ఇష్టమైన ఫుడ్ ఓ ముద్ద ఎక్కువ లాగించారా? పొట్ట ఉబ్బరమా?... ఈ ఆరుపనులతో చెక్ పెట్టండి...

First Published | Sep 21, 2021, 2:28 PM IST

ఇష్టమైన ఫుడ్ కనిపించగానే నోరు కంట్రోల్ లో ఉండదు కదా.. కాస్త ఎక్కువగానే లాగిస్తారు. మరెలా? అంటే ఆ తరువాత కొన్ని టిప్స్ పాటిస్తే... పొట్ట గందరగోళం, అనీజీ నుంచి బయటపడొచ్చు. 

చోలే భాతుర్ నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ వరకు... నోటికి ఎంతో రుచిగా, జర్రున పొట్టలోకి జారిపోయి సంతృప్తినిచ్చే అనేక ఆహారాలను .. చాలా ఇష్టంగా.. ఇంకా చెప్పాలంటే కాస్త గట్టిగానే లాగిస్తాం. ఇక ఆ తరువాతే మొదలవుతుంది అసలు కథ. పొట్టలో ఇబ్బంది, గందరగోళంగా, అనీజీగా ఉంటుంది. 

కాసేపే కదా.. అనుకుంటే చిక్కుల్ని కొనితెచ్చుకున్నట్టే.. తరచుగా ఇలాగే జరుగుతుంటే.. దీర్ఘకాలంలో అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహానికి దారితీస్తాయి. అందువల్ల, అతిగా తినడం అలవాటును తగ్గించడం, ఆయిలీ ఫుడ్స్ కు దూరంగా ఉండడం ముఖ్యం. మీరు ఎంత కఠినంగా ఉన్నా.. కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్లినప్పుడు తినాల్సి వస్తుంది.. ఇష్టమైన ఫుడ్ కనిపించగానే నోరు కంట్రోల్ లో ఉండదు కదా.. కాస్త ఎక్కువగానే లాగిస్తారు. మరెలా? అంటే ఆ తరువాత కొన్ని టిప్స్ పాటిస్తే... పొట్ట గందరగోళం, అనీజీ నుంచి బయటపడొచ్చు. 


high cholesterol food

కాసేపే కదా.. అనుకుంటే చిక్కుల్ని కొనితెచ్చుకున్నట్టే.. తరచుగా ఇలాగే జరుగుతుంటే.. దీర్ఘకాలంలో అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహానికి దారితీస్తాయి. అందువల్ల, అతిగా తినడం అలవాటును తగ్గించడం, ఆయిలీ ఫుడ్స్ కు దూరంగా ఉండడం ముఖ్యం. మీరు ఎంత కఠినంగా ఉన్నా.. కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్లినప్పుడు తినాల్సి వస్తుంది.. ఇష్టమైన ఫుడ్ కనిపించగానే నోరు కంట్రోల్ లో ఉండదు కదా.. కాస్త ఎక్కువగానే లాగిస్తారు. మరెలా? అంటే ఆ తరువాత కొన్ని టిప్స్ పాటిస్తే... పొట్ట గందరగోళం, అనీజీ నుంచి బయటపడొచ్చు. 

గోరువెచ్చని నీరు తాగాలి : రోజూ తినే దానికంటే ఓ ముద్ద ఎక్కువ తింటే ఆయాసమే.. అలా తిన్నప్పుడు, ఆయిలీ ఫుడ్స్ తిన్నప్పుడు.. భోజనం చేసిన 30-45 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీరు తాగడం ప్రారంభించాలి. నీరు పోషకాలు, వ్యర్థ ఉత్పత్తులకు క్యారియర్‌గా పనిచేస్తుందని నిపుణుల అభిప్రాయం. ఇక గోరువెచ్చని నీరు పోషకాలను జీర్ణమయ్యే రూపంలో విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల మీకు తేలికగా అనిపించడం మొదలవుతుంది.

డిటాక్స్ డ్రింక్ : నిమ్మకాయ రసం తాగడం వల్ల శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. అందుకే శరీరం బరువుగా అనిపించినప్పుడు నిమ్మకాయ నీళ్లు తాగాలని నిపుణఉలు సూచిస్తున్నారు. అందుకే దీన్ని డిటాక్స్ డ్రింక్ అంటారు. ఆయిల్ ఫుడ్స్ తిన్న తర్వాత శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడుతుంది. వెయిట్ లాస్ కు కూడా బాగా పనిచేస్తుంది. 

వాకింగ్ : బిర్యానీ లేదా ఆయిల్ ఫుడ్స్ లాంటి భారీ భోజనం తరువాత కాసేపు నడక చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 20 నిమిషాల పాటు తేలిగ్గా నడవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు పొట్టను బరువుగా లేకుండా చేస్తుంది. వెయిట్ లాస్ కూ చక్కగా పనిచేస్తుంది. 

ప్రోబయోటిక్స్  : హెవీ మీల్స్ తరువాత.. 20-25 నిమిషాలకు ప్రోబయోటిక్స్ తినేలా జాగ్రత్తపడండి. ప్రోబయోటిక్స్ జీర్ణ ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తాయి. గట్ ఫ్లోరా, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మనకు తేలిగ్గా అందుబాటులో అత్యంత ప్రభావవంతమైన ప్రోబయోటిక్ పెరుగు.

పండ్లు : హెవీగా తిన్న తరువాత గంట సేపటికి పండ్లు తినడం కూడా మంచి ఆప్షన్. ఫైబర్ అధికంగా ఉండే కొన్ని పండ్లను తినాలి. ఇవి మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను పెంచుతాయి. అందుకే, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి తరువాతి రెండు భోజనాలలో ఎక్కువ పండ్లు మరియు కూరగాయలను తినాలని సూచించారు. 

ఒక్క భోజనం చాలా హెవీగా చేసినట్టు అనిపిస్తే.. మీ నెక్ట్స్ రెండు మీల్స్ చాలా తేలిగ్గా, సులభంగా జీర్ణమయ్యేలా ఉండే ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోండి. దీనివల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, జీర్ణవ్యవస్థను మృదువుగా చేసే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినడానికి ద్రవ ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు. 

Latest Videos

click me!