కట్టింగ్ టెక్నిక్స్ వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన టెక్నిక్స్. మీరు చేసే రెసిపీని బట్టి కూరగాయలను అడ్డంగా, నిలువుగా, నలుచదరపు ముక్కలుగా, లేదా పొడవుగా.. గుండ్రంగా రకరకాలుగా కోయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకపోతే మీ వంటకం దెబ్బతింటుంది.
ప్రతి వంటకానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కూరగాయలు కత్తిరించడం అవసరం. పండ్ల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఉదాహరణకు సలాడ్‌కు వేరే కట్టింగ్ స్టైల్ అవసరం.. కూరకి వేరేలాగా కోయాలి. అలాగే టాపింగ్ చేయడానికి కూరగాయలు లేదా పండ్లను కోసే విధానం వేరేగా ఉంటుంది. దీనివల్ల కూర ఆకారమే మారిపోతుంది.
మరి వేటికి ఎలా కత్తిరించాలి.. అసలు కూరగాయలు, పండ్లు కోయడంలో ఎన్నిరకాల పద్ధతులున్నాయి అంటే...
చిఫోనేడ్ : ఆకుపచ్చ ఆకు కూరలు లేదా హెర్బ్ లను సన్నగా కత్తిరించాల్సి వస్తే ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. దీంట్లో ముందుగా ఆకుకూరలను ఒకదనిమీద ఒకటి పెట్టి గుండ్రంగా మడిచి.. సన్నగా తరగడం వల్ల గుండ్రటి.. సన్నటి ముక్కలు ఏర్పడతాయి. ఈ రకమైన కట్టింగ్ పాస్తా, సూప్, కూరలు, పిజ్జా.. లేదా ఆకు కూరల వంటకాల మీద అలంకరించడానికి ఉపయోగించవచ్చు.
జూలియన్నే : ఈ పద్ధతిలో.. కూరగాయలు, పండ్లు లేదా మాంసాన్ని పొడవుగా కట్ చేస్తారు. ఈ పద్ధతిలో కోసిన ముక్కలు చాలా సన్నగా ఉంటాయి. దీన్ని మ్యాచ్ స్టిక్ కట్స్ అని కూడా అంటారు. ఈ సన్నటి, పొడవైన ముక్కలు 18 అంగుళాల మందంతో ఉండవచ్చు. అంతేకాదు కోసే కూరగాయలు లేదా పండ్లను బట్టి వీటి పొడవు మారుతుంటుంది.
క్యారెట్లు, బంగాళాదుంపలను ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ‘జూలియెన్డ్’ విధానంలోనే కోస్తారు. ఈ రకంగా కోయడానికి చెఫ్ కత్తి లేదా యుటిలిటీ కత్తి బాగా ఉపయోగపడతాయి.
బ్రూనోయిస్ : ఇవి చిన్న క్యూబ్స్ గా కూరగాయలను కోయడం. దీనికోసం ముందుగా కూరగాయలు, పండ్లను పొడవుగా కోసి తరువాత చిన్న నలుచదరపు ముక్కలుగా కోయాలి. దీన్ని ఎక్కువగా అలంకరణకు వాడతారు.
సాస్, పచ్చడిల్లో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తడ్కాస్, కూరలు ఇతర భారతీయ వంటలలో ఈ రకమైన కోసిన కూరగాయలను ఉపయోగిస్తారు. అలాగని మరీ చిన్నగా కోస్తే కీమాలా తయారైపోతుంది.
స్లైసింగ్ : కూరగాయలు, పండ్లను సన్నగా, గుండ్రంగా కత్తిరించడం ఈ పద్ధతిలో జరుగుతుంది. మాంసం, జున్నులను కోయడానికి ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు.
ఉల్లిపాయలు, టమోటాలు, దోసకాయ లేదా ముల్లంగిలను సాలడ్ కోసం ఎక్కువగా ఇలా కోస్తారు.
మైన్స్ : దాదాపుగా కీమాలాగా కొట్టేయడమే. ఈ పద్ధతిలో కూరగాయలను చాలాచిన్నగా కోస్తారు.. ఉదా. వెల్లుల్లిలాంటి వాటిని ఇలా కోస్తారు. దీనివల్ల వంటకంలో సులభంగా కలిసి పోవడమే కాకుండా మంచి రుచిని ఇస్తాయి.