తమ చిన్నారి అడిగిందని బొమ్మ కొనిచ్చిన తల్లిదండ్రులు. ఆ తరువాత ఆ బొమ్మను చూసి షాకయ్యారు. చిన్నారి ఆ బొమ్మతో ఆడుకోవడం ప్రారంభిస్తే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుని వణికిపోయారు. ఇంతకీ ఆ బొమ్మలో ఏముందీ.. అంటే.. ఐదువేలకు పైగా ఫెంటానిల్ డ్రగ్స్ టాబ్లెట్స్ బైటపడ్డాయి.
పొరపాటున ఒక్కటి చిన్నారి మింగినా పరిస్థితి చేయి దాటిపోయేది. అసలు ఇది ఎక్కడ, ఎలా, ఎప్పుడు జరిగిందంటే... అమెరికాలోని అరిజోనాలో జరిగింది. అరిజోనాలో ఉండే దంపతులు తమ కూతురికి బొమ్మ కొనిద్దామని సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే షాపుకు వెళ్లారు.
అక్కడ ఓ బొమ్మ తమ చిన్నారిని ఆకర్షించింది. చూడడానికి ఎంతో ముద్దుగా ఉంది నొక్కితే లైట్లు వెలుతుతున్నాయి. మ్యూజిక్ వస్తుంది. దాంతో ఆ బొమ్మను కొన్నారు.
ఇంటికి వెళ్లాక అలాగే ఆడుకోవడానికి ఇవ్వకుండా సెకండ్ హ్యాండ్ బొమ్మ కదా అని శుభ్రం చేశాక ఇద్దామనుకున్నారు.
క్లీన్ చేయడం కోసం బొమ్మకున్న జిప్ తెరిచారు. వెంటనే షాక్ అయ్యారు. ఆ జిమ్ లో డ్రగ్స్ బైటపడ్డాయి.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదువేలకు పైగా ఫెంటానిల్ డ్రగ్స్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఆ బొమ్మ పాత యజమానే ఈ పని చేసి ఉంటాడని భావించారు.
వెంటనే ఫీనిక్స్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ బొమ్మను స్వాధీనం చేసుకుని, ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు సెకండ్ హ్యాండ్ బొమ్మలు కొనేటప్పుడు వాటిని బాగా పరిశీలించాకే కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు.