సెక్స్ తర్వాత ప్రేమతో కౌగిలి.. ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

First Published Nov 26, 2022, 10:48 AM IST

సెక్స్ లో పాల్గొన్న తర్వాత భాగస్వామిని కౌగించుకోవడం వల్ల శరీరానికి హాయిగా ఉంటుంది. అంతేకాదు దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 
 

సెక్స్ భాగస్వాముల మధ్య బంధాన్ని పెంచుతుంది. ప్రేమను రెట్టింపు చేస్తుంది. అంతకు మించి ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. అయితే సెక్స్ తర్వాత కొంతమంది భాగస్వాములకు కాస్త దూరంగా ఉంటారు. కానీ సెక్స్ తర్వాత  భాగస్వామిని తప్పకుండా కౌగిలించుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారంటున్నారు నిపుణులు. ఆరోగ్యపరంగానే కాదు.. ఇద్దరి మధ్య సఖ్యత కరువైనప్పుడు ఈ కౌగిలింత వారిద్దరి మరింత దగ్గర చేస్తుంది. వారి మధ్య ప్రేమను బలోపేతం చేస్తుందట.  అసలు సెక్స్ తర్వాత కౌగిలించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది

సెక్స్ లో పాల్గొన్న తర్వాత మీ భాగస్వామిని కౌగిలించుకోవడం వల్ల లవ్  హార్మోన్ అనే ఆక్సిటోసిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ ఆక్సిటోసిన్ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాదండోయ్.. ఈ ఆక్సిటోసిన్ పెరగడం వల్ల మరెన్నో బెనిఫిట్స్ ను పొందుతారంటున్నారు నిపుణులు. 

గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది

అధిక రక్తపోటు గుండె జబ్బులకు కారణమవుతుంది. అయితే కౌగిలింతలు మీ రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. 

బయోలాజికల్ సైకాలజీ జర్నల్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. మీ భాగస్వామితో సెక్స్ లో పాల్గొన్న తర్వాత క్రమం తప్పకుండా కౌగిలించుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

మరో పరిశోధనలో 59 మంది మహిళలు రుతువిరతికి ముందు పాల్గొన్నారు. వీళ్లు తమ భాగస్వామిని కౌగిలించుకోవడానికి ముందు.. ఆ తర్వాత తమ రక్తపోటు స్థాయిలను చెక్ చేశారు. కౌగిలించుకున్న తర్వాత రక్తపోటు స్థాయిలు గణనీయంగా తగ్గడంతో పాటుగా ఆక్సిటోసిన్ స్థాయిలు బాగా పెరిగినట్టు ఈ పరిశోధన వెల్లడించింది. 
 

స్ట్రెస్ తగ్గుతుంది

ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నారు. ఈ స్ట్రెస్ ఎన్నో మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుంది. అయితే సెక్స్  తర్వాత కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి చిటికెలో మాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కౌగిలింత ద్వారా విడుదలయ్యే  ఆక్సిటోసిన్ ఒత్తిడి హార్మోన్ కార్డిసాల్ ను తగ్గిస్తుంది. దీంతో ఒత్తిడి స్థాయిలు తగ్గిపోతాయి. 

అసోసియేషనన్ ఫర్ సైకలాజికల్ సైన్స్ జర్నల్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఆక్సిటోసిన్ ఆందోళన లక్షణాలను కూడా తగ్గించడానికి సహాయపడతుందని కనుగొన్నారు. ఆక్సిటోసిన్ శారీరక నొప్పిని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ హార్మోన్ మీరు హాయిగా పడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. 
 

బలమైన రోగనిరోధక శక్తి

కౌగిలింత మీ శరీరాన్ని సెరోటోనిన్, డోపామైన్ ను ఉత్తేజపర్చడానికి కూడా ప్రోత్సహిస్తుంది. ఇవి, లవ్ హార్మోన్లు ఎన్నో హానికరమైన అంటువ్యాధుల నుంచి మీ శరీరాన్ని రక్షిస్తాయి. అందేకాదు ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడతాయి. ఆక్సిటోసిన్ శరీర కణాల పనితీరుకు కూడా సహాయపడతాయి. 
 

భాగస్వాముల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది

లవ్ హార్మోన్ లేదా బాండింగ్ హార్మోన్ అని పిలిచే ఆక్సిటోసిన్.. భాగస్వాముల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. సెక్స్ తర్వాత కౌగిలించుకోవడం వల్ల ఓదార్పు కలుగుతుంది. నీకు నేనున్నానే అనే భరోసా పెరుగుతుంది. మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండాలనుకుంటే  అప్పుడప్పుడు సెక్స్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా సెక్స్ తర్వాత ప్రేమతో కూడిన  కౌగిలింత మీ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. మీ మధ్య ప్రేమను పెంచుతుంది. నమ్మకాన్ని పెంచుతుంది. ఇది ప్రపంచంలో మరెక్కడా దొరకని గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. 

click me!