మీకు ఇష్టమైన కలర్ ఏంటి? ఇది మీ గురించి ఎన్ని సీక్రేట్స్ ను చెప్తుందో..!

First Published | Feb 16, 2024, 9:54 AM IST

ప్రతి వ్యక్తికి ఇష్టమైన కలర్ ఒకటి ఉంటుంది. అయితే ఈ రంగు మన వ్యక్తిత్వం గురించి ఎన్నో రహస్యాలను చెప్తుంది తెలుసా? సాధారణంగా మనం మనకు ఇష్టమైన కలర్ బట్టలనే వేసుకుంటాం. మరి మనకు ఇష్టమైన కలర్ మన గురించి ఎలాంటి సీక్రేట్స్ ను చెప్తుందో తెలుసుకుందాం పదండి. 
 

ఒక వ్యక్తికున్న అలవాట్లు అతని వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే? మనకు ఇష్టమైన రంగు మీ వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు కూడా చెబుతుంది. ఏ రంగు మన గురించి ఎలాంటి విషయాలను చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఎరుపు

ఎరుపు రంగును ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు. వీళ్లు ప్రతిదాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ రిలేషన్ షిప్ విషయానికొస్తే ఈ వ్యక్తులు చాలా పర్ఫెక్ట్. వీళ్లు తమ మనస్సులోని మాటను నిర్మొహమాటంగా చెప్పేస్తారు. అలాగే పని ప్రాంతంలో వారి బాధ్యతలను కూడా చక్కగా నిర్వహిస్తారు. వీళ్లు తమ లక్ష్యం విషయంలో కేర్ లెస్ గా ఉండరు. 
 


నీలం

నీలం రంగును చాలా మంది ఇష్టపడతారు. ఇలాంటి వారు సంబంధాల్లో ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తారు. వీరు రొమాంటిక్ గా కూడా ఉంటారు. అలాగే వీళ్లు సంబంధాలను చక్కగా నిర్వహిస్తారు. ఈ వ్యక్తులు పోటీ కంటే ప్రోత్సాహకరమైన వాతావరణంలోనే పనిచేయడానికి ఇష్టపడతారు. వీళ్లు ఏ నిర్ణయమైనా భావోద్వేగాల ఆధారంగా తీసుకుంటారు.
 

ఆకుపచ్చ రంగు

ఆకుపచ్చ రంగును ఇష్టపడే వారు దూరదృష్టి, చాలా తెలివైనవారని నమ్ముతారు. వీళ్లు ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు మనసు చెప్పేదే వింటారు. వీళ్లు కొత్తదాన్ని నేర్చుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. 
 

పసుపు రంగు

పసుపు రంగును ఇష్టపడే వారు చాలా సరదాగా, ప్రేమించే, సంతోషంగా, అదృష్టవంతులని అంటారు. వీళ్లు తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో బాగా మాట్లాడటానికి ఇష్టపడతారు. ఈ గుణం వల్ల వీళ్లు త్వరగా స్నేహితులను పొందుతారు. అలాగే పని ప్లేస్ లో సృజనాత్మకంగా ఉంటారు . అందుకే వీళ్లను చాలా మంది ఇష్టపడతారు. 
 

నలుపు రంగు

బ్లాక్ కలర్ ను ఒక్క అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా బాగా ఇష్టపడతారు. ఈ కలర్ ను ఇష్టపడేవారు తమను తాము అత్యంత శక్తిమంతులుగా చూపించాలనుకుంటారు. ఈ వ్యక్తులు దృఢ నిశ్చయం, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అలాగే రిస్క్ తీసుకోవడానికి కూడా వీళ్లు భయపడరు. ఈ రంగంలో వీళ్ల పనితీరు బాగుంది.
 

గులాబీ రంగు

చాలా మందికి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలకు. ఈ కలర్ ను ఇష్టపడేవారు మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీళ్లు చాలా త్వరగా భావోద్వేగానికి లోనవుతారు. వీళ్లు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. వీరి వ్యక్తిత్వం స్వతంత్రంగా, ఉత్సాహభరితంగా ఉంటుంది.
 

తెలుపు రంగు

వీళ్లు చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే తమ చుట్టుపక్కల వారికి శాంతి కలగాలని కోరుకుంటారు. వీరు ఏదైనా ఆలోచనాత్మకంగా మాట్లాడటానికి ఇష్టపడతారు. అలాగే వీళ్లు చాలా దయగలవారు. తెలియని వారికి కూడా సహాయపడతారు. 
 

పర్పుల్ కలర్

పర్పుల్ కలర్ ను ఇష్టపడే వారు ఇతరుల ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు. స్వభావరీత్యా వీళ్లు తెలివైనవారు. అలాగే తమాషాగా కూడా ఉంటారు. జనాలకు సలహాలు ఇవ్వడానికి బాగా ఇష్టపడతారు. మీరు స్వభావరీత్యా స్వతంత్రంగా ఉంటారు. అలాగే వీరి ఆలోచనలను ఇతరులకు భిన్నంగా ఉంటాయి. 

Latest Videos

click me!