కామసూత్ర నుండి నేర్చుకోవాల్సినవి ఇవే..

First Published | Apr 28, 2022, 1:27 PM IST

కామసూత్ర.. శృంగారానికి సంబంధించిన అతి పురాతన పుస్తకం. ఇది కేవలం శృంగారభరితమైనదే కాదు ఆధ్యాత్మికత, విలువలు ఎలా ఉండాలో చెప్పే గ్రంథం కూడా. దాన్నుంచి ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన శృంగార జీవితానికి నేర్చుకోవాల్సిన అంశాలు ఇవే... 

Image: Getty Images

కామసూత్ర అనేది సెక్స్ పొజిషన్‌లు, శృంగారానికి సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించే వేదకాలంనాటి పుస్తకం మాత్రమే కాదు. అంతకంటే చాలా ఎక్కువ. ఆధ్యాత్మికతతో నిండిన, కామసూత్ర జీవితంలోని శృంగార సంబంధమైన అంశంమీద ఎక్కువ దృష్టి పెడుతుంది,  దీనివల్ల శారీరక, మానసిక ఆనందాన్ని ఎలా పొందాలో చెబుతోంది. ప్రయోగాత్మక సెక్స్ పొజిషన్లే కాకుండా కామసూత్ర నుండి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి ఐదు అంశాలు ఏంటో చూడండి. 

లైంగిక శక్తి
లైంగిక పరమైన శక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. ఆకలి, నిద్ర ఎలాగో మనిషికి శృంగారం అలాగే. అలాంటప్పుడు శారీరక దాహాన్ని తీర్చే శృంగారం సరిగా ఉండాలంటే లైంగిక శక్తి బాగుండాలి. అది బాగున్నప్పుడే ఇంద్రియాలు ఉద్రేకానికి లోనవుతాయి. సెక్స్ కోరికలు పుడతాయి.. భాగస్వామితో సరైన రీతిలో రెచ్చిపోవడానికి తోడ్పడుతుంది. అందుకే లైంగిక శక్తి తగ్గిపోకుండా చూసుకోవాలి. లైంగిక శక్తి మీద శ్రద్ధ చూపడం, దానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.


Image: Getty Images

సెక్స్ కోరికలు మంచివే..
శృంగారాన్ని కోరుకోవడంలో తప్పులేదు. నిజానికి, ఇది పవిత్రమైనది. లైంగిక ప్రేరేపణ అనేది అవమానం, ఇబ్బంది, అపరాధ భావాలకు సంబంధించినది అనే ఆలోచన పూర్తిగా తప్పు. సెక్స్ అనేది శారీరకంగా, మానసికంగా ఒకరికొకరు కట్టుబడి ఉండే వ్యక్తుల కలయిక.

శృంగారంలో సంకోచం.. 
మీరు, మీ శరీరం లైంగికతకు అనుగుణంగా ఉన్నప్పుడు, మీరు స్వేచ్ఛగా ఉంటారు. సెక్స్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. భారంగా అనిపించదు. సెక్స్‌తో విభేదాలు ఎదురైనప్పుడు అది ఒత్తిడిగా మారుతుంది. సెక్స్ ఎల్లప్పుడూ కోరికగా ఉండాలి; అది అవసరంగా మారకూడదు, అవసరంగా మారితే విషయాలు తప్పుగా పరిణమిస్తాయి. 

Thresome legs

శృంగారంలో విలువలు ముఖ్యం..
శృంగారంలో భాగస్వాములిద్దరూ కొన్ని విలువలు పాటించాలి. నిబద్ధతం, కట్టుబడి ఉండడం.. నైతికత లాంటివి ముఖ్యం. అప్పుడే సెక్స్ అర్థవంతంగా మారుతుంది. విలువలను కలిగి ఉండటం కూడా ఆ వ్యక్తి ఆధ్యాత్మికతను సాధించడంలో సహాయపడుతుంది. ఇద్దరు భాగస్వాములు వేర్వేరు విలువలు కలిగి ఉంటే.. సెక్స్ సమస్యలను సృష్టించడం మొదలవుతుంది.

లైంగిక సమస్యలు.. వ్యక్తిత్వానికి సంబంధం..
శృంగారపరమైన సమస్యలు అలా ఏదో.. గాలికి వచ్చినట్టుగా రావు.. అబ్యూజ్, హింస, అవమానించడం లాంటివి భాగస్వాముల మధ్య లైంగిక సమస్యలకు దారి తీస్తాయి. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల వల్ల ఎదుటివారిలో భయం కలుగుతుంది. దీంతో శృంగారసంబంధమైన సమస్యలు మొదలవుతాయి. అందుకే వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నంచాలి. 

Latest Videos

click me!