ఒంట్లో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఇదిగో ఈ పండ్లను తినండి

First Published | Nov 5, 2022, 4:07 PM IST

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. అయితే కొన్ని రకాల పండ్లు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి సహాయపడతాయి. 
 

cholesterol

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ఒక్క గుండె ఆరోగ్యం మాత్రమే కాదు మొత్తం శరీర ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ లో ఎక్కువ భాగం కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. మిగిలిన పరిమాణం మనం తిన్న ఆహారం నుండి వస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ ప్రమాదకరమైన కొలెస్ట్రాల్. శరీరంలో ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ధమనుల్లో కొవ్వు, మైనపు ఫలకాలు ఏర్పడతాయి.
 

cholesterol

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ఊబకాయం, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలు పెరుగుతాయి. ఆల్కహాల్ ను తాగడం, కొవ్వు పదార్థాలను తినడం, జీవన శైలి సరిగ్గా లేకపోవడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. కొన్ని పండ్లు ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎలాంటి పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 


apples

ఆపిల్స్

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఆపిల్స్ ఎంతో సహాయపడతాయి. ఆపిల్స్ లో పెక్టిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించుకోవడానికి రోజూ ఒక ఆపిల్ పండును తినండి. ఆపిల్స్ లో పాలీఫెనాల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
 

avocado

అవొకాడో

అవొకాడోలో ఉండే ఒలేయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. అవొకాడోలో పోషకాలు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రెగ్యులర్ గా అవొకాడోలను తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఊబకాయం ఉన్నవారిలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని పలు పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. 
 

అరటి పండ్లు

అరటిపండ్లలో ఫైబర్, ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్, సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ లు పుష్కలంగా ఉంటాయి. అరటి పండులో ఉండే పీచుపదార్థం, పొటాషియం లు కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను తగ్గిస్తాయి. ఈ పండులో కరిగే ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అరటి పండ్లను తింటే మీ శరీర ఆరోగ్యం బాగుంటుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
 

berries

బెర్రీలు
 
స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు వంటి రకరకాల బెర్రీల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నివారిస్తుంది. కొలెస్ట్రాల్ ఆక్సీకరణం చెందడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. బెర్రీలలో బయోయాక్టివ్ పదార్థాలు కూడా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. 

orange juice

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ కూడా ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆపిల్స్ మాదిరిగానే ఆరెంజ్ జ్యూస్ లో ఎక్కువ మొత్తంలో కరిగే ఫైబర్స్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. నారింజలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే బరువు సులవుగా తగ్గుతారు. ఇవి ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. 

Latest Videos

click me!