ఈ రాశివారితో శృంగారం అద్భుతంగా ఉంటుంది...

First Published | Apr 29, 2022, 11:57 AM IST

కొంతమంది శృంగారంలో ఆద్భుతంగా ఉంటారు. వారితో ఉంటే కోరికలు గుర్రాలై పరిగెడతాయి. శృంగారపుటంచులు చూస్తారు. ఆనందానికి హద్దులుండవు. అలాంటి ఐదు రాశులు ఏంటో చూడండి.. 

Image: Getty Images

కొంతమంది శృంగారంలో అద్భుతంగా ఉంటారు. మరికొంతమంది ఆ సమయంలో చెవుల్లో గుసగుసలాడుతుంటే భాగస్వామిలో కోరికలు అగ్గిరాజుకుంటాయి. ఇంకొంతమంది శృంగారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భాగస్వామిని ఎలా ఫోర్ల ప్లేకు సిద్ధం చేయాలో.. ఎలా శృంగారంలోకి దించాలో... బాగా తెలుసు.. వీరి కంపెనీ బెడ్రూంలో అద్భుతంగా ఉంటుంది. అయితే ఇదికూడా రాశీచక్రాన్ని బట్టే ఉంటుందట. మరి మీ రాశి అందులో ఒకటేనా..? ఒకసారి చూడండి... 

Image: Getty Images

వృశ్చికరాశి
వీరు బెడ్ మీద అద్భుతంగా ఉంటారు. ఏవేవో కొత్త కొత్త రహస్యాలను బెడ్రూంలో రివీల్ చేస్తూ.. సర్ ఫ్రైజ్ లతో భాగస్వామిని ఆకట్టుకుంటారు. ఇది వీరికి మరింత ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అంతేకాదు శృంగారంలో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. బెడ్రూంలో వీరిదే ఆధిక్యం.. అయితే అది కూడా సరదాగా ఉండి, భాగస్వామిని మరింత రెచ్చగొట్టేలా, సంతోషపెట్టేలాగే ఉంటుంది. అందుకే వృశ్చికరాశి శృంగారంలో బెస్ట్ పార్ట్నర్స్ అనొచ్చు. 


Image: Getty Images

సింహరాశి
సింహరాశివారు నమ్మకంగా, ఆకర్షణీయంగా ఉంటారు. శృంగారంలో లైంగికత విషయంలో చాలా చురుకుగా ఉంటారు. వారు తమ భాగస్వామితో శృంగారానికి సమయం కేటాయించడానికి బాగా ఇష్టపడతారు. ఎదుటివారికి ముగ్గులోకి దించడంలో వీరిది పైచేయి. వీరి ఆకర్షణతో ఎలాంటి వారినైనా ఇట్టే శృంగారానికి సిద్ధం చేయగలరు. వీరు ఫోర్‌ప్లేతోనే భాగస్వామిని బాగా ఆకట్టుకోగలరు. అంతేకాదు భాగస్వామిని అపురూపంగా చూసుకుంటారు. 

Image: Getty Images

మిథునరాశి
వీరి ద్వంద్వ వ్యక్తిత్వం సెక్స్ సమయంలో చాలా సరదాగా ఉంటుంది. ఈ సమయంలో భాగస్వామి మీదున్న విధేయత, ఆధిపత్యం రెండింటినీ బయటికి తీసుకువస్తారు. దీనివల్ల ఎదుటివారికి ఎప్పుడూ విసుగురాదు. మిథునరాశి వారు సెక్స్‌ను ఆసక్తికరంగా, ఆవేశపూరితంగా చేయడానికి ఏం చేయాలో తెలుసుకుని.. అలాగే చేస్తుంటారు. అంతేకాదు శృంగారంలో అందమైన అనుభూతిని పొందడం కోసం సెక్స్ టాయ్‌లను కూడా ఉపయోగిస్తారు.  

Image: Getty Images

తులారాశి
శృంగారంలో విచిత్రంగా వ్యవహరిస్తారు. అది వీరికి కూడా తెలుసు. తులారాశివారు సెక్స్‌లో అద్భుతంగా ఉంటారు. భాగస్వామి కోరుకున్న విధంగా వారిని ఎలా సంతోషపెట్టాలో వీరికి తెలుసు. ఎప్పుడూ భాగస్వామి లైంగిక అవసరాలు తెలుసుకుని వ్యవహరిస్తారు. కాబట్టి తులారాశితో సెక్స్ చేసినప్పుడు నిరాశకు గురికారు.

Latest Videos

click me!