Image: Getty Images
పురుషులు అతి మామూలుగా చెప్పే కొన్ని అబద్దాలను స్త్రీలు అబద్దాలు అని అస్సలు నమ్మరు. పరిస్తితులు మరీ దిగజారి అసలు వాస్తవం వెలుగులోకి వస్తేకానీ తమ పురుషులు తమకు అప్పటివరకు చెప్పింది అబద్దం అనేది వారు గుర్తించరు. స్త్రీలు నిజాలని నమ్మే అలాంటి అబద్దాలు ఏంటో చూడండి..
Image: Getty Images
బలవంతుడు, ధైర్యవంతుడు...
ప్రతీ పురుషుడు తాము ఎంతో బలవంతులమని, ధైర్యవంతులమని గొప్పలు చెప్పుకుంటాడు. చాలా మంది మహిళలు తమను సురక్షితంగా ఉంచే భాగస్వామితో ఉన్నాననే ఆలోచనను ఇష్టపడతారు. కానీ వాస్తవానికి, పురుషులు కూడా స్త్రీల వలె భావోద్వేగాలకు గురవుతారు. సున్నిత మనస్కులుగా ఉంటారు. వారికీ భయాలుంటాయి.
Image: Getty Images
సురక్షిత సెక్స్ పద్ధతులు
పురుషులకు సురక్షితమైన సెక్స్ విషయంలో చాలా అవగాహన ఉంటుందని.. తాము ఆ విషయాల పట్ల సరిగా ఉన్నామని స్త్రీలముందు భరోసా ఇస్తారు. అయితే పరిస్థితి దీనికి విరుద్దంగా ఉంటుంది. అయితే, పురుషులందరికీ సురక్షితమైన సెక్స్ పద్ధతులు తెలియవు. వారిలో కొందరు ఉన్నతంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఈ విషయంలో మహిళలు సెక్స్ పద్ధతుల సమయంలో అవగాహన కలిగి ఉండాలి. రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.
స్వయంకృషి....
చాలా మంది పురుషులు తాము తమ స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చామని, తాము సెల్ఫ్ మేడ్ అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ చాలా మందికి వారి తల్లిదండ్రులు, కుటుంబాల నుండి చాలా బ్యాకప్ ఉంటుంది. చాలామంది తమ తల్లిదండ్రుల ద్వారా పరపతి, డబ్బులతో పైకి వచ్చినవారే. కాబట్టి అలాంటి అబద్ధాలను నమ్మడం కేవలం అజ్ఞానం.
మేధో లక్షణాలు
పురుషులు తెలివైన మహిళలను ఇష్టపడతారు. వారి భాగస్వాములగా మారే క్రమంతో వారికి సంబంధించిన చిన్న చిన్న విషయాలను బాగా గమనిస్తారు. తమ స్త్రీలను చాలా ప్రత్యేకంగా భావిస్తారు. కానీ ఒకసారి పెళ్లయిన తర్వాత, వారు తమ భార్యలను తేలికగా తీసుకుంటారు, ఎందుకంటే భార్యలు అయ్యాక ఎక్కడికీ వెళ్లరనే నమ్మకం. పెళ్లైన తరువాత శృంగార విషయాలపై అంతకు ముందులా ఆలోచించరు. పెళ్లయిన తర్వాత పురుషులు రొమాంటిక్ గా లేకపోవడంతో మహిళలు నిరాశకు గురవుతారు.