పచ్చి బఠానీల్లో కల్తీని ఇలా కనిపెట్టొచ్చు...

First Published | Sep 22, 2021, 2:22 PM IST

ఇలాంటివి మానవ శరీరానికి చాలా ప్రమాదకరమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ట్విట్టర్‌లో #DetectingFoodAdulterents అనే హ్యాష్ ట్యాగ్ ను షేర్ చేసింది. 

పుచ్చపండ్లు, మామిడిపండ్లు వేసవిలోనే దొరికేవి.. సీతాఫలాలు చలికాలంలోనే వచ్చేవి. బఠానీలు, పాలకూరలు కూడా చలికాలంలో తప్ప కనిపించకపోయేవి. అది ఒకప్పటి మాట.. కానీ కాలం మారింది. ఇప్పుడు అన్నీ రకాల పండ్లు కూరగాయలు.. అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటున్నాయి. కంటికి ఇంపైన రంగుల్లో నిగనిగలాడుతూ.. కొనమంటూ ఊరిస్తున్నాయి. 

పెరుగుతున్న సాంకేతికకు, వ్యవసాయంలో వచ్చిన మార్పులకు ఇది ప్రతీక. అయితే దీంట్లో హానికరమైన రసాయనాల పాత్రను మరిచిపోకూడదు. వీటితో వ్యాపారులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఆకుకూరలు, పండ్లు తాజాగా కనిపించేలా చేయడానికి హానికారక రసాయనాలు వాడుతూ కల్తీ చేస్తున్నారు. ఇలాంటివి మానవ శరీరానికి చాలా ప్రమాదకరమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ట్విట్టర్‌లో #DetectingFoodAdulterents అనే హ్యాష్ ట్యాగ్ ను షేర్ చేసింది. 


దీనికింద ఇంట్లో రోజువారీ ఆహారంలో కల్తీని ఎలా కనిపెట్టాలో టిప్స్ చెబుతోంది. ఈ క్రమంలోనే పచ్చి బటానీలలో కల్తీని ఎలా చెక్ చేయాలో చెబుతున్నారు. 

పచ్చి బఠానీలలో కల్తీని ఎలా చెక్ చేయాలి?
ముందుగా పారదర్శకంగా ఉన్న ఒక గాజు బౌల్ లో పచ్చి బఠానీలు తీసుకోవాలి. దీంట్లో నీళ్లు పోసి బఠానీలను బాగా కడగాలి. అలాగే అరగంట పాటు వదిలేయండి. 
అరగంట తరువాత నీరు ఆకుపచ్చ రంగులోకి మారితే బఠానీలు కల్తీ అయినట్టు, కల్తీలేని పచ్చి బఠానీలు ఎలాంటి రంగు పోకుండా అలాగే ఉంటాయి. 

అయితే, ఇది చాలాసార్లు లూజ్ గా దొరికే బఠానీల విషయంలోనే మనం కనిపెట్టొచ్చు. అదే బఠానీలు కాయతో సహా దొరికినప్పుడు.. అలాంటివి కొన్నప్పుడు కల్తీకి ఈజీగా చెక్ పెట్టొచ్చు. వీటిల్లో కల్తీ జరగడం చాలా తక్కువ.

Latest Videos

click me!