మ్యాట్రిమోనియల్ సైట్ లో రిజిస్టర్ చేసుకుంటున్నారా? అయితే ఈ నాలుగు విషయాలు తెలుసుకోవాల్సిందే...

First Published Sep 9, 2021, 12:53 PM IST

ఇదివరకటి రోజుల్లో పెళ్లిళ్ల పేరయ్యలు ఉండేవారు. వారు సంబంధాలు తీసుకురావడం.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు నేరుగా చూసుకునే ఏర్పాటు, అమ్మాయి సిగ్గులొలుకుతూ టీ అందించడం.. తెలిసిన వారి ద్వారా అబ్బాయి మంచి చెడ్డలు కనుక్కుని, ప్రొసీడ్ అయ్యేవారు. కానీ రోజులు మారిపోయాయి. ఇప్పుడీ తతంగం అంతా ఎవ్వరికీ నచ్చడం లేదు. అంత సమయం కూడా పెట్టలేకపోతున్నారు. 

నేటి రోజుల్లో అన్నీ ఆన్ లైన్ అయిపోతున్నాయి. ఇక పెళ్లి సంబంధాల విషయానికి వచ్చేసరికి ఇది మరింత ఎక్కువయ్యింది. మాట్రిమోనియల్ సైట్స్ లెక్కకు మిక్కిలిగా పుట్టుకొస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే మాట్రిమోనియల్ మోసాలూ పెరిగిపోయాయి. మాట్రిమోనియల్ చుట్టూ రకరకాల నేరాల సంఖ్యా పెరిగిపోతుంది. 

ఇదివరకటి రోజుల్లో పెళ్లిళ్ల పేరయ్యలు ఉండేవారు. వారు సంబంధాలు తీసుకురావడం.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు నేరుగా చూసుకునే ఏర్పాటు, అమ్మాయి సిగ్గులొలుకుతూ టీ అందించడం.. తెలిసిన వారి ద్వారా అబ్బాయి మంచి చెడ్డలు కనుక్కుని, ప్రొసీడ్ అయ్యేవారు. కానీ రోజులు మారిపోయాయి. ఇప్పుడీ తతంగం అంతా ఎవ్వరికీ నచ్చడం లేదు. అంత సమయం కూడా పెట్టలేకపోతున్నారు. 

దీనివల్లే మోసాల బారిన పడుతున్నారు. దీనినుంచి తప్పించుకోవడం ఎలా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మాట్రిమోనియల్ సైట్స్ లో మీ వివరాలు ఉంచేముందు ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి? ఎలాంటి వాటిని నమ్మాలి? అనే విషయాలు తెలిసి ఉండాలి. అవేంటో చూడండి. 

భద్రత, గోప్యత : న్యూ ఏజ్ మ్యాట్రిమోనీ సైట్‌లు ఆన్‌లైన్ ఎన్విరాన్ మెంట్ ను డేటా సెక్యూరిటీ, ప్రైవసీతో దృఢంగా మారుస్తున్నాయి. ఎవరైతే సైట్లలో ప్రొఫైల్స్ అప్ లోడ్ చేస్తారో వారికి కొత్త కొత్త టెక్నాలజీల ద్వారా విశ్వసనీయత చెక్ చేసి మరీ మోసాలు జరగకుండా చెక్ పెడుతున్నాయి. మ్యాట్రిమోనియల్ సైట్‌లు అందులో ఉన్నవారి వివరాలను చెక్ చేయడానికి చిన్న చెక్‌పాయింట్‌లను ఏర్పాటు చేస్తున్నాయి, దీనివల్ల తప్పుడు సమాచారానికి దూరంగా ఉండొచ్చు.
లేదంటే సమాచారాన్ని నమ్మి, మోసపోయి ఇబ్బందుల్లో పడాల్సి వస్తోంది. ఏదేమైనా, ఈ కొత్త తరం మ్యాట్రిమోనియల్ సైట్‌లు తమ విశ్వసనీయతను చాటుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. 

ఇన్ ఫ్లూయెన్స్ లో పడకండి : ఇది వరకటి రోజుల్లో.. అంతా అమ్మానాన్నలు, ఇంట్లో పెద్దవారి ఇష్టాల మీద ఆధారపడి పెళ్లిళ్లు జరిగేవి. కానీ సమాజం మారుతోంది. అమ్మాయి, అబ్బాయి ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, ఆలోచనలు కలిస్తేనే పెళ్లికి ముందడుగు పడుతోంది. ఈ అవకాశాన్ని మాట్రిమోనియల్ సైట్స్ అందిస్తున్నాయి. 

ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, అభిరుచులు తెలుసుకునే సదుపాయాన్ని విర్చువల్ గానే కల్పిస్తున్నాయి. దీనివల్ల జీవితంలో కలిసి నడవాల్సిన వారి మధ్య బంధం దృఢంగా మారుతుంది. 

సమయం, డబ్బు ఆదా : సాధారణంగా, ఈ సైట్‌లలో తమకు సరైన ప్రొఫైల్ దొరకడానికి చాలా వెతకాల్సి వస్తుంది. టైంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది. దీనికోసం ఎక్కువ డేటా ఇన్‌పుట్ అవసరం పడుతుంది. కానీ, న్యూ ఏజ్ మ్యాట్రిమోనీ సైట్‌లలో, సంబంధిత మంచి ఫలితాలను పొందడానికి AI తన పాత్రను పోషిస్తున్నందున వెతికే ఖర్చు తగ్గించబడుతుంది.

ఈ న్యూ ఏజ్ మాట్రిమోనియల్ సైట్లు వినియోగదారులకు వారి అభిరుచులకు, అవసరాలకు తగ్గ ఫ్రొఫైల్స్ ను మాత్రమే చూపిస్తాయి. దీనివల్ల టైం ఆధా అవుతుంది. అల్గోరిథంలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి, తద్వారా ఒకేరకమైన వ్యక్తులు కలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. 

marriage

ఈ న్యూ ఏజ్ మాట్రిమోనియల్ యాప్ ల ద్వారా మీ భాగస్వామిని కనిపెట్టడం చాలా సులభమవుతుంది. అభిరుచులు, అభిప్రాయాలు, వయసు, ఇష్టాయిష్టాలు ఇవన్నీ కలిస్తేనే ఒకరినొకరు చూసుకోవడానికి కుదురుతుంది. 

click me!