చలికాలంలో ఆపిల్ పండ్లను మరువకుండా తినండి.. ఎందుకంటే..?

First Published | Nov 3, 2022, 10:44 AM IST

ఆపిల్ పండ్లను తినడం వల్ల డయాబెటీస్ ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. దీనిని ఈ శీతాకాలంలో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు తెలుసా..? 
 

ఆపిల్ పండ్లలో ఉండే పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇవి పోషక శక్తిగా మారతాయి. ఈ పండ్లను తినడం వల్ల శరీరం హెల్తీగా ఉంటుంది. ఎన్నో రోగాలు సైతం తగ్గిపోతాయి. ఆపిల్ పండ్లలో డైటరీ ఫైబర్ పెక్టిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. 
 

ఆపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పండులో, పండు తొక్క  రెండింటిలోనూ ఉంటాయి. అందుకే ఈ పండ్లను నీట్ గా కడిగి తొక్కతో సహా తినడం మంచిది. చలికాలంలో ఆపిల్ పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి. 


జీర్ణక్రియ మెరుగుపడుతుంది

ఆపిల్ పండ్లలో ఫైబర్ పెక్టిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ కరిగే ఫైబర్ జీర్ణక్రియకు ఉపయోగడుతుంది. ఈ ఫైబర్ కంటెంట్ పేగుల నుంచి నీటిని గ్రహిస్తుంది. జెల్ న పుట్టిస్తుంది. అలాగే జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే మలం సాఫీగా బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. ఆపిల్ పండ్లలో ఉండే మాలిక్ యాసిడ్ కూడా జీర్ణక్రియకు సహాయపడుతుంది. 
 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

డైట్ చేసే ప్రతి ఒక్కరికీ ఇది సూపర్ ఫుడ్. ఎందుకంటే దీనిలో డైటరీ పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ పెక్టిన్ ఫైబర్ ఎక్కువగా ఉంటే ఆపిల్ బరువు తగ్గేందుకు, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మీకు అంత ఫాస్ట్ గా ఆకలి కాదు. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పాడు చేసే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకుండా చూస్తుంది. ఆపిల్ పండ్లలో ఉండే సహజ మొక్కల రసాయనాలు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. 
 

డయాబెటీస్ ప్రమాదం తగ్గుతుంది

ఆపిల్ పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆపిల్స్ లో పుష్కలంగా ఉండే పాలీఫెనాల్స్ జీవక్రియను పెంచుతాయి. రక్తప్రవాహంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఈ పండులో ఉండే పాలీఫెనాల్స్ క్లోమంలోని బీటా కణాలను గాయం నుంచి రక్షిస్తాయి. ఇది  ఇన్సులిన్ ఉత్పత్తిని, గ్లూకోజ్ శోషణను పెంచుతుంది. డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుతుంది. 
 

apple

జీవక్రియకు సహాయపడుతుంది

ఆపిల్ పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది శరీర జీవక్రియకు సహాయపడుతుంది. ఈ పండును తొక్కతో సహా తినడం మంచిది. ఆపిల్ ను తొక్కతో పాటు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు.. దీనిలోని ఫైబర్ కంటెంట్ నిర్విషీకరణ ప్రక్రియలో సహాయపడుతుంది. అలాగే కాలెయాన్ని, జీర్ణవ్యవస్థను విష పదార్థాల నుంచి రక్షిస్తుంది. 
 


గుండెకు మంచిది

ఆపిల్ పండ్లలో పాలీఫెనాల్స్, పెక్టిన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని పలు అధ్యయానాలు వెల్లడిస్తున్నాయి. ఈ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్, పాలీఫెనాల్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. కణాలలో లిపిడ్ ఆక్సీకరణను నివారించడానికి సహాయపడతాయి. అంతేకాదు వీటిలో ఉండే ఎపికాటెచిన్ రక్తపోటును తగ్గిస్తాయి. అలాగే అథెరోస్క్లెరోసిన్ వల్ల ధమని గట్టిపడటాన్ని నిరోధిస్తాయి. గుండె నుంచి ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తప్రవాహాన్ని, రక్త ప్రసరణను పెంచుతాయి. 

Latest Videos

click me!