శరీరాన్ని వేడెక్కించి శృంగార సామర్థ్యం పెంచే ఔషధం ఇదే

First Published | Jul 13, 2020, 6:38 PM IST

శృంగారంలో లవంగాలు సమర్థమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు. శరీరాన్ని వేడిక్కెంచి జీవిత భాగస్వామితో శృంగారం చేసే సామర్థ్యాన్ని లవంగాలు పెంచుతాయట. 

మామూలుగా లవంగాలను వంటకాలకు వాడుతుంటాం. బిర్యానీలో ఎక్కువగా వాటిని ఉపయోగిస్తుంటాం. రోజు మూడు పూటలు లవంగాలు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత మూడు పూటలా లవంగాన్ని తింటే జీర్ణాశయం బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.
లవంగాలు జీర్ణాశయాన్ని, పేగులను శుభ్రం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం సమస్యలు తొలగిపోతాయి. ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. దగ్గు, జలుబులాంటివి దరికి చేరవు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ తొలి దశలో ఉంటే లవంగాల వల్ల తొలగిపోతుందని అంటున్నారు. క్యాన్సర్ తో బాధపడేవారు ఆ కణాలను లవంగాలు నాశనం చేస్తాయి. డయాబెటిస్ ను కూడా అదుపు చేస్తాయట. నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. శరీరంలో నీళ్లు ఎక్కువ చేరకుండా చూస్తుందని చెబుతున్నారు. తలనొప్పి వచ్చినప్పుడు పాలలో చిటికెడు లవంగాల పొడిని కలుపుకుని తాగితే వెంటనే తగ్గిపోతుందని చెబుతున్నారు.
అంతకు మించి శృంగారంలో లవంగాలు సమర్థమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు. శరీరాన్ని వేడిక్కెంచి జీవిత భాగస్వామితో శృంగారం చేసే సామర్థ్యాన్ని లవంగాలు పెంచుతాయట. వీలు చిక్కినప్పుడల్లా లవంగాన్ని నోట్లో వేసుకుంటే శృంగార కోరికలు ఎక్కువగా జనిస్తాయని అంటున్నారు.

Latest Videos

click me!