కూరగాయలతో కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.. ఏయే కూరగాయలను తినాలంటే?

Published : Feb 07, 2023, 11:57 AM IST

మనం తినే ఆహారమే మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కుగా ఉండే గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే కొన్ని కూరగాయలు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. దీంతో గుండె  జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

PREV
17
 కూరగాయలతో కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.. ఏయే కూరగాయలను తినాలంటే?
cholesterol


మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే.. మీరు అంత హెల్తీగా, నిండు నూరేళ్లు బతుకుతారు. ఒకవేళ మీకు గుండె బలహీనంగా ఉంటే.. మీ ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే బలహీనమైన గుండె ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే గుండెను బాగా చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె జబ్బులతో అర్థాంతరంగా చనిపోతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, అధిక ఆల్కహాల్, పొగాకు వాడకం, అనారోగ్యకరమైన ఆహారం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటివి మీ గుండెను ప్రమాదంలో పడేస్తాయి. గుండె ఆయుష్షును తగ్గిస్తాయి. ఈ ప్రమాదకారకాలలో అధిక కొలెస్ట్రాల్ ఒకటి. ఇది గుండెపోటు, కొరోనరీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.  ఈ జబ్బులొస్తే ప్రాణాలు ఎప్పుడు పోయేది తెలియదు. అందుకే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని కూరగాయలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. 

27
cholesterol


కొలెస్ట్రాల్ ను నియంత్రించే కూరగాయలు

గుండెకు కొన్ని కూరగాయలు ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఈ కూరగాయల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ హృదయనాళ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. అంతేకాక కూరగాయలలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి బాగా సహాయపడతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ఎలాంటి కూరగాయలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

37

 బ్రోకలీ

బ్రోకలీలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ కూరగాయ ఎన్నో పోషకాలతో లోడ్ చేయబడి ఉంటుంది. దీనిలో సల్ఫోరాఫేన్ అని పిలువబడే సల్ఫర్ సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. బ్రోకలీలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థలో పిత్త ఆమ్లాలను బంధిస్తుంది. ఇది మన శరీరంలోని  కొలెస్ట్రాల్ ను కరిగించడం సులభం చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలను తినడం మీరు అతిగా తినలేరు. అలాగే మీ శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించుకోవచ్చు. 
 

47

కాలే

కాలేలో పొటాషియం, ఫైబర్, ఫోలేట్, కాల్షియంలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇవి ఎల్డిఎల్ స్థాయిలను తగ్గించి.. గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. కాలేలో రకరకాల విటమిన్లతో పాటుగా, లుటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తుంది. 
 

57

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్ లో మొక్కల స్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఒక రకమైన లిపిడ్. ఇది పేగు కొలెస్ట్రాల్ ను గ్రహించకుండా ఆపుతుంది. కాలీఫ్లవర్ లో ఉండే సల్ఫోరాఫేన్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు మన ధమనులకు కొవ్వు పట్టకుండా.. క్లియర్ గా ఉంచుతుంది. 
 

67


ముల్లంగి

ముల్లంగిలో మన ఎల్డిఎల్ స్థాయిని తగ్గించే ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన సిరలు, ధమనులలో మంటను నివారిస్తుంది. ముల్లంగిలో కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. ముల్లంగిలో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 

77

క్యారెట్

క్యారెట్ మన గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని బీటా కెరోటిన్ ను మన శరీరం విటమిన్ ఎ గా మారుస్తుంది. బీటా కెరోటిన్ బిసిఒ 1 ను చురుగ్గా చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తుంది. క్యారెట్ ను తీసుకోవడం వల్ల పిత్త ఆమ్ల విసర్జన, కొలెస్ట్రాల్ శోషణ, యాంటీ ఆక్సిడెంట్ స్థితి మారుతుంది. చివరికి ఇది మన గుండెను కాపాడుతుంది. క్యారెట్లలో ఎక్కువగా పెక్టిన్ రూపంలో కరిగే ఫైబర్ ఉంటుంది. కరిగే ఫైబర్స్ ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఎందుకంటే ఇవి మన జీర్ణవ్యవస్థ కొలెస్ట్రాల్ ను గ్రహించకుండా నిరోధిస్తాయి.
 

Read more Photos on
click me!

Recommended Stories