ఓవర్ థింకింగ్‌కు అడ్డుకట్ట వేసే 7 సూపర్ టెక్నిక్స్ మీకోసం

First Published | Sep 5, 2024, 6:50 PM IST

మీరు మానసిక ప్రశాంతత కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారా? అతిగా ఆలోచించే మనస్సును కంట్రోల్ చేయలేకపోతున్నారా? మీకు సహాయపడే ఏడు జపనీస్ పద్ధతులను ఇక్కడ తెలుసుకోండి. ఇవి మీకు జీవితంలో ఎన్నో కొత్త పాఠాలను నేర్పిస్తాయి. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. 

అతిగా ఆలోచించడం ఒక సమస్య

ప్రస్తుతం మనమందరం ఉరకల పరుగుల జీవితాలు గడుపుతున్నాం.  మనకున్న షెడ్యూల్ ప్రకారం మన పనులు ఎప్పటికీ పూర్తి కానివిగా మారిపోయాయి. అందుకే మనందరికీ సమయం సరిపోవడం లేదని అనిపిస్తుంది. సమస్యల గురించి ఆలోచించడానికి, నిశ్శబ్దంగా కూర్చోవడానికి, కొన్ని ప్రశాంతమైన నిమిషాలను గడపడానికి మనకు అరుదుగా సమయం ఉంటుంది. ఇది కూడా మనకు సమస్యగా మారుతుంది. ఇలా ఆలోచించడం అతిగా ఆలోచించడం అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ సమస్యకు పరిష్కారం చూపే జపనీస్ టెక్నిక్స్ ఇక్కడ ఉన్నాయి.

షోగానై: మీ కంట్రోల్ లో లేనిదాని గురించి ఆలోచించకండి

మనం చాలా విషయాలు మార్చేయాలని ఆరాట పడుతుంటాం. ఇది తప్పు, అది తప్పు అనుకుంటూ.. ఇవన్నీ సరిచేస్తే జీవితం బాగుంటుందని అనుకుంటాం. ఇదే అసలు సమస్య అని షోగానై టెక్నిక్ చెబుతోంది. అంటే మన కంట్రోల్ లో లేని విషయాల గురించి ఆలోచించడం అనవసరమని దీనర్థం. మీరు నియంత్రించలేని విషయాల గురించి చింతిస్తూ సమయాన్ని వృథా చేయకూడదు. మీరు ఈ విషయాన్ని ప్రభావితం చేయగలరు అనుకుంటేనే ఆ అంశం గురించి ఆలోచించాలి. మీరు ఈ ముందుచూపు ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోగలిగితే మీ జీవిత సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. రానున్న సమస్యలను  మరింత సులువుగా పరిష్కరించుకోగలుగుతారు. 

జాజెన్ టెక్నిక్.. ధ్యానం చేయండి

బౌద్ధమతంలో ఒక సాధారణ ధ్యాన సాంకేతికతను జాజెన్ అని పిలుస్తారు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. తీర్పు ఇవ్వకుండా సాధన సమయంలో ఒకరి ఆలోచనలను తిరిగి ఆలోచించడం సాధ్యమవుతుంది. ఇది అతిగా ఆలోచించే అలవాటును దూరం చేయడానికి నిజంగా శక్తివంతమైన మార్గం.


షిరిన్-యోకు: ప్రకృతితో ఫ్రెండ్ ఫిప్ చేయండి

ఉరకల పరుగుల జీవితంలో మీరు బాగా అలసిపోయినట్లు మీకనిపిస్తోందా.. అయితే అర్జెంటుగా మీరు చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టేయండి. ఎందుకంటే ఉద్యోగం సరిగా చేయాలంటే ఏకాగ్రత చాలా అవసరం. మీ అలసట తీర్చుకోవడానికి మీకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లండి. హిమాలయాలకోె, ఊటీ, కొడైకెనాల్ లాంటి దూర ప్రాంతాలకైనా వెళ్లండి. మీకు నచ్చితే స్థానికంగా ఉన్న ప్రకృతి, పచ్చదనం చుట్టూ సమయం గడపడం ముఖ్యం. దీన్నే షిరిన్-యోకు టెక్నిక్ అంటారు. మరింత ప్రశాంతంగా ఉండటానికి, అతిగా ఆలోచించకుండా ఉండటానికి ఈ టెక్నిక్  సహాయపడుతుంది. ఇది మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది.

నెన్బుట్సు: ధ్యానం ద్వారా ప్రశాంతత పొందండి

నెన్బుట్సు టెక్నిక్ ద్వారా మీ దృష్టిని మిమ్మల్ని అతిగా ఆలోచింపజేసే విషయాల నుండి దూరం చేయవచ్చు. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే బుద్ధుని పేరును జపించాలి. లేదా మీకు ఇష్టమైన దైవాన్ని, ఆయన పేరును జపించాలి. ఈ విధంగా ఇది మీ మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది. అంతే కాకుండా మీ చర్యలు, భావోద్వేగాల గురించి తెలుసుకోవడానికి ఒక గొప్ప మార్గంగా ఉపయోగపడుతుంది. 

వాబీ-సబీ.. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకోండి

ఈ జపనీస్ పద్ధతి జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, విషయాలు ఎల్లప్పుడూ ఆదర్శంగా ఉండవని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రెండు వాస్తవాలను మీరు అంగీకరించగలిగిన వెంటనే పరిపూర్ణతను సాధించాలనే కోరిక తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది మీ ఆందోళనను బాగా తగ్గించి, మిమ్మల్ని మరింత ప్రశాంతంగా అనుభూతి చెందేలా చేస్తుంది.

గమన్: నెగెటివ్ వైబ్రేషన్స్ దూరం చేయండి

గమన్ టెక్నిక్ ఏంటంటే.. మీ ఆలోచనల్లో వచ్చేనెగెటివ్ వైబ్రేషన్స్ మిమ్మల్ని బాధించనివ్వకుండా ఉండటానికి మీకు మీరే సెల్ఫ్ టీచింగ్ చేసుకోవడం. జీవితంలోని అనూహ్య మలుపులను ఎదుర్కొంటూ ముందుకు సాగడం అందరూ చేయాల్సిన పని. దీనికి అనుగుణంగా మీ బలాన్ని, స్థితిస్థాపకతను కాపాడుకోవడం ముఖ్యం. ఒక సమయంలో ఒక అడుగు వేయడంపై దృష్టి పెట్టడం ఆదర్శవంతమైన విధానం. గమన్ టెక్నిక్ చెప్పేది అదే.

ఇకెబానా.. పువ్వులను ఒక క్రమంలో అమర్చండి

ఈ పద్ధతి ఆసక్తికరంగా ఉంటుంది. ఈ టెక్నిక్ లో మీరు శ్రద్ధ, చిత్త శుద్ధితో పువ్వులను అమర్చాాలి. అందమైన వాటిని సృష్టించడంలో మీ మనస్సు మునిగిపోయినప్పుడు, మీ మనస్సు ఎంత త్వరగా బాధించే ఆలోచనలపై దృష్టి పెట్టడం మానేస్తుందో మీరు ప్రాక్టికల్ గా చూస్తారు.

Latest Videos

click me!