మనిషిపైనా దాడి చేసే ప్రమాదకర పక్షులేంటో తెలుసా!

First Published | Aug 11, 2024, 5:08 PM IST

ఈ భూమి మీద మనిషి మాత్రమే ఇతర జంతువులు, పక్షులను వేటాడటం మనకు తెలుసు. అలాంటి మనిషిపై కొన్ని పక్షులు దాడి చేయగలవని మీకు తెలుసా.. తమ ప్రాణాలకు ముప్పు అని తెలిస్తే మనిషిని కూడా చంపేయగలవు. అలాంటివి ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది పక్షి జాతులున్నాయి. అవేంటో తెలుసుకుందామా..
 

కాసోవరీ

ఆస్ట్రేలియా, న్యూగినియాలో తరచూ కనిపించే కాసోవరీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షిగా పేరుగాంచింది. బలమైన కాళ్లు, పంజా దీని సొంతం. దాన్ని భయపెట్టిన జంతువుపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తుంది. మూడు కాసోవరీ జాతులు ఉన్నాయి. ఇవి దాదాపు ఆహారంగా 90% పండ్లను మాత్రమే తింటాయి. అయితే అప్పుడప్పుడు గుడ్లు , చేపలు, ఎలుకలను తింటాయి. 

నిప్పుకోడి
భూమిపై అతి పెద్ద పక్షి జాతి అయిన ఈ ఉష్ట్రపక్షి ఆఫ్రికా దేశానికి చెందినది. సుమారు 145 కిలోల వరకు బరువు పెరుగుతుంది.  ఈ భూమి మీద గుడ్డు పెట్టే పక్షుల్లో అతి పెద్ద గుడ్డు పెట్టగలిగినది ఈ నిప్పుకోడి మాత్రమే. చాలా దూకుడుగా ప్రవర్తిస్తుంది.  బలంగా ఉండే కాళ్లే వాటి ఆయుధాలు.  అవి ఆందోళన చెందినా, భయపడినా మనుషులను సైతం చంపగలవు. కాళ్లతో తన్నుతూ ఎంత పెద్ద జంతువుపైనైనా దాడి చేస్తాయి. 

హార్పీ ఈగల్‌

మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతంలో కనిపించే ఈ హార్పీ ఈగల్‌ డేగ జాతికి చెందినది. దీని పదునైన గోళ్లు, ముక్కును ఉపయోగించి జంతువులను వేటాడి ఆహారంగా తింటాయి. కోతులు వీటి ప్రధాన ఆహారం. 

సదరన్‌ జెయింట్‌ పెట్రెల్‌
దక్షిణ మహా సముద్రం ప్రాంతంలో కనిపించే ఈ పక్షి జాతి చాలా ఆవేశంగా ఉంటుంది. ఇతర పక్షులపై దాడి చేసి చంపుతుంది. వీటి రెక్కలు చాలా పెద్దవిగా ఉంటాయి. ఒక్కోటి సుమారు 6 అడుగులకు పైగా ఉంటాయి. ఇవి సాధారణంగా చేపలను ఆహారంగా తింటాయి. అయితే సముద్రంలో ఓడల నుంచి పడేసే వ్యర్థాలనూ తినడం కోసం వాటిని ఫాలో అవుతాయి. 
 

Latest Videos


గ్రేట్‌ హార్డ్న్‌ఔల్

 ఇది అమెరికాకు చెందిన పెద్ద గుడ్లగూబ. కొమ్ములు ఉండటందీని ప్రత్యేకత. ప్రధాన ఆహారం కుందేళ్లు, ఎలుకలు. కాళ్లు, పాదాలు, టాలన్లు పెద్దవిగా బలంగా ఉంటాయి. ఇవి వేట సమయంలో ఎంతో తెలివితేటలుగా ప్రవర్తిస్తాయి. వీటి కళ్లు మనిషి కళ్లకంటే కొంచెం పెద్దగా ఉంటాయి. 

బారెడ్‌ ఔల్‌
ఉత్తర అమెరికాకు చెందిన ఈ గుడ్ల గూబ పెద్ద కళ్లు, చెవులు కలిగి ఉంటుంది. చిన్న క్షీరదాలను వేటాడి తింటాయి. గూడు కట్టే సమయంలో ఇవి చాలా ఆవేశానికి లోనవుతాయి. ఆ సమయంలో వాటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన మనిషినైనా చంపేందుకు ప్రయత్నిస్తాయి. 
 

లామెర్‌ గీయర్‌

ఇది ఇరాన్, దక్షిణ ఐరోపా, తూర్పు ఆఫ్రికా, భారత ఉపఖండం , టిబెట్ లలోని ఎత్తైన పర్వతాలలో నివసిస్తుంది. ఇది ఎముకలను ఎక్కువ ఆహారంగా తింటాయి.  వీటి రెక్కలు 9 అడుగులకు పైగా ఉంటాయి. చాలా రాబందుల్లా గడ్డం రాబందుకి బట్టతల తల ఉండదు.  

ఈమూ
నిప్పుకోడి మాదిరిగానే ఈమూ పక్షులు కూడా పెద్దవి, బలమైనవి. ఆస్ట్రేలియాకు చెందినవి. ఎత్తు 6 అడుగులకు పైగా పెరుగుతాయి. గంటకు సుమారు 48 కి.మీ. వేగంతో పరిగెత్తగలవు. ఇవి వివిధ రకాల మొక్కలు, కీటకాలను ఆహారంగా తింటాయి. కొన్నిసార్లు వారాల పాటు తినకుండా బతకగలవు. వీటిని రెచ్చగొడితే శక్తివంతమైన వాటి కాళ్లతో కొట్టి హాని చేస్తాయి. 

మ్యూట్‌ స్వాన్‌

ఇవి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే కోపం వస్తే ఎంతటి జంతువుపైనైనా దాడికి దిగుతాయి. యురేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కనిపిస్తాయి. 160 సెం.మీ పొడవు వరకు ఇవి పెరగగలవు. వీటి ముక్కుపై నల్లటి మచ్చ ప్రత్యేక ఆకర్షణ. కప్పలు, చేపలు, నీటి కీటకాలను ఆహారంగా తింటాయి. 

click me!