మీ లక్ష్యాన్ని ఎవరికీ చెప్పొద్దు
మీరు అనుకున్న పని జరగాలన్నా, విజయం సాధించాలన్నా మీ గమ్యాన్ని చేరుకునే వరకు ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకండని ఆచార్య చాణక్యుడు అంటాడు. మీ లక్ష్యాలను, ప్రణాళికలను ఇతరులతో పంచుకుంటే దానిపై ప్రతికూలత ఏర్పడుతుంది. దీంతో మీ లక్ష్యాన్ని సాధించడంలో ఇతరుల అసూయ, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అహంకారం వద్దు
జీవితంలో సక్సెస్ ఫుల్ వ్యక్తిగా ఎదగాలంటే మాత్రం మీకు అహంకారం అసలే ఉండకూడదు. గర్వపడే వ్యక్తి ఎన్నటికీ ఎదగలేడు. అహంకారం మనిషికి శత్రువు వంటిది. ఎందుకంటే మనస్సులో అహంకార భావన కలిగితే ఈ ప్రపంచం మొత్తం అతని ముందు పాలిపోయినట్టుగా అనిపించడం మొదలవుతుంది.
ఇక్కడినుంచే అతని పురోగతికి ఆటంకం కలగడం స్టార్ట్ అవుతుంది. జీవితంలో విజయవంతమైన వ్యక్తి కావడానికి అహంకారాన్ని విడిచిపెట్టడం చాలా ముఖ్యమంటాడు ఆచార్య చాణక్యుడు.