ఉల్లిపాయను మనం సాధారణంగా వంటల్లో వాడుతుంటాం. ఇది రుచిని పెంచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీని రసాన్ని జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగిస్తారు. కానీ, మీరు ఎప్పుడైనా దాన్ని తాగారా? ఉల్లిపాయలో అలెర్జీ నిరోధక, క్యాన్సర్ నిరోధక , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, పొటాషియం, సోడియం, విటమిన్ ఎ, సి, ఇ మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి.