చీరకట్టు.. మహిళల అందాన్ని మరింత వన్నెతేరేలా చేస్తుంది. చూసీ, చూపించనట్టుగా చూపిస్తూ.. సెక్సీ లుక్ ను ఇస్తుంది. అయితే చీరలు అందరూ కడతారు. కానీ కొంతమందికే బాగా సూటవుతాయి.
undefined
చీరకట్టులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఎలాంటి చీర కట్టుకోవాలి. వయసును బట్టి ఏ క్లాత్ సెట్ అవుతుందితో మొదలుపెట్టి ఫ్యాబ్రిక్ ఎంపిక నుంచి రంగు, మ్యాచింగ్ బ్లౌజ్, కట్టిన విధానం.. వరకు అనేక విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. చీరతో మీ అందం మరింతగా మెరిసిపోతుంది. అవేంటో చూడండి..
undefined
మీకు సరిగ్గా సూటయ్యే క్లాత్ ను ఎంచుకోండి. అంటే మీరు కాస్త బొద్దుగా ఉన్నారనుకోండీ షిఫాన్ లాంటి జారిపోయే క్లాత్ చీరలు బాగుంటాయి. మెరుపుతీగలా సన్నగా ఉంటే కాటన్ లాంటి స్టిఫ్ గా ఉండే చీరలు బాగుంటాయి.
undefined
అయితే కాటన్ చీరలు ఉతికిన ప్రతీసారి గంజి, ఐరన్ తప్పనిసరి అవి మెయింటేన్ చేయగలిగితేనే వాటిని వాడాలి. రెండు మూడు ఉతుకులకు రంగు ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాస్త ఆలోచించి ఎంచుకుంటే బెటర్.
undefined
ఇక ఫంక్షన్ల లాంటివాటికి లేదా రెగ్యులర వేర్ ఆఫీస్ లకు చీరలు కడుతుంటే.. షిఫాన్, రేయాన్, జార్జెట్ లాంటి వాటిని ఎంచుకోవాలి. ఇవి రోజంతా మీరు ఎలా ఉన్నా.. ముడతలు పడవు. హాయిగా క్యారీ చేయచ్చు.
undefined
రెగ్యులర్ గా చీరలు కడుతున్నట్లైతే.. ఒక రంగును ఎంచుకోవడం వల్ల మీరు ప్రత్యేకంగా, అద్భుతంగా కనిపించవచ్చు. బ్లాక్, గ్రే, గోల్డ్ నుంచి పింక్, మెరూన్, ఒంబ్రే మరెన్నో రంగులు అన్ని రకాల షేడ్స్ లో వస్తున్నాయి. సో ఒక కలర్ ఎంచుకుని అందులో షేడ్స్ తో చీరలు కడిగే అదిరిపోతారు.
undefined
లేదా కాంబినేషన్ కలర్స్ నీలం- గోధుమ, నలుపు - గ్రే, గ్రే-గోల్డ్ ఇలా మంచి బార్డర్లతో కడితే అందరి చూపూ మీ వైపే. ఇక బ్రైట్ కలర్స్ అందర్నీ మీ వైపు చూసేలా చేస్తాయి. అంతేకాదు వారి మనస్తత్వాన్ని పట్టిస్తాయి. పెళ్లిళ్లు, పంక్షన్స్ లాంటి వాటికి ముదురు రంగు చీరలు బాగుంటాయి.
undefined
చీర ఎంత ముఖ్యమో.. దానికి మ్యాచింగ్ జాకెట్ అంతకంటే ముఖ్యం. చీర అందాన్ని మరింత హైలెట్ చేసేది బ్లౌజ్.. ఏదో రంగు కలిసింది కదా అని వేయకుండా.. సరిగ్గా ప్లాన్ చేసుకుని మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్.. డిఫరెంట్ డిజైన్లతో వేస్తే మీ చుట్టూ చీర చుట్టుకున్నట్టు అందరి చూపులూ చుట్టేయడం ఖాయం.
undefined
చీర ఎంత ముఖ్యమో.. దానికి మ్యాచింగ్ జాకెట్ అంతకంటే ముఖ్యం. చీర అందాన్ని మరింత హైలెట్ చేసేది బ్లౌజ్.. ఏదో రంగు కలిసింది కదా అని వేయకుండా.. సరిగ్గా ప్లాన్ చేసుకుని మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్.. డిఫరెంట్ డిజైన్లతో వేస్తే మీ చుట్టూ చీర చుట్టుకున్నట్టు అందరి చూపులూ చుట్టేయడం ఖాయం.
undefined
చీరను అందరూ కట్టే మామూలు స్టైల్లో కాకుండా శారీ డ్రేపింగ్ ఇప్పుడు అనేక రకాలుగా ఉంటోంది. వాటిని ట్రై చేయచ్చు.అయితే ఏది ట్రై చేసినా.. మీరు కాన్ఫిడెంట్ గా ఉండడం ముఖ్యం. చీరను రోజంతా క్యారీ చేయాలంటే మీరు కట్టుకున్న పద్ధతి మీద మీకు గ్రిప్ ఉండాలి. సీతాకోకచిలుక, ఫ్రంట్ పల్లు, లెహెంగా స్టైల్ లాంటివి మీకు డిఫరెంట్ లుక్ నిస్తాయి.
undefined
సరైన ప్లేస్ లలో పిన్స్ పెట్టడం వల్ల చీరకు కరెక్ట్ షేప్ ఇవ్వచ్చు.
undefined
ఇక చీరకు మ్యాచ్ అయ్యే జ్యుయలరీ కూడా ముఖ్యమే. చీరను బట్టి సింపుల్ గా మెడలో ఒక చెయిన్ వేసుకోవాలా? చోకర్ లేదా లాంగ్ చెయిన్, ఇయర్ రింగ్స్.. రింగ్స్, పర్స్.. బ్యాంగిల్స్ ఇలా అన్నీ సరిగ్గా సెట్ కావాలి.. అప్పుడే మీరు చీరలో అందానికే అందంలా మెరిసిపోతారు.
undefined
డెయిలీ వేర్ కి చీరలు కడుతుంటే మెడలో చిన్న సింపుల్ గోల్డ్ చెయిన్, చెవులకు స్టడ్స్ బాగా సూటవుతాయి.
undefined