ఈ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ ఉండాలి తెలుసా?

First Published | Oct 20, 2024, 12:37 PM IST

జనరల్‌గా ఏ రైల్వే స్టేషన్ లోకైనా వెళ్లాలంటే ప్లాట్ ఫాం టిక్కెట్ ఉంటే సరిపోతుంది కదా.. కాని ఈ రైల్వే స్టేషన్ లోకి వెళ్లాలంటే పాస్ పోర్ట్ ఉండాలి తెలుసా? అదేంటి ఆ స్టేషన్ ఏమైనా వేరే దేశంలో ఉందని అనుకుంటున్నారా? ఆ రైల్వే స్టేషన్ ఇండియాలోనే ఉంది. చిత్రమైన ఈ పరిస్థితి ఉన్న రైల్వే స్టేషన్ గురించి, ఆ స్టేషన్ ఎక్కడుంది ఇలాంటి మరిన్ని ఇంటరెస్టింగ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

రైల్వే స్టేషన్‌కి వెళ్లాలంటే ప్లాట్‌ఫారమ్ టికెట్ చాలు. ట్రైన్ టికెట్ ఉంటే ప్లాట్‌ఫారమ్ టికెట్ కూడా అక్కర్లేదు. కానీ ఇండియాలోనే ఒక స్టేషన్‌లోకి వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసా కూడా ఉండాలి. మామూలుగా విదేశాలకు వెళ్లేటప్పుడు పాస్‌పోర్ట్, వీసా అవసరం. కానీ మన దేశంలోనే ఒక రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ ఎందుకు అవసరమో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ఆ స్టేషన్ ఇండియాలో పంజాబ్‌ రాష్ట్రంలో ఉంది. అటారీ అనే ఊరిలో ఉన్న ఈ స్టేషన్‌లోకి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఎందుకంటే ఆ స్టేషన్ ఇండియా-పాకిస్తాన్ బోర్డర్‌లో ఉంది. ఇండియా-పాకిస్తాన్ రైలు మార్గంలో ఇండియా పరిధిలోకి వచ్చే చివరి స్టేషన్ ఇదే.

అటారీ రైల్వే స్టేషన్ పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ జిల్లాలో ఉంది. సిక్కు సామ్రాజ్యంలో జనరల్‌గా ఉన్న షామ్ సింగ్ అటారీవాలా తర్వాత స్టేషన్ పేరును అటారీ శామ్ సింగ్ రైల్వే స్టేషన్‌గా మే 2015లో అప్పటి పంజాబ్ ప్రభుత్వం మార్చింది. ఈ స్టేషన్ కి వెళ్లే భారతీయులకి ఇండియన్ పాసుపోర్టు, పాకిస్తాన్ వీసా తప్పనిసరిగా ఉండాలి. 


అటారీ స్టేషన్‌లో ఆర్మీ భద్రత ఎక్కువ. ప్రయాణికుల పాస్‌పోర్ట్, వీసా చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. 2019 నుంచి పాకిస్తాన్‌కి రైళ్లు లేవు. అంతకు ముందు అటారీ నుంచి లాహోర్‌కి రైళ్లు నడిచేవి.

అటారీ రైల్వే స్టేషన్ ఉత్తర రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఫిరోజ్ పూర్ డివిజన్ పరిధిలో ఉంది. ఇక్కడ విద్యుత్తు రైల్వే లైన్ కూడా ఉంది. ఈ స్టేషన్ ను 1862లో ప్రారంభించారు. 

ప్రస్తుతం అటారీ స్టేషన్ నుంచి నాలుగు రైళ్లే నడుస్తున్నాయి. అందులో ఒకటి సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్. ఇది ఢిల్లీ నుంచి అటారీకి వారానికి రెండు రోజులు నడుస్తుంది. అమృత్‌సర్ నుంచి రెండు ప్యాసింజర్ రైళ్లు, జబల్‌పూర్ నుంచి ఒక స్పెషల్ రైలు నడుస్తుంది. ఈ స్టేషన్‌లో మూడు ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.

Latest Videos

click me!