ఈ పచ్చి ఆకులను నమిలినా.. నోట్లో నుంచి వాసన రాదు

First Published | Jan 13, 2025, 3:17 PM IST

చాలా మందికి నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటుంది. కానీ దీనివల్ల గలగలా నవ్వలేరు. ఇతరులకు దగ్గరగా మాట్లాడలేరు. అయితే కొన్ని పచ్చి ఆకులతో నోట్లో నుంచి వాసన రాకుండా చేయొచ్చు. అవేంటంటే?

Remedies for bad breath

నోటిని బాగానే శుభ్రం చేసుకున్నా.. అయినా నోట్లో నుంచి దుర్వాసన ఎందుకు వస్తుందని చాలా మంది వాపోతుంటారు.  నిజానికి నోట్లో నుంచి దుర్వాసన రావడం చాలా సాధారణ సమస్య. కానీ ఇది ఇతరులతో దగ్గరగా మాట్లాడకుండా చేస్తుంది. చాలా సార్లు ఈ వాసన వల్ల  ఇబ్బంది కూడా పడాల్సి వస్తుంది. అవమానాలు పడాల్సి వస్తుంది. 

నోట్లో నుంచి వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే మీరు బ్రష్ చేసినా నోట్లో నుంచి వాసన వస్తుందంటే.. నోటిని, పళ్లను సరిగ్గా శుభ్రం చేయడం లేదని అర్థం. అలాగే నోట్లో బ్యాక్టీరియా పెరిగిపోవడం వల్ల కూడా నోట్లో నుంచి వాసన వస్తుంది. అయితే కొన్ని పచ్చి  ఆకులను నమిలితే మాత్రం నోట్లో నుంచి వాసన రావడం చాలా వరకు తగ్గుతుంది. అవేంటంటే? 
 



నోట్లో వాసన రాకుండా చేసే ఆకులు

తులసి ఆకులు

తులసి ఆకులను నమిలితే మీ నోట్లో నుంచి దుర్వాసన రావడం చాలా వరకు తగ్గుతుంది. తులసి ఆకుల్లో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను నమిలితో నోట్లో వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా తగ్గుతుంది. మీరు గనుక ప్రతిరోజూ ఉదయం 4 నుంచి 5 తులసి ఆకులను నమిలితే మీ నోట్లో నుంచి వాసన రావడం చాలా వరకు తగ్గుతుంది. 
 


వేప ఆకులు

వేప ఆకులు, వేప పుల్లలు, వేర్లు ఇలా వేపచెట్టు మొత్తం మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. నిజానికి వేపలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీన్ని దంతాలను శుభ్రపరచడానికి కూడా ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. వేపాకులు నోట్లోని బ్యాక్టీరియాను తగ్గించడమే కాకుండా.. దంతాలపై ఉన్న ఫలకాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. వేప పచ్చని పళ్లను తెల్లగా చేయడానికి కూడా సహాయపడుతుంది. 
 

పుదీనా ఆకులు 

పుదీనా ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ ఆకులు నమిలితే నోట్లో నుంచి వాసన రావడం కూడా తగ్గుతుంది. ఈ ఆకులను మీ నోట్లో వాసనను రీఫ్రెష్ చేస్తాయి. తాజా శ్వాసకు సహాయపడతాయి. పుదీనా ఆకుల్లో ఉండే మెంతోల్ నోటి దుర్వాసనను వెంటనే తగ్గిస్తుంది. పుదీనా ఆకులను నమిలితే మీ శ్వాస తాజాగా ఉండటమే కాకుండా నోట్లోని బ్యాక్టీరియా కూడా తగ్గుతుంది. 
 

Curryleaves benefits

కరివేపాకు

కరివేపాకును మనం ప్రతి కూరలో వేస్తుంటాం. ఇది కూరకు మంచి వాసనను ఇవ్వడమే కాకుండా నోట్లో నుంచి దుర్వాసన రాకుండా చేయడానికి కూడా సహాయపడుతుంది. కరివేపాకును నమిలితే చిగుళ్ల మంట, చిగుళ్ల క్షయం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది మీ దంతాలను హెల్తీగా ఉంచుతుంది. 

గిలోయ్ ఆకులు 

గిలోయ్ ఆకులను నోటి దుర్వాసనను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ ఆకులు నోటి దుర్వాసనను తగ్గించడానికి నేచురల్ రెమిడీగా ఉపయోగపడతాయి. రోజూ గిలోయ్ ఆకులను నమిలితే నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
 

ఆరోగ్యకరమైన దంతాలకు ఆకుపచ్చ ఆకులు

ఈ ఆకుపచ్చ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన దంతాలను, నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే నోటి సమస్యలను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ  ఆకులను నమిలితే మీ శ్వాస తాజాగా ఉంటుంది. అలాగే నోరు కూడా శుభ్రపడుతుంది. ఇవి ఎప్పుడూ మీ నోటిని పరిశుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి. 

ఎలా ఉపయోగించాలి?

నోటి దుర్వాసనను తగ్గించుకోవడానికి మీరు ఈ ఆకులను ఉపయోగించాలనుకుంటే గనుక ప్రతిరోజూ ఉదయం పరిగడుపున నమలాలి. అప్పుడే దీని ప్రయోజనాలను పొందుతారు. అలాగే వీటిని మీ ఆహారంలో కూడా చేర్చుకోవచ్చు. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ దంతాలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి. 

Latest Videos

click me!