వాటిల్లో అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన కాంపౌండ్స్ ఉన్నాయి. అవి PFAS, బిస్ ఫినాల్(bisphenol), మెటల్స్(metals), థాలేట్స్(phthalates),అస్థిర కర్బన సమ్మేళనాలు(volatile organic compounds) మొదలైనవి. వీటి వల్ల క్యాన్సర్, హార్మోన్ ప్రాబ్లమ్స్ లాంటి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
పీర్(Peer) నివేదిక ప్రకారం ప్యాకేజింగ్ వల్ల కొన్ని ప్రమాదకర రసాయనాలు ఆహారంలో కలుస్తున్నాయని తేలింది. ఈ పరిస్థితికి కారణం కేవలం ప్లాస్టిక్ ఉపయోగించడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రమాదకర రసాయనాలు ఫుడ్ లో కలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆహారాన్ని బాగా వేడిచేయడం. ఇలా చేయడం వల్ల ఆ ఫుడ్ తిన్న వారికి ఎసిడిటీ పెరుగుతుంది. కొవ్వు పదార్థాలు పేరుకుపోతాయి. అవన్నీ ఈ ప్రమాదకర ప్లాస్టిక్ కెమికల్స్ ను శరీరంలో నిల్వగా ఉండిపోవడానికి కారణమవుతున్నాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు, బాక్సుల్లో ప్యాకింగ్ చేస్తున్న ఆహారం బాగా కలుషితమవుతోందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి రక్షణ పొందడం ఎలా?
మీకు కావాల్సిన ఫుడ్ ను గాజు సీసాలు, బాటిల్స్ లోనే ప్యాక్ చేయించుకోవాలి. ఒకవేళ మీరు రెస్టారెంట్ నుంచి ఏదైనా పార్సిల్ తెచ్చుకోవాలనుకుంటే శ్రమ అనుకోకుండా మీరే గాజు లేదా స్టీల్ డబ్బాలు, బాక్సులు తీసుకెళ్లాలి. వాటిల్లో మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొని వెళ్లాలి.
మీ ఇళ్లలో ఇప్పటికే ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసిన పచ్చళ్లు, చట్నీలు, ఊరగాయల లాంటి వాటిని వెంటనే ఆ ప్లాస్టిక్ డబ్బాల్లోంచి తీసేయండి. వెంటనే వాటిని గాజు లేదా స్టీల్ పాత్రల్లోకి మార్చేయండి. ఇలా చేయడం వల్ల ఫుడ్ లో ప్లాస్టిక్ కలవడాన్ని కొంతైనా తగ్గించుకోవచ్చు.
సాధారణంగా మైక్రోవేవ్ లో వేడి చేసిన ఫుడ్ సేఫ్ అని అందరూ అనుకుంటారు. అయితే చాలా సందర్భాల్లో మైక్రోవేవ్ లో వండిన ఫుడ్ ను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటుంటారు. ఇదే ఆరోగ్య సమస్యలకు అసలు కారణం. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన, ప్రాణాంతకమైన రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి మైక్రోవేవ్ లో హీట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ను ప్లాస్టిక్ కవర్లు, డబ్బాల్లో ప్యాకింగ్ చేసి ఇస్తుంటారు. దీని వల్ల సమస్య రెండింతలు పెరుగుతోంది. వెంటనే ఈ పనులు ఆపేయాలి. పదేపదే వేడి చేసిన ఆహారం తినడం మానేయాలి. BPA లైనింగ్ ఉన్న వస్తువుల వినియోగాన్ని వెంటనే ఆపేయాలి.
న్యూస్ పేపర్స్, ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లలో ప్యాకింగ్ చేసే ఇచ్చే టిఫెన్స్ కాని, మీల్స్ కాని తినడం మానేయాలి. న్యూస్ పేపర్స్ పై ఉండే కెమికల్స్ వేడివేడి ఆహార పదార్థాలతో రసాయన చర్య జరిపి హానికర పదార్థాలుగా మారిపోతాయి. ముఖ్యంగా ఆయిల్ గా ఉన్న ఫుడ్ ను ఇలాంటి న్యూస్ పేపర్స్, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి తీసుకెళ్లడం మానేయాలి.
లోకల్ గా తయారు చేసిన, ఫ్రెష్ ఆహారాన్ని మాత్రమే ఉపయోగించాలి. సూపర్ మార్కెట్లలో నెలలు, సంవత్సరాల క్రితం ప్యాక్ చేసి నిల్వ చేసిన ఆహార పదార్థాలను వాడటం మానేయాలి.
BPA, phthalate, PFAS వంటి ప్రమాదకర రసాయనాలు లేని ఆహార పదార్థాలు, వస్తువులను చెక్ చేసి తీసుకోవాలి. పర్యావరణానికి హాని కలిగించేవి, భూమిలో త్వరగా కలవని ప్లాస్టిక్ వస్తువులు, సంచుల వాడకాన్ని ఆపేయాలి. పర్యావరణానికి మేలు చేసే నార సంచులు, క్లాత్ బ్యాగ్స్ వాడాలి.