మీరు మందు కొట్టేటప్పుడు ఈ స్టఫ్ అస్సలు తినకండి

First Published | Aug 19, 2024, 5:47 PM IST

చాలామంది మందు తాగేటప్పుడు నంజుకోడానికి తప్పకుండా ఏదయినా ఆహార పదార్థాన్ని పక్కన పెట్టుకుంటారు. అయితే మందు తాగుతూ కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదట. అవేంటో తెలుసుకుందాం... 

Alcohol

ఆనందంలోనూ, బాధలోనూ, శుభకార్యంలోనూ, అశుభకార్యంలోనూ, మంచి జరిగినా, చెడు జరిగినా, స్నేహితులు కలిసినా, బంధువులు కలిసినా చివరకు పెళ్లాం తిట్టినా, తల్లిదండ్రులు మందలించినా... సమయం, సందర్భం ఏదయినా కొంతమందికి మందు వుండాల్సిందే. ఒంట్లో చుక్కపడిందో అన్నీ మరిచిపోయి సరికొత్త లోకంలోకి వెళుతుంటారు... కిక్కు దిగేవరకు దేన్నీ లెక్కచేయరు. 

ఒకప్పుడు మగవారికే పరిమితం అయిన మద్యం ఇప్పుడు ఆడవాళ్లకూ అలవాటయ్యింది. ఇలా ఆడామగ తేడాలేకుండా స్కూల్ పిల్లల నుండి ముసలివాళ్ళ వరకు మద్యం మత్తుకు చిత్తవుతున్నారు. కొందరు మితంగా, ఇంకొందరు అమితంగా తాగుతుంటారు... కానీ మందు తాగుతున్నారంటే స్టఫ్ తప్పనిసరి. కొందరు ఆవకాయతో సరిపెట్టుకుంటే మరికొందరు చికెన్, మటన్, జీడిపప్పు, బాదం వంటి ఖరీదైన ఆహార పదార్థాలను తీసుకుంటారు. కేవలం మందులోకి మంచింగ్ కోసమే కొన్ని ఆహార పదార్థాలు పుట్టుకొచ్చాయి. ఇలా చుక్కా ముక్క కామినేషన్ సరికొత్త కిక్ ఇస్తుందని మందుబాబులు చెబుతుంటారు. 

అయితే మద్యం సేవించే సమయంలో ఎక్కువగా ఉపయోగించే స్టఫ్ అంత మంచిది కాదట. అసలే మద్యం ఆరోగ్యానికి హానికరం... అలాంటి మద్యం తాగుతూ కొన్ని ఆహార పదార్థాలు తినడం మరింత హాని చేస్తుందట. కాబట్టి మంచి బ్రాండెడ్ మద్యం, అందుకు సరిపోయే స్టఫ్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణుల సూచిస్తున్నారు. 
 

Alcohol

మందు తాగేటప్పుడు అస్సలు తినకూడని స్టఫ్ : 

చిప్స్ : 

మందుబాబులు ఎక్కువగా ఉపయోగించే స్టఫ్ చిప్స్. మందుపార్టీ అంటే తప్పకుండా చిప్స్ వుండాల్సిందే... కరకరలాడే చిప్స్ తింటూ మందు తాగుతుంటే ఆ కిక్కే వేరబ్బా అంటుంటారు. చిప్స్ తింటూ మందుతాగితే మరింత కిక్ వస్తుందని చాలామంది అంటుంటారు. కానీ మందులోకి చిప్స్ మంచింగ్ అస్సలు మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు.  
 


Alcohol

బాగా నూనెలో వేయించిన డీప్ ఫ్రైస్ : 

చుక్క‌,ముక్క కామినేషన్ ను ఎక్కువశాతం మద్యంప్రియులు ఇష్టపడుతుంటారు. నూనెలో బాగా వేయించి డీప్ ఫ్రై చేసిన చికెన్, మటన్, ఫిష్ లాంటివి మందులో మంచింగ్ కు బావుంటాయి... కానీ వీటివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. బాగా నూనెలో వేయించి వండే డీప్ ఫ్రైస్ మద్యంతో కలిపి కడుపులోకి తోయడంవల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయట. కాబట్టి మందుబాబులు డీప్ ఫ్రైస్ ను స్టఫ్ లిస్టులోంచి తీసేస్తే మంచింది. 
 

Alcohol

తందూరీ

తందూరీ ఆహార పదార్థాలను కూడా చాలామంది మందులోకి మంచింగ్ గా వాడుతుంటారు. ముఖ్యంగా తందూరీ చికెన్ ను స్టఫింగ్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.బొగ్గులపై కాల్చిన ఈ తందూరీ పదార్థాలు ఆరోగ్యానికి మంచివే... కానీ మందుతో కలిపి తినడం మాత్రం మంచిది కాదట. 

Alcohol

పల్లీలు, జీడిపప్పు :

ఉడకబెట్టిన లేదంటే కాల్చిన పల్లీలు, వేయించిన జీడిపప్పు తింటూ మందు తాగడానికి చాలామంది ఇష్టపడతారు. రిచ్ ఫుడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది... మందుతో కలిపి తీసుకుంటే మాత్రం కీడు చేస్తుందట. మందుతో పాటు ఈ పదార్థాలు తీసుకోవడంవల్ల యాసిడిటీకి దారితీస్తుందట. కాబట్టి స్టఫ్ గా జీడిపప్పు, పల్లీలు ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. 
 

Alcohol

పాల పదార్థాలు : 

 మద్యంప్రియులు ముఖ్యంగా మందుతాగే అలవాటున్న మహిళలు వెరైటీ స్టఫ్ ఉపయోగిస్తుంటారు. చాక్లెట్, స్వీట్స్ వంటివి మందులోకి మంచింగ్ లా వాడుతుంటారు. ఇలా తీపి పదార్థాలు తినడంద్వారా మందు తక్కువ తాగిన కిక్ ఎక్కువ వస్తుందని భావిస్తుంటారు. కానీ పాలతో తయారయ్యే ఆహార పదార్థాలను మందుతో కలిపి తీసుకోవడం మంచింది కాదు. 

ఇలా మద్యం ప్రియులు ఎక్కువగా ఉపయోగించే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. కాబట్టి మంచి మద్యమే కాదు మంచి స్టఫ్ ను ఎంచుకోవడమూ చాలా ముఖ్యం. మందు తాగడంవల్ల కలిగే అనారోగ్యసమస్యలను తగ్గించేలా స్టఫ్ వుండాలి కానీ పెంచేలా వుండకూడదు.

Alcohol

మందులోకి మంచి స్టఫ్ : 

గ్రీన్ సలాడ్, స్వీట్ కార్న్, బాయిల్డ్ పీనట్స్ వంటివి మందులోకి మంచి స్టఫ్స్. అలాగే బ్రూన్ రైస్, ఓట్స్, గోదుమపిండితో తయారుచేసే పదార్థాలు మందుకు మంచి కాంబినేషన్. ఇవి ఈజీగా జీర్ణం కావడమే కాదు మన శరీరంలో మద్యం ప్రభావం ఎక్కువగా లేకుండా చూస్తుంది. ఎక్కువగా మసాలాలు లేకుండా, నూనెతో తడిపేయకుండా సాధారణంగా వండే చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహారం కూడా మందులోకి మంచి స్టఫ్. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, ఆరెంజ్, గ్రేప్స్,లెమన్ వంటి పండ్లను కూడా మందుతాగుతూ తినవచ్చు.  గుడ్లు కూడా మందులో మంచింగ్ కు చాలా మంచివి. 

Latest Videos

click me!