పండగకి అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే తేనెను ఇలా ఉపయోగించండి..

Published : Jan 14, 2023, 03:56 PM IST

ముఖంపై మొటిమలు, మచ్చలు, డ్రై నెస్ అందాన్ని పూర్తిగా తగ్గించేస్తాయి. దీనికి ఎలా తగ్గించుకోవాలో తెలియడం లేదా.. తేనె మీ చర్మానికి అద్బుతంగా సహాయపడుతుంది తెలుసా..   

PREV
16
పండగకి అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే తేనెను ఇలా ఉపయోగించండి..

తేనె ఒక సహజ మాయిశ్చరైజర్. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మం జిడ్డును తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది మీకు సహజమైన మెరుపును ఇస్తుంది కూడా. నిజానికి తేనెలో చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ప్రతి పదార్ధం ఉంటుంది. ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అసలు తేనె మన చర్మానికి ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

తేనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయి.

తేనెలోని ఎమోలియెంట్, హ్యూమెక్టెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేసి మెరిసేలా చేస్తాయి.

అంతేకాదు తేనె మచ్చలు, హైపర్పిగ్మెంటేషన్ ను తొలగించడానికి సహాయపడే లక్షణాలను కలిగి ఉంటుంది.

తేనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి. 

ఇది మంటను కూడా తగ్గిస్తుంది. దెబ్బతిన్న కణాలను బాగు చేస్తుంది. 
 

36
skin care

చర్మానికి తేనెను ఎలా ఉపయోగించాలి?

తేనె, పసుపు ప్యాక్

తేనె, పసుపులో అద్భుతమైన లక్షణాలు ఉంటాయి. ఇవి మంటను తగ్గించడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. మీకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఇది సహాయపడుతుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ తేనెలో చిటికెడు పసుపును వేసి పేస్ట్ లా తయారుచేసుకోండి. దీన్ని ముఖానికి అప్లై చేయండి. ఆరిన తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. 
 

46

తేనె, ఆలివ్ ఆయిల్

తేనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటే.. ఆలివ్ ఆయిల్ లో హైడ్రేటింగ్, మెరుపు లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని క్లియర్ చేయడానికి సహాయపడతాయి. ఇందుకోసం ఒక గిన్నెలో తేనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. 
 

56
skin care

తేనె, కాఫీ, పసుపు

రెండు టేబుల్ స్పూన్ల తేనెలో ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, చిటికెడు పసుపును కలపండి. ఈ పదార్థాలన్నింటినీ మిక్స్ చేసి ముఖానికి స్క్రబ్ చేయండి. దీనిని సహజ ఎక్స్ఫోలియంట్ గా ఉపయోగించడం వల్ల చర్మపు చికాకు తగ్గుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. 

66

తేనె, గుడ్డు

ఒక గిన్నెలో ఒక గుడ్డులోని తెల్లసొనను తీసుకుని అందులో అర టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అలాగే  నూనెను సమతుల్యం చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories