మనుషుల కన్నా ముందు స్పేస్ లోకి వెళ్లిన 9 జంతువులు

First Published | Sep 13, 2024, 12:10 PM IST

స్పేస్ లోని రహస్యాలను కనిపెట్టాలని మనిషి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇతర ప్లానెట్లపై ఏముంది? జీవం ఉండటానికి అవకాశం ఉందా లేదానని కొన్ని దశాబ్దాలుగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయోగాల్లో భాగంగా స్పేస్‌లోకి మనుషుల కంటే ముందు కొన్ని జంతువులను పంపారు. వాటి జర్నీ మనుషులు స్పేస్ లోకి వెళ్లడానికి మార్గాన్ని సులభం చేశాయి. ఏ జంతువులను ఏ దేశాలు పంపాయి? ఆ ప్రయోగాల రిసల్ట్స్ ఏమయ్యాయి తదితర ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 
 

ఆల్బర్ట్ 1, 2(Monkeys):
ఆల్బర్ట్ 1 అనే మకాక్ జాతి కోతిని జూన్ 18, 1948న అమెరికాకు చెందిన NASA అంతరిక్ష ప్రయోగానికి పంపింది. లాస్‌లోని వైట్ సాండ్స్ ప్రూవింగ్ గ్రౌండ్‌లో ఈ ప్రయోగం జరిగింది. అయితే అనేక సాంకేతిక కారణాల వల్ల ప్రయోగం విఫలమై ఆల్బర్ట్ 1 మరణించింది. తర్వాత ఆల్బర్ట్ 2 అనే మంకీని కూడా పంపారు. జూన్ 14, 1949న అమెరికాకు చెందిన V-2 సౌండింగ్ రాకెట్‌లో న్యూ మెక్సికోలోని హోలోమాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి ఈ ప్రయోగం చేశారు. పారాచూట్ వైఫల్యం కారణంగా ఆల్బర్ట్ 2 ల్యాండింగ్‌లో మరణించింది.
 

లైకా(Dog):
స్పేస్‌లోకి వెళ్ళిన మొట్టమొదటి జీవి లైకా అనే కుక్క. 1957లో లైకాను స్పుత్నిక్ 2 ద్వారా స్పేస్‌లోకి పంపించారు. అయితే దురదృష్టవశాత్తు లైకా మరణించింది. ఇది రష్యా (సోవియట్ యూనియన్) మొట్టమొదటి స్పేస్ ప్రయోగం. ఈ స్పేస్ ప్రయోగానికి లైకానే ఎందుకు ఎంపిక చేశారంటే.. లైకా ఓ వీధి కుక్క. మాస్కో వీధుల్లో నిరాదరణగా తిరుగుతుండేది. చలి, ఆకలి వంటి భిన్నమైన పరిస్థితులను లైకా అప్పటికే అలవాటు పడి ఉండటంతో స్పేస్ లో ఎదురయ్యే పరిస్థితులను ఇది తట్టుకుంటుందని భావించి ఈ కుక్కకు ట్రైనింగ్ ఇచ్చారు. లైకా కు కుద్రియవ్కా అనే మరో పేరు కూడా ఉంది. 

Latest Videos


హామ్(Chimpanzee):
1961లో హామ్ అనే చింపాంజీని అమెరికాకు చెందిన NASA పంపింది. మెర్య్కురీ రెడ్ స్టోన్ 2 మిషన్ లో ఈ చింపాంజీని ఉపయోగించారు. హామ్ స్పేస్‌లోకి వెళ్ళిన మొదటి చింపాంజీగా రికార్డుల్లోకెక్కింది. హామ్ జూలై 1957లో ఫ్రెంచ్ కామెరూన్‌లో జన్మించింది. కొందరు వేటగాళ్లు హామ్ ను బంధించి ఫ్లోరిడాలోని మయామిలోని రేర్ బర్డ్ ఫామ్ కు ఇచ్చారు. అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ ఈ చింపాంజీని 457 డాలర్లకు కొనుగోలు చేసింది. స్పేస్ కు వెళ్లేందుకు మొత్తం 40 చింపాంజీలకు శిక్షణ ఇచ్చారు. వాటిల్లో చివరి స్థానంలో ఉన్న హామ్ చివరికి అన్ని టెస్టులు పాసై స్పేస్ లోకి వెళ్లేందుకు సెలక్ట్ అయ్యింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చింపాంజీ స్పేస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాతే దానికి హామ్ అని పేరుపెట్టారు.  

తాబేళ్లు (Tortoises)
1968లో తాబేళ్లను సోవియట్ యూనియన్ (రష్యా) స్పేస్ లోకి పంపింది. జోండ్ 5 అంతరిక్ష నౌకలో వీటిని పంపించారు. భూమికి సురక్షితంగా తిరిగి రావడానికి ముందు చంద్రుని చుట్టూ తిరిగాయి. ఈ ప్రయోగం అంతరిక్షంలో జీవం ఉందా లేదా అన్న విషయాన్ని కనుగొనేందుకు ఉపయోగపడింది. జీవుల ద్వారా దీర్ఘ కాల అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన చాలా సమాచారాన్ని ఈ ప్రయోగం అందించింది. 6 రోజుల తర్వాత హిందూ మహా సముద్రంలో జోండ్ 5 క్రాష్ ల్యాండ్ అయ్యింది. అయితే తాబేళ్లు ప్రాణాలతో బయటపడ్డాయి. 
 

బెల్కా, స్ట్రెల్కా(Dogs)
1960లో సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి బెల్కా, స్ట్రెల్కా అనే రెండు కుక్కలను పంపించాయి. బెల్కా, స్ట్రెల్కా భూమి చుట్టూ తిరిగి సురక్షితంగా తిరిగి వచ్చి రికార్డుల్లోకెక్కాయి. అంతరిక్ష యాత్రను తట్టుకొని సజీవంగా భూమికి తిరిగి వచ్చిన మొదటి జంతువులు ఇవే కావడం విశేషం. ఈ రెండు కుక్కల విజయ యాత్రపై రష్యన్ భాషలో స్పేస్ డాగ్స్ అనే యానిమేషన్ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యింది. 

ఫెలిసెట్(cat)
Felicette అనేది ఒక పారిసియన్ పిల్లి. ఇది ఫ్రెంచ్ అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 18 అక్టోబర్ 1963న స్పేస్ లోకి వెళ్లింది. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి పిల్లిగా ఫెలిసెట్ రికార్డుల్లోకెక్కింది. అంతరిక్షయానం కోసం శిక్షణ పొందిన 14 ఆడ పిల్లులలో ఇది ఒకటి. స్పేస్ లోకి వెళ్లినప్పుడు పెలిసెట్ మెదడులో వచ్చే మార్పులను తెలుసుకొనేందుకు ఎలక్ట్రోడ్లను అమర్చారు. ప్రయోగం విజయవంతంగా జరిగి ఫెలిసెట్ తిరిగి భూమికి చేరింది. అయితే ఈ పిల్లి మెదడులో రికార్డయిన విషయాలు తెలుసుకొనేందుకు దాని బ్రెయిన్ పై ప్రయోగాలు చేశారు. 

టార్డిగ్రేడ్‌లు

టార్డిగ్రేడ్‌లు అత్యంత స్థితిస్థాపక కలిగిన జంతువులు. ఇవి సాధారణంగా కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి ఎలాంటి వాతావరణంలోనైనా బతకగలవు. అందుకే 2007లో వీటిని అంతరిక్షంలోకి పంపారు. 

స్వ్కెరల్ కోతి

మిస్ బేకర్ అనే ఈ కోతి 1959లో అంతరిక్షంలోకి పంపబడింది. బృహస్పతి AM-18లో దీన్ని స్పేస్ కు పంపారు. ఇది అంతరిక్ష ప్రయోగం ద్వారా అనుకున్న ఫలితాలను రాబట్టింది. 1984లో ఈ కోతి మరణించింది. 

click me!