పెళ్లైన ప్రతీ మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది. తన కల ఫలించిన వేళ తీసుకునే ఆహారంతో పాటు అనేక విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనికి తోడు ఇంట్లో పెద్దలు కొన్ని ఆహారాల్ని గర్భిణీ సమయంలో తినొద్దని ఖచ్చితంగా చెబుతుంటారు. అందులో ముందు వరుసలో ఉండేది పొప్పడిపండు.
గర్భిణిగా ఉన్న సమయంలో పొప్పడిపండు తినడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని పెద్దలు హెచ్చరిస్తారు. దీనికి కారణం ఏంటంంటే పొప్పడిపండును తెంపినప్పుడు దాని నుంచి కారే తెల్లటి పదార్థం. ఇది ఒక ఎంజైమ్. దీంట్లో లేటెక్స్ ఉంటుంది. ఇది గర్భస్రావానికి దారి తీస్తుందని అంటారు. అయితే ఇందులో నిజమెంత?
అయితే.. గర్భిణీ సమయంలో బొప్పాయి తినడం నిజంగానే ప్రమాదకరమా? దానివల్ల గర్భస్రావం అవుతుందా? ఎన్నో పోషకవిలువలు, విటమిన్లు పుష్కలంగా ఉండే పపాయా నిజంగా అంత అనారోగ్యకరమా? చూద్దాం.
పొప్పడి పండులోని ఎంజైమ్ లు ప్రోస్టోగ్లాండిన్ ను విడుదల చేయడానికి దోహదపడతాయి. ప్రోస్టోగ్లాండిన్ గర్భాశయం సంకోచించేలా చేస్తుంది. దీనివల్ల గర్భవిచ్చిత్తి అయ్యే అవకాశాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
2002లో ఎలుకల మీద చేసిన ఓ అధ్యయనంలో పండిన బొప్పాయి తిన్న ఎలుకల్లో ఎలాంటి ప్రభావం కనిపించలేదు. అవి సురక్షితంగానే ఉన్నాయి. అదే సమయంలో పచ్చి బొప్పాయిపండు తిన్న ఎలుకల్లో అబార్షన్, సమయం కంటే ముందే డెలివరీ అవ్వడం కనిపించింది.
అయితే మనుషుల మీద ఇలాంటి ప్రయోగాలు జరగలేదు. అంతేకాదు ఏ అధ్యయనం కూడా బొప్పాయి వల్ల అబార్షన్ అవుతుందన్నదానికి ఖచ్చితమైన ఆధారాలు చూపలేదు. అయితే, గర్భిణిలు పచ్చి బొప్పాయికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.
బాగా పండిన బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కానీ అదే పచ్చి బొప్పాయి వల్ల గర్బాశయ గోడలు సంకోచానికి గురవ్వడం, జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా తొలిసారిగా గర్బిణులుగా మారిన వారిలో మాత్రమే కనిపిస్తుంది.
బొప్పాయిలో కెరోటిన్ ఉంటుంది. ఇది వాస్కులర్ ప్రెజర్ కు దారి తీస్తుంది. దీనివల్ల ప్లాసెంటాలో ఇంటర్నల్ బ్లీడింగ్ కు దారి తీస్తుంది. అందుకే గర్భిణులు బొప్పాయి తినాలనుకుంటే.. తినేముందు తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాల్సిందే.
బొప్పాయి పండు తినడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ సింథసిస్ అవుతుంది. ఈస్ట్రోజన్ వల్ల గర్బాశయ గోడలు సంకోచిస్తాయి. దీనివల్ల తొందరగా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటికి సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా ముందుగా మీరు వైద్యుల్ని సంప్రదించాలి.
బొప్పాయి పండు తినడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ సింథసిస్ అవుతుంది. ఈస్ట్రోజన్ వల్ల గర్బాశయ గోడలు సంకోచిస్తాయి. దీనివల్ల తొందరగా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటికి సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా ముందుగా మీరు వైద్యుల్ని సంప్రదించాలి.