చాణక్య నీతి ప్రకారం.. పక్షులు, జంతువుల నుంచి నేర్చుకోవాల్సిన విజయ రహస్యాలు ఇవి.. !

First Published | Jul 14, 2024, 9:51 AM IST

పక్షులను, జంతువులను చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. నిజానికి మనం వీటిని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. మన జీవితంలో అనుకున్న దానిని సాధించడానికి ఇవి కూడా మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. చాణక్య నీతి ప్రకారం.. పక్షులు, జంతువుల నుంచి మనం నేర్చుకోవాల్సిన విజయ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

ప్రాచీన భారతదేశ తత్వవేత్త ఆచార్య చాణక్యుడి ఆదర్శాలు అప్పటికే కాదు.. ఎప్పటికీ మనకు స్ఫూర్తిదాయకమే. అందుకే నేటికీ కూడా చాలా మంది ఈయన చెప్పిన విషయాలను అనుసరిస్తున్నారు. చాణక్య నీతి.. చాణక్య జీవితంలో ఆచరించిన విషయాలు, అనుభవాల సమాహారం. పక్షులు, జంతువుల నుంచి చాణక్యుడు ఎలాంటి విషయాలను నేర్చుకోవాలంటాడో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

కాకి

కాకిని అశుభంగా చూస్తారు జనాలు. కానీ చాణక్యుడు మాత్రం కాకిని చూసి ఎన్నో విషయాలను నేర్చుకోవాలంటాడు. కాకిని తెలివైన పక్షిగా అభివర్ణించిన చాణక్యుడు. ఎందుకంటే కాకి తన ఆహారం కోసం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సార్లు ప్రయత్నిస్తుంది. ఎలాంటి భయం లేదా అలసట లేకుండా పూర్తి సంకల్పంతో దాని ఆహారం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని చూసి ప్రయత్నించే గుణం నేర్చుకోవాలి. 

Latest Videos


కుక్క

కుక్క ఆహారాన్ని ఎక్కువగా తినే అలవాటు ఉన్నా.. తక్కువ మొత్తంలోనే తిని సంతృప్తి చెందుతుంది. అలాగే యాజమానికి కాపాలాగా ఉంటుంది. విశ్వాసం చూపిస్తుంది. యాజమానిని ప్రేమిస్తుంది. ఈ మీరు ఈ గుణాలను కుక్కను చూసి నేర్చుకోవాలంటాడు నాణక్య నీతి చెబుతోంది. 

కోడి

కోడి నుంచి కూడా మనం ఎన్నో విషయాలను నేర్చుకోవాలంటాడు చాణక్యుడు. కోడికి సూర్యోదయానికి ముందే నిద్రలేచే అలవాటు ఉంటుంది. కోళ్లు ఫుడ్ ను పంచుకోవు. కానీ అవి ఇతర కోళ్లతో పోటీపడతాయి. మనుషులు కూడా వెనకడుగు వేయకుండా కోడిలా తమ హక్కుల కోసం పోరాడటం నేర్చుకోవాలంటాడు చాణక్యుడు. 
 

సింహం

అడవికి రాజుగా పేరొందిన సింహం నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ జంతువు అడవికి రాజైనా తన వంతు ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా.. మనుషులు కూడా తమ పనిని పూర్తి అంకితభావంతో పూర్తి చేయాలంటాడు చాణక్యుడు.
 

donkey bomb


గాడిద

మీకు తెలుసా? గాడిదలు చలి లేదా వేడి అంటు తేడా లేకుండా ఏ వాతావరణంలోనైనా మనుషుల వస్తువులను మోస్తాయి. అదే విధంగా మనుషులు వాతావరణం ఎలా ఉన్నా ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవాలని చాణక్యుడు అంటాడు. 

click me!