జీవితాంతం నీరు తాగకుండా బ్రతికే జీవులు...

First Published | Aug 7, 2024, 11:38 PM IST

బాగా దాహంగా వున్నపుడు నీరు లేకపోతేనే అల్లాడిపోతాం. అలాంటిది జీవితాంతం అసలు నీరు తాగకుండానే బ్రతికేస్తాయట కొన్ని జీవులు. ఈ వింత జీవులేంటో తెలుసుకుందాం. 

Animals

నీరు... అన్ని జీవరాశుల మనుగడకు ఎంతో ముఖ్యమైనది. ఆహారం లేకుండా కొంతకాలం బ్రతకొచ్చు... కానీ నీళ్లు తాగకుండా బ్రతకడం కష్టం. మనుషులు, జంతువులే కాదు మొక్కలు సైతం నీరు లేకుంటే బ్రతకలేవు. అయితే కొన్ని జంతువులు మాత్రం నీళ్లు తాగకుండా రోజులతరబడి వుండగలవు. అలాంటి జంతువులేంటో చూద్దాం. 

Animals

కంగారూ ఎలుకలు : 

నీరు తాగకుండా జీవితాంతం బ్రతికే జీవి ఈ కంగారూ ఎలుక. ఇవి తమ ఆహార పదార్థాల నుండే కావాల్సిన నీటిని పొందుతాయి. కాబట్టి ఈ ఎలుకలకు ఆహారం వుంటే చాలు... ప్రత్యేకంగా నీరు అవసరం లేదు. 


Animals

తోర్నీ డెవిల్స్ : 

ఆస్ట్రేలియాకు చెందిన ఓ బల్లి జాతి జంతువులు తోర్నీ డెవిల్స్. ఇవి కూడా నీళ్లు తాగకుండా బ్రతకగలవు. ఆహారం వుంటే చాలు. 

Animals

ఒంటెలు : 

ఎడారి జీవులు ఒంటెలు కూడా రోజుల తరబడి నీరు తాగకుండా బ్రతికేస్తాయి. దాదాపు 15 రోజులపాటు నీరు లేకున్నా ఒంటెలు బ్రతకగలవు. నీరు, ఆహారం లభించకుంటే ఇవి తమ శరీరంలో కొవ్వుల నుండి శక్తిని పొందుతాయి. 

Animals

ఫెన్నెక్ ఫాక్స్ : 

ఆప్రికాలోని సహారా ఎడారిలో జీవించే ఫెన్నెక్స్ అనే నక్కలు కూడా నీటిపై ఎక్కువగా ఆదారపడవు. తినే ఆహార పదార్థాల నుండే నీటిని పొందుతాయి. ఇవి  మొక్కలతో పాటు కీటకాలు,  చిన్నచిన్న జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. 

Animals

కోలాస్ : 

ఈ జంతువులు ఎక్కువగా నీటిని తీసుకోవు.  స్వచ్చమైన యూకలిప్టస్ ఆకులను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. దీంతో ఈ జీవులకు ఆహారం, నీరు ఒకేసారి లభిస్తాయి.

Latest Videos

click me!