మీరు కొనే చేపలు తాజావో, కాదో తెలుసుకోవాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి..

First Published | Jul 21, 2021, 4:54 PM IST

చేపలు తాజాగా ఉండాలి. పాడైపోతే కూర రుచి పాడవ్వడమే కాదు ఆరోగ్యానికే హాని కలుగుతుంది. అయితే చేపలు తాజావేనా, కాదా కనుక్కోడం ఎలా? మనలో చాలామందికి తెలియదు. అందుకే చేపలమ్మే వ్యక్తి మాటల్ని నమ్మి కొనేస్తుంటారు. 

చేపలు.. జలపుష్పాలు.. నాన్ వెజ్ లవర్స్ కి చాలా ఇష్టమైన పుడ్.. తక్కువ కొలెస్టరాల్ తో ఎక్కువ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో ఆరోగ్యానికి ఎంతో మంచిది.
చేపలతో ప్రై, పులుసు, ఇగురులే కాకుండా అనేక రకాల డిషెస్ చేస్తారు. అయితే మీ జిహ్వ కోరుకునే ఆ అద్భుతమైన రుచి కావాలంటే మాత్రం.. చేపలు కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

చేపలు తాజాగా ఉండాలి. పాడైపోతే కూర రుచి పాడవ్వడమే కాదు ఆరోగ్యానికే హాని కలుగుతుంది. అయితే చేపలు తాజావేనా, కాదా కనుక్కోడం ఎలా? మనలో చాలామందికి తెలియదు. అందుకే చేపలమ్మే వ్యక్తి మాటల్ని నమ్మి కొనేస్తుంటారు.
అయితే కొన్ని సింపుల్ విషయాలు తెలుసుకుంటే.. మీరే స్వయంగా చేపలు తాజావో కాదో తెలుసుకోవచ్చు.
చేప వాసన : చేపలేం వాసన వేస్తాయి.. నీచు వాసనే కదా అంటారా? కాదు.. కానీ చేపల వాసనను బట్టి అవి తాజావో కాదో తెలుసుకోవడం అన్నింట్లోకి బెస్ట్ అని నిపుణులు నమ్ముతారు.
చేపలు కొనేప్పుడు వాటి వాసన తాజాగా కాస్త సువాసనతో ఉండాలి. అంతేకానీ ఎలాంటి వాసన లేకుండా, పుల్లటి వాసన కలిగి ఉంటే అది మంచిది కాదు. సముద్రం లేదా చెరువు చేప కాస్త నీచు వాసన వస్తుంది.
అదే చేప స్ట్రాంగ్ వాసన వస్తుంటే అది పాడైపోయో, రసాయనాల్లో భద్రపరిచిందో అయుండాలి. ఇలాంటి వాసన వండిన తరువాత కూడా ఉంటుంది.
కళ్ళు అబద్ధం చెప్పవు.. అవును చేపల కళ్ళు అబద్ధం చెప్పవు. ఇది విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజం. చేపల కళ్ళు తెల్లటి నీరసమైన పొరతోని లేదా, మూసుకుపోయి ఉంటే అది తాజాది కాదు. తాజా చేపల కళ్ళు మెరుస్తూ, బ్లడ్జింగ్, ప్రకాశవంతంగా ఉంటాయి. అందుకే చేపల కళ్లు మబ్బుగా ఉండకపోతే తాజాదని గుర్తుపెట్టుకోవాలి.
చక్కటి ఆకృతి : చేప గట్టిగా, తాజాగా ఉండాలి. బైటికి మెరుస్తూ కనిపించాలి. డల్ గా ఉండకూడదు. అలాగే చేపలు కోసినప్పుడు ముక్క బౌన్స్ అవ్వాలి. కానీ చేతితో వత్తితే లోపలికి వెళ్లిపోకూడదు.
తాజా చేపల చర్మం మీద పొలుసులు గట్టిగా, సరైన ఆకృతిలో ఉంటాయి. పొలుసులు అంత సులభంగా ఊడిరావు.
చేప రూపం : ఖచ్చితమైన సీఫుడ్ లేదా చేపలను కొనేటప్పుడు మొదటి విషయం ఏమిటంటే చేపల రూపాన్ని పరిశీలించడం. ప్రకాశవంతమైన రంగుతో.. కళ్ళకు తెల్లటి పొర లేదని, మొప్పలు, తోక తాజాగా ఉన్నాయో లేదో చూడండి. కాస్త జారుడు గుణం ఉన్నట్టుగా కనిపించాలి. తా
జా చేపను కోసినప్పుడు ముక్కల్లో నుంచి బ్రైట్ పింక్ రంగులో రక్తం వస్తుంది.
మొప్పలను చూడండి : చేప మొప్పలు సరిగా చూస్తే చేప తాజాదా, కాదా సులభంగా తెలిసిపోతుంది. మొప్పలు ఎత్తి చూస్తే.. లోపలి భాగం బ్రైట్ గా ఉండే రెడిష్ పింక్ కలర్ లో ఉండాలి. అంతేకాదు తాజా చేప కాస్త తడిగా ఉంటుంది. అవి పట్టి ఎక్కువ కాలం కాలేదని ఇది నిర్ధారిస్తుంది.

Latest Videos

click me!