ఆయుర్వేదం ప్రకారం.. పాదాలకు మసాజ్ చేయడం వల్ల కలిగే టాప్ 7 ప్రయోజనాలు ఇవి..

First Published | Jul 27, 2024, 3:32 PM IST

ఆయుర్వేదం మన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను గురించి క్లుప్తంగా వివరిస్తుంది. దీనిలో పాదాల మసాజ్ కూడా ఉంది. ఆయుర్వేదం ప్రకారం.. పాదాలకు మసాజ్ చేస్తే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?  

పాదాల మసాజ్ లేదా పాదాభ్యంగం అనేది ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన టెక్నిక్. ఎందుకంటే ఇది మన  మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో సహాయపడుతుంది.అసలు ఆయుర్వేదం ప్రకారం.. ప్రతిరోజూ పాదాల మసాజ్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

పాదాలకు మసాజ్ చేయడం వల్ల పాదాల కింది భాగానికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. దీనివల్ల అరికాళ్ల నొప్పి, పాదాల నొప్పి తొండరగా తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అరికాళ్ల నొప్పితో బాధపడేవారు దీన్ని రోజూ ఫాలో అయితే ప్రయోజనాలను పొందుతారు. 
 



రిలాక్సేషన్‌ను పెంచుతుంది

కొన్ని పనులు చేస్తే  మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇలాంటి వాటిలో పాదాల మసాజ్ ఒకటి. పాదాలకు మసాజ్ చేయడం వల్ల మెదడు, నాడీ వ్యవస్థ శాంతపడుతాయి. అలాగే ఒత్తిడి స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. లావెండర్ ఆయిల్ తో పాదాల మసాజ్ చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. 
 


బెటర్ స్లీప్

ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ నిద్రలేమి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే పాదాలకు మసాజ్ చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో మీకు కంటినిండా నిద్రపడుతుంది. రోజూ పాదాలకు మసాజ్ చేస్తే మీరు తొందరగా నిద్రలోకి జారుకుంటారు. 

దోషాలు బ్యాలెన్స్

పాదాలకు మసాజ్ చేయడం వల్ల మీ శరీరంలో ఉన్న దోషాలు కూడా బ్యాలెన్స్ అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. పాదాలకు మసాజ్ చేయడం వల్ల వాత, పిత్త, కఫ దోషాల మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. 
 

జీర్ణక్రియ మెరుగుదల 

పాదాలకు మసాజ్ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. పాదాలకు మసాజ్ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే  కొన్ని పాయింట్లు సక్రియం అవుతాయి. ఇది ప్రేగు కదలికను కూడా మెరుగుపరుస్తుంది.

చర్మం ఆకృతి మెరుగు 

ప్రతి రోజూ రాత్రిపూట మీరు పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల మీ చర్మానికి మంచి పోషణ  లభిస్తుంది. ఇది మడమల పగుళ్లను కూడా తగ్గిస్తుంది. అలాగే మడమలను పగలకుండా తేమగా ఉంచుతుంది. 

Latest Videos

click me!