చాణక్య నీతి ప్రకారం.. ఉదయాన్నే ఇలా చేస్తే డబ్బు బాగా సంపాదిస్తారు

First Published | Sep 27, 2024, 3:15 PM IST

ఆచార్య చాణక్యుడు తన పాలసీల్లో జీవితం గురించి ఎన్నో విషయాలను చెప్పాడు. అయితే చాణక్య నీతి ప్రకారం.. మీరు ఉదయాన్నే కొన్ని పనులు చేస్తే మీ ఆరోగ్యం బాగుండటంతో పాటుగా బాగా సంపాదిస్తారు కూడా. 
 

భారతదేశ చరిత్రలో ఎంతో మంది జ్ఞానవంతులు ఉన్నారు. వారిలో ఆచార్య చాణక్యుడు ఒకరు. ఈయనకు మన జీవితం గురించి తెలియని విషయమంటూ ఏదీ లేదు. చాణక్యుడికి కుటుంబ జీవితంలోని చిన్నచిన్న విషయాలపై కూడా ఎంతో అవగాహన ఉంది. ఆచార్య చాణక్యుడు తన విజ్ఞానాన్ని మొత్తం విధానాల రూపంలో వెల్లడించారు. 
 

ఆచార్య చాణక్యుడు ఇప్పుడు లేకపోయినా ఆయన విధానాలు మాత్రం మాత్రం ఎన్ని ఏండ్లైనా ఉంటాయి. ఈయన విధానాలను పాటిస్తే మనం జీవితంలో సక్సెస్ అవ్వడం ఖాయం. ఆచార్య చాణక్య విధానాలను పాటిస్తే మీన జీవితం ఆనందంగా, అందంగా మారుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి ఉదయం లేవగానే కొన్ని పనులను చేస్తే ఇంట్లో సంపదకు కొదవ ఉండదంటారు చాణక్యుడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


Chanakya Niti

ఆరోగ్యకరమైన జీవితం కోసం ముందు ఈ పని చేయండి

చాలా మంది నైట్ లేట్ గా పడుకుని ఉదయం లేట్ గా లేస్తుంటారు. కానీ ఆచార్య చాణక్య నీతి ప్రకారం.. ఉదయాన్నే  నిద్రలేచి.. రాత్రి త్వరగా నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాణక్య నీతి ప్రకారం.. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.

ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ధార్మిక దృక్పథానికి కూడా తోడ్పడుతుంది. మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి మీ దినచర్యను కంప్లీట్ చేసిన తర్వాత దేవుడిని పూజించాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మీ శరీరానికే కాదు మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అంటే ఇది మిమ్మల్ని శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

Chanakya Niti

ఉదయాన్నే ఈ పని చేయండి

మీ ఆరోగ్యంగా బాగుండాలంటే మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత కొంతసేపు వ్యాయామం చేయండి. మరికొంతసేపు ధ్యానం చేయాలని చాణక్య నీతి చెబుతోంది. వ్యాయామం, యోగా, మెడిటేషన్ లు మీ శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉంచడానికి సహాయపడతాయి.

దీంతో మీకు ఎలాంటి వ్యాధులు రావు. రోజూ ఉదయాన్నే మీరు ఈ పనులను మర్చిపోకుండా చేస్తే మీ శరీరంతో పాటుగా మీ మనసు కూడా హెల్తీగా ఉంటుంది. మానసిక  ఆరోగ్యానికి  యోగా, ధ్యానం, వ్యాయామం కూడా సహాయపడతాయి. 

Chanakya Niti

జీవితంలో ముందుకు సాగాలంటే ఈ పనులు చేయండి

చాణక్య నీతి ప్రకారం.. ఉదయం లేచిన తర్వాత స్నానం చేయాలి. తర్వాత సూర్యభగవానునికి నీటిని సమర్పించండి. మతపరంగా సూర్యభగవానుడికి నీటిని సమర్పించడం ఎంతో పవిత్రంగా, శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఇలా సూర్యభగవానుడికి నీటిని సమర్పిస్తే మీరు జీవితంలో మంచి పురోగతిని సాధిస్తారంటారు. 

సూర్య భగవానుడికి నీళ్లను సమర్పించిన తర్వాత కొద్దిసేపు ధ్యానం చేయండి. అలాగే ఇష్టదైవాన్ని పూజించాలని చాణక్య నీతి చెబుతోంది. అలాగే జపమాలతో భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండండి. ఆ తర్వాత నుదుటికి, గొంతుకు గంధాన్ని పెట్టుకుని మీ డేను స్టార్ట్ చేయండి. వీటిని రెగ్యులర్ గా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా జీవితంలో ఖచ్చితంగా ముందుకు సాగుతారని చాణక్య నీతి చెబుతోంది.
 

Latest Videos

click me!