కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి చాలా మంది ముఖానికి మాస్కులను పెట్టుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు, పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు, జనాలు గుంపులు గుంపులుగా ఉన్న చోట ఇలా ఎక్కడికి వెళ్లినా మాస్క్ పెట్టుకునే అలవాటు చాలా మందికి వచ్చింది. నిజానికి ఇది చాలా మంచి అలవాటు.
అయితే కొంతమంది మాత్రం మాస్క్ లను పెట్టుకోవడం ఫ్యాషన్ గా చూస్తున్నారు. మీరు ఏ ఉద్దేశంతో మాస్కులను పెట్టుకున్నా.. దీన్ని పెట్టుకోవడం వల్ల మీరు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
mask
మాస్క్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
జబ్బులకు దూరంగా ఉంటారు
అవును మాస్కులు మిమ్మల్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచుతాయి. మన చుట్టూ ఉన్నవారికి ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నాయో తెలియదు. తుమ్ములు, దగ్గు తుంపర, గాలి ద్వారా మనకు వారికున్న వ్యాధులొచ్చే ప్రమాదం ఉంది. అదే మీరు మాస్క్ లు పెట్టుకుంటే గాలి ద్వారా వ్యాపించే వ్యాధులకు మీరు దూరంగా ఉంటారు.
corona mask.
వాయు కాలుష్యం
మెట్రోపాలిటన్ సిటిల్లో వాయు కాలుష్యం ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రోజు రోజుకు మరింత పెరిగిపోతూ ఉంది. ఈ కలుషితమైన గాలిని పీల్చడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు వంటి ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే మీరు మాస్క్ ను పెట్టుకుంటే ఈ ప్రభావాలు చాలా వరకు తగ్గుతాయి.
ఇతరులకు మంచి చేస్తుంది
మాస్క్ ఇతరుల నుంచి మీకు వ్యాధులు రాకుండా కాపాడటమే కాకుండా.. మీకు ఉన్న వ్యాధుల నుంచి ఇతరులను కాపాడటానికి కూడా సహాయపడతుంది. మీకు క్షయ వంటి ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే మాస్క్ ఇది వేరేవారికి రాకుండా రక్షిస్తుంది. మాస్క్ మిమ్మల్ని మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నవారిని కూడా కాపాడుతుంది.
Image: Getty
అలెర్జీని నివారిస్తుంది
మాస్క్ అలెర్జీలు ఉన్నవారిని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. మీకు దుమ్ము, పుప్పొడి, పొగ వంటి శ్వాసకోశ అలెర్జీలు ఉంటే.. ఖచ్చితంగా మాస్కులను పెట్టుకోండి. దీనివల్ల మీకు అలెర్జీ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాస్కులను ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేదంటే మీకు ఎక్కడ లేని జబ్బులు చుట్టుకునే ప్రమాదం ఉంది. మీరు గనుక మాస్కులను పెట్టుకుంటే మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు. మాస్క్ మీకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది.
Image: Getty
క్రిములు వ్యాప్తి చెందకుండా ఉంటాయి
మీ చుట్టూ ఉన్నవారు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వారి నోట్లో నుంచి వచ్చే బిందువుల నుంచి సూక్ష్మక్రిములు మీకు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇది వారికున్న రోగాలు మీకు వచ్చేలా చేస్తుంది. అందుకే మీరు బయటకు వెళ్లినప్పుడు మాస్క్ పెట్టుకుంటే ఇతరుల నుంచి మీకు వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి.