మన దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులకు నెలకు ఎన్ని లక్షల జీతమో తెలుసా?

First Published | Jan 8, 2025, 1:57 PM IST

 మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి , రాష్ట్రపతి, గవర్నర్లు.. ఎంతెంత జీతాలు అందుకుంటారో ఇప్పుడు చూద్దాం... 
 

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ వేతనం ఉంటుంది.  ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి, మనల్ని పాలించే ఉన్నత స్థాయి అధికారులకు.. ప్రభుత్వం తరుపున వేతనంగా ఎంత అందుతుందో తెలుసా? మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి , రాష్ట్రపతి, గవర్నర్లు.. ఎంతెంత జీతాలు అందుకుంటారో ఇప్పుడు చూద్దాం... 

1.భారత రాష్ట్రపతి జీతం...

భారత అధ్యక్షులు, దేశానికి అధిపతి, ప్రథమ పౌరులు. భారత రాష్ట్రపతి నెల వారీ జజీతం గా రూ.5లక్షల జీతం అందుుకుంటారు. దీనికి ఆ పదవిలో ఉన్నవారు ఎలాంటి పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.


2.ఉప రాష్ట్రపతి జీతం..
దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిని కలిగి ఉన్న భారత ఉప రాష్ట్రపతి. ఈ పదవిలో ఉన్నవారు నెలకు రూ.4లక్షల జీతం పొందుతారు. ఇవి కాకుండా.. అనేక ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా అందుతాయి. 

3.ప్రధాన మంత్రి జీతం..

భారత ప్రధాని నెలకు దాదాపు రూ. 2,80,000 ప్రాథమిక వేతనం పొందుతున్నారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి వేతనాన్ని నిర్ణయిస్తారు. దీనితో పాటు, అతనికి నివాసం, వాహనం , భద్రత వంటి అనేక సౌకర్యాలు కూడా అందుతాయి.

REVANTH REDDY

4.తెలంగాణ ముఖ్యమంత్రి జీతం..
ముఖ్యమంత్రుల జీవితం ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటుంది. రూ.1, 2500 నుంచి జీతం మొదలౌతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జీతం మాత్రం నెలకు  రూ.410,000. దీనితో పాటు నివాసం, టెలిఫోన్, ట్రావెల్ అలెవెన్స్ కూడా  అందుతాయి.

5.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జీతం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రూ.335,000 జీతం.. ఇతర ఇంటి, టెలిఫోన్ , ట్రావెల్ అలెవెన్స్ లు కూడా అందుతాయి.
 

Justice S Abdul Nazeer


6.గవర్నర్ల జీతం

భారత గవర్నర్లు నెలకు ₹3.50 లక్షల జీతం అందుకుంటారు. ఈ జీతం 2018లో సవరించారు. అప్పటి నుండి మారలేదు. గవర్నర్ జీతం  కొన్ని రాష్ట్రాల్లో  రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ఎక్కువే ఉంటుంది. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతం కంటే తక్కువగానే ఉంటుంది.
 

భారత ప్రధాన న్యాయమూర్తి జీతం


భారత ప్రధాన న్యాయమూర్తి నెలకు ₹2.80 లక్షల జీతం అందుకుంటారు. ఈ జీతం 2018లో సవరించారు. ప్రధాన న్యాయమూర్తి జీతం అతని బాధ్యతలు,  న్యాయవ్యవస్థ  ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతం

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నెలకు ₹2.50 లక్షల జీతం అందుకుంటారు. న్యాయమూర్తులు ఢిల్లీలో ప్రభుత్వ వసతిని పొందుతారు, ఇది వారి పదవీకాలంలో అందిస్తారు. న్యాయమూర్తులు , వారి కుటుంబాలకు ఉచిత వైద్య సదుపాయం ఉంటుంది.

IAS , IPS ల జీతం

IAS , IPS అధికారుల జీతం వారి స్థాయిని బట్టి మారుతుంది.  దానిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వీరికి వారి పోస్టును బట్టి రూ.50000 నుండి రూ.250000 వరకు జీతం లభిస్తుంది.

పార్లమెంటు సభ్యుని జీతం

భారత పార్లమెంట్‌లో పనిచేస్తున్న ఎంపీకి నెలవారీ ప్రాథమిక వేతనం రూ. 1 లక్ష. దీనితో పాటు, టెలిఫోన్ , ఇంటర్నెట్‌లో ఖర్చు చేయడానికి భత్యం ఇస్తారు. పని రంగంలో ప్రయాణించడానికి రైల్వే, విమాన ప్రయాణం లేదా ఇతర రవాణా మార్గాల కోసం భత్యం ఇస్తారు.
 

Latest Videos

click me!