Chanakya Niti:చాణక్య నీతి.. వీటికి దూరంగా ఉంటేనే జీవితంలో అనుకున్న పని చేస్తారు

First Published | Jan 1, 2025, 12:15 PM IST

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో విజయానికి  ఎన్నో సూత్రాలను వివరించాడు. చాణక్యుడి ప్రకారం.. కొన్ని అలవాట్లు ఎంత కష్టపడినా.. జీవితంలో విజయం సాధించకుండా ఆపేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Chanakya Niti

మనకు ప్రతి సందర్భంలో సరైన మార్గాన్ని చూపించే పండితులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఆచార్య చాణక్యుడు ఒకరు. శతాబ్దాలు గడిచిపోతున్నా.. ఈయన చెప్పిన విషయాలు మాత్రం నేటికీ మనకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. ఒక వ్యక్తిని విజయానికి దూరం చేసే కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఈ అలవాట్లు ఎవరికైతే ఉంటాయో వారు ఎప్పటికీ.. జీవితంలో విజయం సాధించలేరు. కాబట్టి ఏ అలవాట్లకు దూరంగా ఉంటే.. జీవితంలో అనుకున్నది సాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Chanakya Niti

సోమరితనం

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మీరు మీ జీవితంలో అనుకున్నది సాధించాలన్నా, ఇతరుల కంటే మీరు మెరుగైన జీవితాన్ని గడపాలన్నా సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఈ సోమరితనం వల్ల మన జీవితంలో మనం ముందుకు సాగలేం. అందుకే దీన్ని చెడ్డ అలవాటు అంటారు. సోమరితనమంటే ఏంటో కాదు.. ఉదయాన్నే నిద్ర లేవలేకపోవడం లేదా మంచం విడిచిపెట్టకపోవడం, ఇప్పుడు కాదు తర్వాత అంటు పనులను వాయిదా వేయడమే. సోమరితనంతో జీవించడమంటే ఆత్మహత్య కంటే తక్కువేం కాదని ఆచార్య చాణక్యుడు అంటాడు. మీరు గనుక విజయాన్ని సాధించాలనుకుంటే ఎలాంటి పనులైనా సరైన సమయంలోనే పూర్తి చేయడం అలవాటు చేసుకోండి. 


అహంకారం 

మనిషికి అహంకారం అస్సలు ఉండకూడదు. ఇతరుల కంటే మీరు కొంచెం మెరుగ్గా ఉన్నప్పుడు లేదా ఏదైనా మంచి చేసినప్పుడు గర్వ పడితే మీరు విజయాన్ని ఎన్నిటికీ అందుకోలేరని ఆచార్య చాణక్యుడు అంటాడు. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. అహంకారి ఏం పనులు చేసినా ఎంతో గర్వంగా ఫీలవుతాడు. అందుకే వీళ్లు చేస్తున్న పనుల పట్ల విజయాన్ని పొందలేరు. ఇలాంటి వ్యక్తి కొంచెం ఎదిగిన తర్వాత ఎంత అహంకారపూరితంగా ఉంటాడంటే అతను ఏది తప్పూ, ఏది ఒప్పో ఆలోచించడు. తనను తాను ఉత్తముడిగా భావిస్తాడు. స్వంత విజయానికి అడ్డంగా మారతాడు. 
 

chankya niti

దురాశ

ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి. దీనిలో తప్పు లేదు. కానీ ఈ కోరికలు కాస్త అత్యాశగా మారితేనే కష్టం. మనం ఎలాంటి కష్టం చేయకుండా ఒకదాన్ని సాధించాలనుకుంటే మీరు ఎన్నటికీ దాన్ని చేరుకోలేరు. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. అత్యాశపరుడు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేడు. దురాశనేది నెమ్మదిగా ఎక్కే విషం లాంటిది. ఇది మనలో ఉండే మంచి లక్షణాలను క్రమంగా నాశనం చేస్తుంది. అందుకే మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే అత్యాశకు బదులుగా కష్టపడి పనిచేయడం నేర్చుకోండి. అప్పుడే విజయం ఖచ్చితంగా మీ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది.
 

chankya niti

అబద్ధం 

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. అబద్దాలు ఆడటం చాలా చెడ్డ అలవాటు. అబద్ధం చెప్పడం వల్ల మీరు కొన్ని రోజులు గౌరవం పొందొచ్చు. విజయాన్ని సాధించొచ్చు. కానీ ఇది ఎక్కువ కాలం మాత్రం ఉండదు. అబద్దాలు చెప్పి విజయం సాధించిన వారు ఏదో ఒక రోజు తమ అవమానపాలవుతారని చాణక్యుడు తన పాలసీలో పేర్కొన్నారు.  మీరు నిజంతో విజయం సాధించాలనుకుంటే ఎప్పుడూ కష్టపడి పనిచేయడం నేర్చుకోండి. మంచి మార్గంలో నడవండి. 

Chanakya Niti

చూపించడం మానుకోండి

చూపించుకునే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది. కానీ ఇలాంటి అలవాటు మీకు భవిష్యత్తులో విలువ లేకుండా చేస్తుంది. మీరు విజయాన్ని చేరుకోలేకుండా చేస్తుంది. చిన్న చిన్న విషయాలను కూడా చూపించుకునే వారు జస్ట్ జోక్ గా మిగిలిపోతారు. ఆచార్య నీతి ప్రకారం.. ఒక వ్యక్తి జీవితంలో అనుకున్నది సాధించాలనుకుంటే నిశ్శబ్దంగా పనిచేయాలి. నిజానికి విజయానికి బాహ్య రూపం అవసరం లేదంటాడు చాణక్యుడు.

Latest Videos

click me!