తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా.? భారీ మూల్యం చెల్లించక తప్పదు.

First Published | Dec 31, 2024, 11:08 AM IST

మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో. ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని తప్పులు చేయకపోవడం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే అనారోగ్యానికి గురవుతామని మనందరికీ తెలిసిందే. అయితే తిన్న తర్వాత కొన్ని పనులు చేసినా మంచిది కాదనని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లు మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించకతప్పదని అంటున్నారు. 

శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో, ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా అంతే ముఖ్యం. మంచి అలవాట్లు మిమ్మల్ని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతాయి. తిన్న వెంటనే చేసే ఈ మూడు అలవాట్లకు దూరంగా ఉంటే ఆరోగ్యం మీ సొంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 


పడుకోవడం

కొంతమంది తిన్న వెంటనే విశ్రాంతి తీసుకుంటారు. కాసేపైనా కునుకు తీస్తుంటారు. మధ్యాహ్నం కూడా తినగానే వెంటనే పడుకుంటారు. అయితే ఇది అస్సలు మంచిది కాదు. తిన్న వెంటనే పడుకుంటే కడుపులోని యాసిడ్ వెనక్కి వస్తుంది. దీంతో అసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ఆహారం తీసుకున్న తర్వాత పడుకుంటే తిన్న ఆహారం వెనక్కి ప్రవహించడం మొదలవుతుంది. ఆహారం జీర్ణం కాక ఫుడ్ పాయిజన్ కూడా రావచ్చు. భోజనం చేసిన తర్వాత కొద్దిగా నడవడం అలవాటు చేసుకోవాలి. భోజనానికి, నిద్రకు మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. 

2. ಊట తర్వాత స్నానం

భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం అస్సలు మంచి అలవాటు కాదు. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణలో తేడా వస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావాలంటే రక్త ప్రసరణ సరిగ్గా ఉండాలి. స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో తేడా వచ్చి జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. 

ఇది కూడా చదవండి: రెండున్నర లక్షల్లోనే ఎలక్ట్రిక్‌ కారు..

నీరు తాగడం

కొంతమంది భోజనం చేసిన వెంటనే ఎక్కువగా నీళ్లు తాగుతారు. ఈ అలవాటు కూడా మానుకోవాలి. తిన్న తర్వాత ఎక్కువ నీరు తాగితే కడుపు నొప్పి, తిమ్మిరి వచ్చే అవకాశం ఉంటుంది. ఆహారం తీసుకున్న తర్వాత నీళ్లు తాగితే టాక్సిన్‌తో పాటు ఇన్సులిన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Latest Videos

click me!