sex
సెక్స్ ఎల్లప్పుడూ ఉత్తేజకరంగా, సరదాగా ఉండదు. కొన్నిసార్లు, శృంగారం విసుగుపుట్టిస్తుంది. అంతగా మూడ్ రాదు. ఏదో పని కానిచ్చేశాం అన్నట్టుగా అయిపోతుంది. దీనికి కారణం బెడ్ మీద మీరు చేసే తప్పులే. ఈ తప్పులే శృంగారం సమయంలో ఇంద్రియాలను ఆనందించనివ్వవు.. దీంతో పాటు లైంగిక సమస్యలుగా మారి దంపతుల మధ్య దూరాన్ని పెంచుతాయి. అలా కాకుండా ఉండాలంటే ఆ తప్పులేంటో తెలుసుకుని సరిదిద్దే ప్రయత్నం చేయాలి.
తొందరపాటు...
కొంతమంది చాలా ఫోర్స్ గా ఉంటారు. ఉద్వేగంతో తొందపడుతుంటారు. అయితే ఇది పనికిరాదు. శృంగారం ఎప్పుడూ నెమ్మదిగా మొదలుపెట్టాలి. మీ భాగస్వామిని నెమ్మదిగా రెచ్చగొడుతూ.. మీరూ, తను మీ శరీరాలను పూర్తిగా శృంగారానికి ట్యూన్ చేయిండి. అంతేకాదు మీ భాగస్వామి ఎలా స్పందిస్తున్నారో, మీ భాగస్వామి మీకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తున్నారో అనే దానిపై దృష్టి పెట్టండి.
టైం చూసుకుంటూ...
చాలామంది అన్ని పనుల్లాగే శృంగారానికీ టైం ఫిక్స్ చేస్తారు. బెడ్ మీద ఓ పది, పదిహేను నిమిషాల్లో పని అయిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. అది అస్సలు మంచిది కాదు. అలాంటి మనస్తత్వం శృంగారం మీద ఆసక్తిని కలిగించదు. ఇలాంటి తప్పు అస్సలు చేయకండి.
sex addiction
డిఫరెంట్ ఫొజిషన్స్...
శృంగారంలో ఎప్పుడూ ఒకే పొజిషన్ బోర్ కొడుతుంది. అందుకే కొత్తగా ప్రయత్నించండి. ఇలా కొత్తగా ట్రై చేయాలనే ఆలోచనే మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. మీలో నూతనోత్తేజాన్ని నింపుతుంది. అంతిమంగా సెక్స్ మీకు ఆనందాన్నిస్తుంది.
మీ భాగస్వామితో మాట్లాడండి..
శృంగారంలో ఏదైనా కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటే.. ముందు చేయాల్సిన పని మీ భాగస్వామి అందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అని చూసుకోవడం. చాలామంది చేసే అతి సాధారణ తప్పు ఏంటంటే.. తామేం కోరుకుంటున్నామో.. తమ భాగస్వాములతో చర్చించకపోవడమే. ఇది ఇద్దరి మధ్య మనస్పర్థలకు కారణమవుతుంది.