్ చేయడానికి సిద్ధంగా ఉంటారనేది నిజం కాదు.
undefined
వృద్ధులు లైంగిక క్రీడ పట్ల ఆసక్తి చూపడాన్ని, అందులో పాల్గొనడాన్ని తప్పుగా చూస్తుంటారు. లైంగిక క్రీడ అనేది యువతకు సంబంధించింది మాత్రమే అనే అభిప్రాయం ఉంది. వృద్ధులు కాస్తా బలహీనంగానూ, అశక్తులుగానూ ఉండవచ్చు. కానీ లైంగిక క్రీడ పట్ల వారికి ఆసక్తి ఉండదనేది తప్పు.
undefined
click me!