ఈ 10 బ్రేక్ ఫాస్ట్ లతో...ఆరోగ్యం, దీర్ఘాయువు ఇట్టే మీ సొంతం..

First Published | Sep 15, 2021, 1:15 PM IST

మధ్యాహ్నానికి ముందు తీసుకున్న కేలరీలను కరిగించడం సులభమవుతుంది. అందుకే దీన్ని రోజువారీ దినచర్యలో భాగం చేయడం వల్ల  శరీరంమొత్తం యంత్రాంగాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల జీవితకాలం పెరుగుతుంది. 

ఉదయం బ్రేక్ ఫాస్ట్.. రోజులో అతి ముఖ్యమైన భోజనం. ఉదయాన్నే చేసే బ్రేక్ ఫాస్ట్ మీ మానసిక స్థితిని మెరుుపరచడమే కాకుండా.. రోజంతా ఉత్సాహంగా ఉండడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఉత్తేజాన్ని ఇస్తుంది. అందుకే అల్పాహారంలో కేలరీలు అధికంగా ఉండే సంతృప్తికరమైన ఆహారాన్ని తినాలి.

కారణం, మధ్యాహ్నానికి ముందు తీసుకున్న కేలరీలను కరిగించడం సులభమవుతుంది. అందుకే దీన్ని రోజువారీ దినచర్యలో భాగం చేయడం వల్ల  శరీరంమొత్తం యంత్రాంగాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల జీవితకాలం పెరుగుతుంది. దీనికోసం తీసుకోవాల్సిన కొన్ని టిఫిన్స్ ను ఏంటో చూడండి.. 


సాల్మన్ అవోకాడో టోస్ట్ : ఇది పోషకాలతో కూడి పవర్‌హౌస్‌గా ఉంటుంది. ఎందుకంటే సాల్మన్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడుకు మంచిది, అవోకాడోలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. జీవక్రియ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.

పోహా :  బాయిల్డ్ రైస్, ఉల్లిపాయలు, వేరుశెనగ, క్యారెట్, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పులతో తయారు చేసే పోహా ఎంతో రుచికరంగా ఉంటుంది. దీంట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉండి బరువు తగ్గడంలో గణనీయ పాత్ర పోషిస్తుంది. పోహాలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, అవసరమైన విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి.

ఉప్మా : నూనె, రవ్వ లేదా సెమోలినా, కరివేపాకు, వేరుశెనగ, ఆవాలు, శనగపప్పు, ఉప్పుతో తయారు చేస్తారు. సమతుల ఆహారంగా, ఆరోగ్యకరమైన ఆహార పదార్ధంగా సెమోలినా (రవ్వ) పరిగణించబడుతుంది. దీంట్లో ఇనుము, ఫోలేట్, విటమిన్-బి కాంప్లెక్స్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది వ్యవస్థ పనితీరును,రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

వెజిటబుల్ ఆమ్లెట్ : గుడ్లు, కూరగాయలు, ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ, ఉప్పు, నూనె లేదా బట్టర్ లేదా నెయ్యితో తయారు చేస్తారు. చేయడానికి చాలా ఈజీ. అంతేకాదు ఆరోగ్యకరమైన అల్పాహారం కూడా. ఇది ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. అధిక కేలరీలు లేకుండా చూస్తుంది. 

మూంగ్ చీలా : నానబెట్టిన పెసరపప్పు, పెరుగు/మజ్జిగ, ఉప్పు, పచ్చి మిరపకాయ, పసుపు, కొత్తిమీరలతో తయారు చేసిన ఈ సన్నని పాన్‌కేక్‌లు శరీరానికి కావాల్సిన అన్నిరకాల ఖనిజాలతో నిండి ఉంటాయి. వీటిల్లో ప్రోటీన్, ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణవ్యవస్థ పనిచేయకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

వోట్మీల్ : ఇది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉండే పాలు, వోట్మీల్, గింజలు, గ్రానోలాతో నిండిన పోషకాహార మిశ్రమం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక కప్పు ఓట్ మీల్ మిమ్మల్ని 4-6 గంటల పాటు సంతృప్తికరంగా ఉంచుతుంది.  తక్షణ శక్తిని కూడా అందిస్తుంది.

ఆరెంజ్, జీడిపప్పు స్మూతీ : ఈ ఫిల్లింగ్ స్మూతీలో మెదడును పెంచే ఒమేగా 3 లు, విటమిన్ సి ఉన్నాయి. ఇది సహజ కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. 

దోస : ఈ ఆరోగ్యకరమైన అల్పాహారం పులియబెట్టిన బియ్యం, మినప పప్పుతో తయారు చేయబడుతుంది. కొబ్బరి చట్నీ, సాంబార్‌తో బాగుంటుంది. ఈ మూడు కలయికల్లోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి .జీర్ణించుకోవడం చాలా సులభం. 

ధోక్లా : శెనగపిండి, పెరుగు, సెమోలినా, ఉప్పు, వేరుశెనగ నూనె, పంచదార, ఆవ గింజలు, కరివేపాకులతో తయారు చేసిన ఈ ఆరోగ్యకరమైన అల్పాహారంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది జీర్ణించుకోవడం చాలా సులభం. దీని చాలా తక్కువ నూనెను ఉపయోగిస్తారు. 

చికెన్ సాసేజ్‌లు : ఇంగ్లీష్ అల్పాహారం విషయానికి వస్తే, సాసేజ్‌లు తప్పనిసరి. ఇవి ప్రోటీన్, విటమిన్ బి 12,  ఇనుముతో నిండి ఉంటాయి. ఇవి కొవ్వు,ప్రోటీన్ రెండింటినీ జీవక్రియ చేయడానికి సహాయపడతాయి. ఫాస్ఫరస్ కూడా పుష్కలంగా ఉంటుంది. మూత్రపిండాల పనితీరును నిర్వహించడానికి, అలాగే బలమైన ఎముకలు, దంతాల నిర్మాణంలో ముఖ్యమైనది. 

Latest Videos

click me!