11,250 టికెట్ కలెక్టర్ పోస్టుల భర్తీ ... యువతకు ఇండియన్ రైల్వే అద్భుత అవకాశం

First Published | Aug 13, 2024, 7:19 PM IST

భారత రైల్వేలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.  భారీగా టికెట్ కలెక్టర్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్  బోర్డు సిద్దమైంది. 

Railway Recruitment 2024

Railway Recruitment 2024 : భారత రైల్వే నిరుద్యోగులకు శుభవార్త అందించింది. అదిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ రైల్వే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాదు భారీ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇలా ఇప్పటికే లక్షలాదిమందికి ప్రత్యక్షంగా ఉద్యోగం, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రైల్వే తాజాగా మరింతమంది నిరుద్యోగ యువతకు జీవితంలో స్థిరపడే అవకాశం కల్పిస్తోంది. భారీ ఉద్యోగాల భర్తీకి ఇండియన్స్ రైల్వేస్ నోటిఫికేషన్ విడుదలకు సిద్దమైంది. 

Railway Recruitment 2024

రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు : 

భారత రైల్వేలో టికెట్ కలెక్టర్ (టిసి) ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించనుంది. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (RRB) 11,250 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్దమైంది. దీంతో రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతీయువకులతో పాటు ఇతర నిరుద్యోగులు కూడా ఈ ఉద్యోగాలను పొందేందుకు తీవ్ర  ప్రయత్నాలు మొదలుపెట్టారు. 
 


Railway Recruitment 2024

ఈ టిసి పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏదయినా కారణాలతో ఆలస్యమైన వచ్చేనెల సెప్టెంబర్ లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభంకానుంది. నోటిపికేషన్ కు సంబంధించిన వివరాల కోసం రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ indianrailways.gov.in పరిశీలిస్తూ వుండండి. 
 

అర్హతలు :  

రైల్వే టిసి ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్లలోపు వుండాలి. అయితే ఎస్సి, ఎస్టి,ఓబిసి అభ్యర్థులకు వయో సడలింపు వుంటుంది. నోటిఫికేషన్ లో వయోపరిమితి వివరాలను పేర్కొంటారు. 

భారతీయులై వుండి నిర్దేశిత వయసు, విద్యార్హతలు వున్నవారు ఈ రైల్వే టిసి పోస్టులకు అర్హులు. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ విద్యార్హతలు కలిగివుండాలి. విద్యార్హతలను కూడా నోటిఫికేషన్ లో పేర్కొననుంది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు. 

ఇక రైల్వేలో టిసి ఉద్యోగాల కోసం అభ్యర్థుల బౌతిక ప్రమాణాలను కూడా పరిశీలిస్తారు. అంటే నిర్దిష్ట ఎత్తుతో పాటు దృష్టిలోపం లేకుండా వుండాలి. ఇందుకోసం అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ కూడా వుంటుంది. 

ఇలా అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగాన్ని పొందవచ్చు. ఉద్యోగంలో చేరగానే నెలకు రూ.35,000 వేల సాలరీ పొందవచ్చు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను తెలియనున్నారు. 

Latest Videos

click me!