చలికాలంలో జామకాయను తింటే ఇన్ని లాభాలున్నాయా?

First Published | Nov 6, 2022, 1:52 PM IST

జామకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుది. ఇది మన శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ కాయ ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.
 

సీజనల్ పండ్లను, కూరగాయలను తప్పకుండా తినాలి. వీటివల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే వీటిలో సీజనల్ గా వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించే లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థను బలపర్చడానికి, జీవక్రియ సక్రమంగా జరిగేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో పండే జామకాయలను తప్పకుండా తినాలని  వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామకాయలు తియ్యగా, చాలా టేస్టీగా ఉంటాయి. జామకాయను రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.  జామకాయల్లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని చలికాలంలో తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

జామ కాయల్లో విటమిన్ సి తో పాటుగా ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. సాధారణ బ్యాక్టీరియా, ఫంగల్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలతో పోరాడటానికి విటమిన్ సి సహాయపడుతుంది. 


పేగు కదలికలకు సహాయపడుతుంది

జామకాయ గింజల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుందని నిరూపించబడింది. అందుకే మలబద్దకం సమస్యను తగ్గించడానికి, పేగు కదలికలు మెరుగ్గా ఉండటానికి.. ప్రతిరోజూ ఉదయం పూట జామకాయను తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. 
 

మధుమేహాన్ని నివారిస్తుంది

జామకాయల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మీ రక్తంలో రక్కెర స్థాయిలు పెరిగిపోకుండా  చేస్తుంది. అంతేకాదు జామలో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో  చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. 
 

ఒత్తిడి నుంచి ఉపశమనం

జామకాయల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల ఉద్రిక్తత నుంచి ఉపశమనం కలుగిస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. జామపండ్లనున తినడం వల్ల ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. శరీరానికి మంచి విశ్రాంతి లభిస్తుంది. 
 

బరువును తగ్గిస్తుంది

జామకాయల్లో విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును నియంత్రించడానికి సహాయపడతాయి. థైరాయిడ్ జీవక్రియను నిర్వహించడానికి కూడా తోడ్పడుతుంది. జామకాయలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. రాగి ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది. 

Latest Videos

click me!