Childrens
మీ పిల్లలు అందంగా కనిపించేందుకు మార్కెట్ లో దొరికే క్రీములు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ కండీషనర్లు, ఆయింట్ మెంట్లు, సన్ స్క్రీన్ లు వాడుతున్నారా? అయితే మీరే మీ పిల్లల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారన్నమాట. ఇలాంటి సౌందర్య సాధనాలు దుగుతున్న పిల్లలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయని జార్జ్ మేసన్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.
Childrens
చిన్నారుల శరీరం చాలా సున్నితంగా వుంటుంది... కాబట్టి వారు తొందరగా అనారోగ్యానికి గురవుతుంటారు. కాబట్టి వీరిపై పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ప్రభావం అధికంగా వుంటుందని ఈ అధ్యయనం సూచిస్తుంది. కాబట్టి అత్యుత్తమమైన కంపనీలకు చెందిన ప్రోడక్ట్స్ కూడా పిల్లలపై చాలా దుష్ప్రభావాలు చూపించే అవకాశం వుంటుందని తెలిపారు.
Childrens
ముఖ్యంగా చిన్నారుల ఎదుగుదలపై ఈ పదార్థాలు ప్రభావం చూపిస్తాయట. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతకు కారణ అవుతాయని జార్జ్ మేసన్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అద్యయనంలో తేలిందట. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వుండాలని నిపుణులు సూచిస్తున్నారు.