Health Tips:విపరీతంగా బరువు పెరుగుతున్నారా? అయితే ఈ వ్యాధులు సోకే ప్రమాదముంది జాగ్రత్త..

Published : Apr 11, 2022, 09:46 AM IST

Health Tips:ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మీరు బరువు తగ్గకపోగా మరింత పెరుగుతున్నట్టైతే వెంటనే వైద్యుడిని సంప్రదించి థైరాయిడ్, డయాబెటీస్, Polycystic ovary syndrome వంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

PREV
17
Health Tips:విపరీతంగా బరువు పెరుగుతున్నారా? అయితే ఈ వ్యాధులు సోకే ప్రమాదముంది జాగ్రత్త..

Health Tips: ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్య ఎంతో మందిని పట్టిపీడిస్తోంది. చిన్నపిల్లలు సైతం ఊబకాయం బారిన పడి ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారే ఎక్కువగా మరణిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. 
 

27

అయితే బరువు పెగడానికి కొన్ని రకాల వ్యాధులు కూడా కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజు రోజుకు మీరు విపరీతంగా బరువు పెరుగుతున్నట్టైతే వెంటనే వైద్యులను సంప్రదించి నాలుగు టెస్టులను చేయించుకోవాలని సలహానిస్తున్నారు. అవేంటంటే.. 

37
pcos

PCOS టెస్ట్.. Polycystic ovary syndrome కారణంగా కూడా కొంతమంది బరువు పెరిగిపోతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు విపరీతంగా బరువు పెరుగుతున్నట్టైతే వెంటనే PCOS టెస్ట్ ను చేయించుకోండి. ఎందుకంటే స్థూలకాయం మూలంగా మీకు ఎన్నో వ్యాధులు చుట్టుకునే ప్రమాద్రం ఉంది. 

47

విపరీతంగా బరువు పెరగడానికి మరో కారణం మధుమేహం కూడా కావొచ్చంటున్నారు నిపుణులు. మధుమేహం బారిన పడితే కూడా ఎక్కువగా బరువు పెరుగుతారు. దీనితో పాటుగా తరచుగా మూత్రానికి వెళితే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయని అర్థం.  మీరు డయాబెటీస్ బారిన పడటం వల్లే ఇలా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో షుగర్ టెస్ట్ ను తప్పక చేయించుకోవాలి. 
 

57

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూడా విపరీతంగా బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. థైరాయిడ్ పేషెంట్లలో జుట్టు విపరీతంగా రాలడం, బరువు పెరగడం, గోళ్లు విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

67
High Cholesterol

ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే కూడా బరువు పెరుగుతారు. ఇందుకోసం మీరు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ను చేయించుకోవాల్సి ఉంటుంది. ఊబకాయం బారిన పడిన వాళ్లలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో లేకపోతే మాత్రం హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

77

కాబట్టి రోజు రోజుకు మీ శరీర బరువు పెరుగుతున్నట్టైతే.. వెంటనే ఈ నాలుగు టెస్టులను తప్పక చేయించుకోండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 

click me!

Recommended Stories