షుగర్ ఉన్నవారు పాల చాయి తాగొచ్చా?

First Published | Jul 7, 2024, 1:54 PM IST

చాలా మందికి మిల్క్ టీ అంటే చాలా ఇష్టం. ఈ టీ వల్ల మన ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ నష్టాలను కలిగిస్తుంది.ఇలాంటి మిల్క్ టీని డయాబెటీస్ పేషెంట్లు తాగొచ్చా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.  

సాధారణంగా టీ అందరికీ ఇష్టమే. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వారకు రోజుకు ఐదారు సార్లు తాగేవారు కూడా ఉన్నారు. టీ ఒత్తిడిని తగ్గించి మైండ్ ను రిలాక్స్ చేస్తుంది. కానీ పాలు, పంచదార కలిపిన టీని ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే ఈ టీ మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. మరి ఇలాంటి టీని డయాబెటీస్ ఉన్నవారు తాగొచ్చా? లేదా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మధుమేహ వ్యాధిగ్రస్తులు పాల చాయి తాగొచ్చా?

డయాబెటీస్ పేషెంట్లు తినే ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మీరు సులభంగా జీర్ణమయ్యే, ఆకలి భావనను నియంత్రించే ఆహారాలను తినాలి. కాబట్టి మిల్క్ టీ తాగడంలో ఎలాంటి తప్పులేదు. కానీ దాన్ని ఎలా తాగుతున్నామన్నదే ముఖ్యమంటున్నారు నిపుణులు. 


milk tea

చక్కెర

డయాబెటీస్ ఉన్నవారు తక్కువ కొవ్వు ఉన్న పాలతో చేసిన చాయ్ ని ఎంచక్కా తాగొచ్చు. కానీ ఈ టీ లో వైట్ షుగర్ కు బదులుగా తక్కువ గ్లైసెమిక్ షుగర్ ఉన్న కంట్రీ షుగర్ లేదా స్వీట్స్ ను ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 


పరిమాణం ముఖ్యం

డయాబెటీస్ ఉన్నవారు మిల్క్ టీ తాగితే ఎలాంటి సమస్య ఉండదు. కానీ మిల్క్ టీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ బరువును పెంచుతాయి. అందుకే దీన్ని ఎక్కువగా తాగకూడదు. మీరు మిల్క్ టీ ని తాగాలనుకుంటే లిమిట్ లో తాగండి. దీంతో కార్బోహైడ్రేట్ లెవెల్స్ ను నియంత్రించొచ్చు.

మిల్క్ టీకి బదులు ఇంకేదైనా తాగొచ్చా? 

చక్కెర లేకుండా టీ తాగ గలను అనుకుంటే  గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీని తాగండి. ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 

milk tea

షుగర్ లెవల్స్ చెక్

మీరు మిల్క్ టీని తాగితే.. తాగిన వెంటనే మీ బ్లడ్ షుగర్ లో ఏదైనా మార్పు వచ్చిందేమో చెక్ చేయండి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే టీని తాగడం తగ్గించండి. లేదా పూర్తిగా మానేయండి. మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి టీని తక్కువగా తాగండి. ఇది మీ ఆరోగ్యానికి మంచిది. 

టీ ని ఎప్పుడు తాగాలి? 

డయాబెటీస్ ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున టీని తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. అందుకే ఉదయం కాకుండా సాయంత్రం పూట మీరు టీని తాగొచ్చు. మీరు ఉదయాన్నే పాల టీని తాగాలనుకుంటే దానిలో ఎలాంటి స్వీటెనర్ ను వేయకండి. 

Latest Videos

click me!