లేడీస్.. శృంగారంలో ఈ తప్పులు చేయకండి..

First Published | Sep 30, 2021, 1:12 PM IST

ముఖ్యంగా అవి తప్పులు అని తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల సెక్స్ లో తాము తృప్తి పొందకపోవడమే కాదు.. తన భాగస్వామికీ విసుగు పుట్టిస్తారు. కాస్త చికాకు తెప్పిస్తారు. అలాంటివి ఏంటో తెలుసుకుంటే.. మీ మనసైన వారితో హాయిగా శృంగారాన్ని ఎంజాయ్ చేయచ్చు.

సెక్స్ విషయంలో ఆడవారికి అనేక అపోహలుంటాయి. వాటినుంచి ఏదోలా బయటపడినా.. శృంగారం సమయంలో ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు.. ఎలా కనిపించాలి.. భాగస్వామికి తను ఇలా కనిపిస్తే నచ్చుతానా? ఇలాంటి అనేక సందేహాలు వారిని వారిలా ఉండనివ్వవు. అలాంటి కొన్నింటికి వదిలేసి.. శృంగారం సమయంలో మీరు మీలా ఉండడానికి ప్రయత్నిస్తే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. 

ముఖ్యంగా అవి తప్పులు అని తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల సెక్స్ లో తాము తృప్తి పొందకపోవడమే కాదు.. తన భాగస్వామికీ విసుగు పుట్టిస్తారు. కాస్త చికాకు తెప్పిస్తారు. అలాంటివి ఏంటో తెలుసుకుంటే.. మీ మనసైన వారితో హాయిగా శృంగారాన్ని ఎంజాయ్ చేయచ్చు.


తాను ఎలా తయారైతే సెక్స్ లో ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టగలను.. శృంగారాన్ని మరింత ఆస్వాదించొచ్చు అని మరీ ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతారట.. అందుకే మీరు ఎలా కనిపిస్తున్నారు అనేదాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా..ఆ క్షణాల్సి ఆస్వాదించండి.

కొంతమంది లేడీస్ సెక్స్ టైంలో కూడా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఇది మాటలకు సమయం కాదు.. ఈ సమయంలో పెదాలు చేయాల్సింది మాటలు కాదు.. ముద్దులు పెట్టడం.. సో కీప్ ఆన్ కిస్సింగ్... అలాగే, సెక్స్ తరువాత ఏదైనా మాట్లాడాలని మీ పార్ట్ నర్ నుంచి ఆశించడం కూడా అంత మంచిది కాదంటున్నారు. 

బెడ్ మీద మీరే డామినెంట్ గా ఉండకండి. ఇది పురుషులకు అస్సలు నచ్చదు. మీరు తనను లొంగదీసుకోవాలని చూస్తున్నారని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. కొంతమందికి కొరకడం అలవాటు ఉంటుంది. సెక్స్ సమయంలో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటప్పుడు మీ భాగస్వామి హర్ట్ అవుతాడు.. దీంతో మీతో శృంగారం అంటేనే కాస్త భయపడతారు. 

ఇద్దరి మధ్య గొడవలు సహజమే. మీ భాగస్వామి చేసిన ప్రతీపని మీకు నచ్చాలని లేదు. అలాగని మీకు నచ్చని పని మీ భాగస్వామి చేస్తే.. కామ్ గా ఊరుకోకండి.. అడగండి..కానీ గొడవ పెట్టుకోకండి. అతని ఈగో హర్ట్ కాకుండా నెమ్మదిగా చెప్పండి. 

శుభ్రంగా ఉండడం అంటే.. క్లీన్ గా షేవ్ చేసుకోవడం ఒక్కటే కాదు.. మీ శరీరం మొత్తం ముఖ్యంగా రహస్యప్రదేశాలు.. క్లీన్ గా ఉండడం. దీనికోసం హైజీన్ మెయింటేన్ చేయాలి.

సెక్స్ లో డ్రామాకు స్థానం లేదు.. బెడ్ రూంలో డ్రామా బాజీ చేయడం.. నాకు ఇలా ఉంటేనే ఇష్టం.. ఇలాగే కావాలి.. అంటూ మంకు పట్టు పట్టడం కూడా మీ భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. కాస్త సర్దుకుపోవాలి. అప్పుడే ఇద్దరూ ఎంజాయ్ చేయగలుగుతారు.

ఆర్గాజమ్ విషయంలో అబద్దం ఆడకండి. మీరు సంతృప్తి పొందినట్టు నటించకండి.. అది వారికి నచ్చదు. అందుకే మీకు ఎలా అయితే సంతఋప్తి కలుగుతుందో చెప్పండి. అలా చేయడానికి ప్రోత్సహించండి. 

Latest Videos

click me!