ఆకుకూరలు, కూరగాయలు తాజాగా, ఆకుపచ్చగా నవనవలాడుతూ ఉండాలని.. అవే ఆరోగ్యానికి చాలా మంచివని మనకు తెలుసు. కూరగాయలు, ఆకుకూరలు ఏమాత్రం వాడిపోయినా.. నలుపుగా మారినా మనం వాటిని వాడం. మన డైట్ లో ఎప్పుడూ ఆకుపచ్చవాటికే ఓటు వేస్తాం. అయితే ఇప్పుడు ఈ లెక్కలు మారిపోతున్నాయి.. ఆహారంలో నలుపును చేర్చాలని చెబుతున్నారు.. మీ డైట్ ప్లాన్ కి బ్లాక్ పెయింట్ చేయాల్సిన సమయం వచ్చింది, ఎందుకంటే.. ఈ బ్లాక్ ఫుడ్స్ చాలా సూపర్‌ఫుడ్‌ల కంటే ఆరోగ్యకరమైనవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంతకీ బ్లాక్ ఫుడ్స్ అంటే ఏంటీ? వాటిలోని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ?
ఆంథోసైనిన్స్ అనే పిగ్మెంట్స్ ఉన్న ఆహారాలను బ్లాక్ ఫుడ్స్ అంటారు. ఆంథోసైనిన్స్ ఎక్కువగా నలుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో కనిపిస్తాయి. వీటిల్లో అంతర్లీనంగా పోషకాలు,ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వర్ణద్రవ్యాలలో గొప్ప యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలామంచివి. క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
బ్లాక్ వాల్‌నట్స్ : ఒమేగా -3 ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అధికంగా ఉండే బ్లాక్ వాల్ నట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్‌నట్స్‌లో ఎల్లాజిక్ యాసిడ్ పుష్కలంగా ఉందని నిరూపించబడింది. ఇది కార్డియో-ప్రొటెక్టివ్ ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెబుతారు. వీటిల్లో అసంతృప్త కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి, ఇవి ఆకలిని నియంత్రించడంలో, కడుపు నిండిన భావనను కలిగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందువల్ల బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిలో మెలటోనిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది నిద్ర పోయే సమయాన్ని, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బ్లాక్ రైస్ : ఆగ్నేయాసియాలో ఈ బ్లాక్ రైస్ ఎక్కువగా పండుతుంది. నల్ల బియ్యంలో లుటీన్, జియాక్సంతిన్ అధికంగా ఉంటుంది. దీనివల్ల ఈ బియ్యం రుచిగా ఉంటాయి. మంచి కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో యాంటీ-ఆక్సిడెంట్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వలన క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ రైస్ ను పుడ్డింగ్‌లు, ఫ్రైస్, రిసోట్టో, గంజి, నూడుల్స్, బ్రెడ్‌లలో ఉపయోగించవచ్చు. ఖీర్ కూడా తయారు చేసుకోవచ్చు.
Black Dal
బ్లాక్ దాల్ : ప్రతీ ఇంట్లోనూ రెగ్యులర్ గా పప్పును వాడతారు. వీటిని గ్రేవీల్లో, మిగతా పప్పులతో కలిపి వాడతారు. అవి ఫైబర్, ఐరన్, ఫోలేట్, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటాయి. చాలా రుచికరంగా ఉంటాయి.
బ్లాక్ ఆలివ్ : వీటిలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, పాలీఫెనాల్స్, ఒలియోకాంతల్ లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని సలాడ్లు, పాస్తా, ఫ్రైస్, కొన్ని ఊరగాయలు, పానీయాల తయారీలో వాడతారు. అలాగే, ఈ బ్లాక్ ఆలివ్స్ ధమనుల్లో ఏదీ అడ్డుపడకుండా కాపాడటానికి, కంటి ఆరోగ్యానికి, DNA దెబ్బతినకుండా నిరోధించడానికి, చర్మ, జుట్టు సంరక్షణకు తోడ్పడుతుంది.
నల్ల నువ్వులు : వీటిని సాధారణంగా తిల్ అని పిలుస్తారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, కాల్షియం, జింక్, రాగి, సెలీనియం, విటమిన్ E లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో సెసమిన్ కూడా ఉంటుంది. ఇది వాపును, కీళ్ల నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వీటిని సలాడ్లలో గార్నిష్‌గా, లడ్డూలలో, బ్రెడ్‌లు, స్మూతీలు, సూప్‌లు, హమ్ముస్, డిప్స్, తహినిలో వాడతారు.
నల్ల ద్రాక్ష : రుచిలో తీపిపులుపు కలిసి ఉండే.. నల్ల ద్రాక్షలో లుటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇది రెటీనా దెబ్బతినడం, మాక్యులర్ క్షీణతను నిరోధిస్తుంది. ద్రాక్షలోని రెస్వెరాట్రాల్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. LDL స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఈ పండ్లలో ఉండే ప్రోఅంటోసైనిడిన్స్ చర్మ ఆరోగ్యానికి కూడా గొప్ప ప్రయోజనకారిగా ఉంటాయి. సలాడ్లు, స్మూతీలు, జామ్‌లతో, పెరుగు అన్నంలో నల్ల ద్రాక్షను వేసుకుని తినొచ్చు.
Black Garlic
నల్ల వెల్లుల్లి : వెల్లుల్లి సహజంగా నల్లగా ఉండవు. నల్ల వెల్లుల్లి కోసం వెల్లుల్లి రెబ్బలను పులియబెడతారు. దీంతో అవి నల్లగా మారుతాయి. వీటిని ఆసియా వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. వెల్లుల్లి వాడడం వల్ల వంటలు అద్భుతమైన రుచిని సంతరించుకుంటాయి. వీటిని ఫ్రైస్, మాంసం రొట్టెలు, బియ్యం, నూడుల్స్, సూప్‌లను తయారు చేసేప్పుడు రుచిని పెంచడానికి వాడతారు.
మంటను నివారిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కణాల నష్టాన్ని నిరోధించే లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ నుండి కాపాడతాయి. ఓ అధ్యయనాల ప్రకారం వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు , క్యాన్సర్ నిరోధక లక్షణాల వల్ల పచ్చి వెల్లుల్లి కంటే నల్ల వెల్లుల్లి చాలా మంచిది.
బ్లాక్ ఫిగ్స్ : తీపి రుచితో ఉండే ఈ బ్లాక్ ఫిగ్స్ ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్‌లో దొరుకుతాయి. వీటిల్లో బాగా పొటాషియం ఉంటుంది. జీర్ణశక్తిని పెంచే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గడంలో ప్రభావవంతంగా సాయం చేస్తుంది. క్యాన్సర్ కణాలతో పోరాడటానికి సహాయపడతాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
బ్లాక్‌బెర్రీస్ : గుండె ఆరోగ్యానికి ఎంతో మంచివి. మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం,బ్లాక్‌బెర్రీస్ రుతుస్రావం లేదా పీరియడ్స్ క్రమం తప్పే మహిళలకు మంచివి. యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాలలో బ్లాక్‌బెర్రీస్ కూడా ఒకటి. వీటిని స్మూతీలు, డెజర్ట్‌లు, సలాడ్‌లు లేదా పాన్‌కేక్‌లలో ఉపయోగించవచ్చు.
బ్లాక్ డేట్స్ : వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, విటమిన్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఫ్లోరిన్ అనే రసాయన మూలకం కూడా ఉంటుంది, ఇది దంత క్షయాన్ని తగ్గిస్తుంది. అధిక మొత్తంలో సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుం