ఫ్యాక్ట్ చెక్ : నిమ్మకాయ, వేడినీరు..కరోనాను తరిమికొడుతుందా? నిజమెంత..

First Published | May 7, 2021, 2:10 PM IST

ప్రపంచం మొత్తం ఓ వైపు కరోనా మహమ్మారిమీద యుద్ధం చేస్తుంటే.. మరోవైపు అనేక అపోహలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా చేస్తే కరోనా అంతమవుతుంది, ఇది పాటిస్తే కరోనా మీ దరికి రాదు, ఇది తాగితే కరోనా ఖతం కావాల్సిందేలాంటి ఫేక్ వార్తలు సోషల్ మీడియా నిండా చక్కర్లు కొడుతున్నాయి. 

అయితే వీటిని నమ్మొద్దని.. వాటిని గుడ్డిగా అనుసరించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని పిఐబీ ఫ్యాక్ట్ చెక్ చెబుతోంది.

రెండు చుక్కల నిమ్మరసాన్ని ముక్కులో పిండుకుంటే కరోనా అంతమవుతుందని ఇటీవల వచ్చిన వార్తల మీద పిఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇది ఫేక్ అని తేల్చింది. ఇలాంటి వాటిని నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హెచ్చరించింది.
ఇదే క్రమంలో ‘క్యూర్ ఫర్ కరోనావైరస్' పేరుతో ఇజ్రాయెల్‌కు చెందిన టిప్ అంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
అదేంటంటే వేడినీరు, నిమ్మకాయముక్కలు, సోడా బైకార్బోనేట్ లను కలిపి వేటి టీ లాగా మధ్యాహ్నాలు తాగితే కరోనాను పూర్తిగా చంపేస్తుందనేది దాని సారాంశం. అయితే ఇది ఫేక్ అని పీఐబీ తేల్చేసింది.

అంతేకాదు వేడినీటి ఆవిరి ద్వారా కరోనా చచ్చిపోతుందనే అపోహ కూడా నిజం కాదని పీఐబీ తేల్చేసింది. ఇది నిజం అని నిరూపించే అధ్యయనాలు ఇప్పటివరకు రాలేదని అది చెబుతోంది.

ఇలాంటి అపోహలు, ఫేక్ న్యూస్ అస్సలు నమ్మొద్దని, పాటించవద్దని నిపుణులు చెబుతున్నారు. కరోనా నివారణకు కేవలం వైద్య, ఆరోగ్య శాఖ లేదా WHO జారీ చేసిన మార్గదర్శకాలను మాత్రమే పాటించాలంటున్నారు.

క్రమం తప్పకుండా శానిటైజ్ చేసుకోవడం, డబుల్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యం అని తేల్చింది.

Latest Videos

click me!