అంబానీ కోడళ్లు భర్తల కంటే ఇంత పెద్దవారా?

First Published | Jul 17, 2024, 10:07 AM IST

అంబానీ ఫ్యామిలీలోకి వచ్చిన కోడళ్ల గురించి, వాళ్ల బ్యాగ్ రౌండ్ గురించి అందరికీ తెలిసిందే. కానీ వీళ్లకు తమ భర్తలకు ఎంత ఏజ్ గ్యాప్ ఉందో మాత్రం చాలా మందికి తెలియదు. అవును అంబానీ ఫ్యామిలీ కోడళ్లు తమ భర్తల కంటే పెద్దవారు. ఎంతంటే?
 

Ambani family

మన దేశంలో అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ నీతా అంబానీలు ఈ నెల 12 న తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించారు. ఈ పెళ్లికి సినీ సెలబ్రిటీల నుంచి  రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా అథితులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి ముఖేష్ అంబానీ వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. మీకు తెలుసా? అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లు చాలా కాలం ప్రేమించుకుని ఇప్పుడు పెళ్లి పీఠలు ఎక్కారట. 
 

సాధారణంగా ఎవరి పెళైనా జరిగితే.. అబ్బాయి వయసెంత, అమ్మాయి వయసెంత, ఇద్దరికి ఎన్నేండ్ల ఏజ్ గ్యాప్ ఉందని అడుతుంటాం. అలాగే అంబానీ ఫ్యామిలీలో వారి భర్తా భర్తల ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుందని ఆలోచించారా? పదండి ఈ ఆర్టికల్ లో అంబానీ ఫ్యామిలీలోని భార్యా భర్తల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


మీకు తెలుసా? అంబానీ ఫ్యామిలీలో చాలా మటుకు కోడళ్ల వయసు కొడుకుల కంటే ఎక్కువగా ఉంటుందట. అనంత్ అంబానీ కంటే రాధికా మర్చంట్ వయసే పెద్దదట. అసలు అంబానీ కోడళ్ల వయసు ఎంత ఎక్కువో ఓ లుక్కేద్దాం పదండి. 

ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా

ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ కంటే ఇతని భార్య శ్లోకా మెహతానే పెద్దదట. అవును శ్లోకా మెహతా  తన భర్త కంటే పెద్దది. శ్లోకా అంబానీ 1990లో పుడితే..  ఆకాశ్ అంబానీ 1992లో జన్మించాడు.
 

రాధికా మర్చంట్ తో అనంత్ అంబానీ

ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి జులై 12న అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.  అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే రాధికా మర్చంట్ అనంత్ అంబానీ కంటే పెద్దది. రాధిక మర్చంట్ 1994 డిసెంబర్ 18న పుడితే..  ఆనంద్ 1995 ఏప్రిల్ 10 న జన్మించాడు.

Latest Videos

click me!